మన వ్యవసాయం

క్వినొవా సాగులో మెళకువలు

0
quinoa

క్వినోవా ఒక మంచి పోషక విలువలు కలిగిన ఆహార పంట . ప్రస్తుతం పాశ్చత్య దేశాలలో క్వినోవాకు ఒక ముఖ్య ఆహారంగా మంచి గిరాకి ఉన్న పంట. ఈ పంటలో 14 -18 % మాంసకృత్తులు లైసిన్ మరియు మిధియోనైన్ అనబడే అరుదైన అమైనో ఆమ్లాలు ,విటమిన్లు బి. డి .ఇ సూక్ష్మపోషకాలైన ఇనుము , కాల్షియం,మెగ్నీషియం మరియు పీచు పదార్దం కలవు. క్వినోవా  వెడల్పాటి ఆకులు గల ఏక వార్షిక ఆహార పంట. ఈ పంట సుమారు 1 – 1.5 మీ .ఎత్తు పెరుగుతుంది. క్వినోవాను ప్రధానంగా విత్తనం కొరకు సాగుచేస్తారు. వీటి విత్తనాల్లో మంచి పోషక విలువలు ఉన్నప్పటికి ,విత్తన పై పొరలో “సాపోనిన్లు “ ఉండటం వలన చేదు రుచి వస్తుంది. కావున విత్తన పై పొరను తప్పనిసరిగా తొలగించాలి . క్వినోవా విత్తనాలకు ఇప్పుడు ఇప్ప్పుడే మనదేశంలో కూడా డిమాండ్ ఉంది. కావున ఈ పంట సాగులో  కొన్ని మెళకువలు పాటించవలసిన అవసరం వుంది.

quinoa

quinoa production

విత్తన సమయం : – సాధారణంగా క్వినోవా పంట పూత దశలో చల్లటి వాతావరణం ఉండాలి. కావున ఈ పంటను యాసంగిలో నీటి వసతి కింద అక్టోబరు మొదటి పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తుకోవాలి. పంట పూత మరియు విత్తనం ఏర్పడే సమయంలో వర్షాలకు గురైతే  దిగుబడి మరియు నాణ్యత గణనీయంగా తగ్గుతుంది.

Also Read : దుర్భి ప్రాంతాలలో సాగు నీటి విస్తరణ

నేలలు :- ఈ పంటను ఎర్రనేలలు , నీరు ఇంకే మరియు నీరు పోయే వసతి గల నల్లరేగడి నేలల్లో సాగు చేసుకోవచ్చు. చౌడు నేలలు ఈ పంట సాగుకు అనుకూలం కావు .

విత్తన మోతాదు :- ఎకరానికి 1 – 1.5 కిలోలు , విత్తేటప్పుడు విత్తనం మరియు సన్నని ఇసుక 1:3  నిష్పత్తిలో కలిపి విత్తుకోవాలి .

విత్తే పద్ధతి :- ఈ పంటను నేరుగా వెదజల్లె పద్దతిలో విత్తుకోవచ్చు లేదా నారుమడి తయారు చేసుకొని 21 – 25 రోజుల మొక్కలను నాటవచ్చు . వరుసల మధ్య 45 సె. మీ ,మొక్కల మధ్య 20 సెం . మీ దూరం పాటించాలి .

ఎరువులు :- ఎకరానికి 50 కిలోల నత్రజని ,20 కిలోల భాస్వరం మరియు 20  కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వెయ్యాలి. నత్రజని ఎరువు సగం మోతాదు విత్తేటప్పుడు ,మిగతా సగం 35 – 40 రోజుల దశలో వెయ్యాలి.

నీటి యాజమాన్యం :-  క్వినోవా సాగుకు 350 – 400 మి.మీ  నీరు అవసరం అవుతుంది . కావున పంటకాలంలో నేలను బట్టి 4 – 5 తడులు ఇవ్వాలి. పూత దశలో గింజ కట్టే దశలో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి.

సస్య రక్షణ :- ఆకు తొలిచే పురుగు మరియు పూత దశలో రెల్ల రాల్చే పురుగు ఆశిస్తే  మోనో క్రోటోఫాస్ 20 మీ .లీ ఒక లీటరు నీటికి  కలిపి పిచికారి చెయ్యాలి. రసం పీల్చు పురుగులు ఆకులపైన , కాడల పైన ఉదృతి ఎక్కువైతే , డైమిధోమేట్ 20 మీ .లీ లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి.

quinoa

quinoa harvesting

పంట కోత & నూర్పిడి :- ప్రాంతాన్ని బట్టి క్వినోవా రకాలు 80 – 120  రోజుల్లో కోతకు వస్తాయి. కోత సమయానికి మొక్కలు, ఆకులు ఎండి పొలంలోనే రాలిపోతాయి . ఆ తర్వాత  పంటను కోసి నూర్పిడి చేసుకొని గింజలు వేరు చేసుకోవాలి. విత్తనాల పై పొరను తొలగించుకోవడానికి ప్రత్యేక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి.ఎకరానికి  సుమారుగా 6 – 8 క్వింటాళ్ళ దిగుబడి నమోదు కాబడినది. మార్కెటింగ్ కొరకు వ్యాపారులను సంప్రదించి  ఒప్పందం ఉన్నచో ఈ పంట సాగు లాభదాయకంగా ఉంటుంది.

డి.స్రవంతి ,పి . లక్ష్మణ్ రావు ,పి .నీలిమ , డా .పి శ్రీలత , కె .గోపాల కృష్ణ మూర్తి , ఎస్.  మధుసూదన్ రెడ్డి మరియు డా . యం. మాధవి , వ్యవసాయ కళాశాల , ఆశ్వారావు పేట

 

Also Read : యాసంగిలో ఆవాల సాగు మెలకువల

Leave Your Comments

రైతు కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా !

Previous article

ఏపీలో భారీగా పంట నష్టం…

Next article

You may also like