Organic Farming Techniques: అవలంబించవలసిన సాగు పద్ధతులు:
- అవసరమైన మేరకే నేలను దున్ని – నేల కోతను తగ్గించాలి.
- వ్యవసాయం అంటే పాడి పంట – దీన్ని దృష్టి లో పెట్టుకుని పంట టో పాటు పాడి పశువుల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
- అంతర కృషి చేస్తూ కలుపు సకాలం లో తీసి పంటకు తగినంత పోషకాలు అందేటట్లు చూడాలి.
- జీవన ఎరువుల ప్రాధాన్యత రైతులకు తెలిపి విరివిగా వాడేటట్లు చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా జీవన ఎరువుల ఉత్పత్తి ఎక్కువ చేసి రైతులకు అందజేయాలి.
- నీటి వనరులను సద్వినియోగం చేస్తూ, నేలలోని తేమను పరిరక్షించుటకు తగు సేద్య విధానాలను అవలంబించాలి.
- సస్య రక్షణ కు వృక్ష, జంతు సంబంధ మందులను వాడాలి.
- జీవ నియంత్రణ పద్ధతులకు ప్రాధాన్యత ఇచ్చి సస్యరక్షణ గావించాలి.
- పంట దిగుబడులు తగ్గకుండా, నాణ్యత చెడకుండా, ప్రకృతి ప్రసాదిత వనరుల ను ఉపయోగించుకోవాలి.
సేంద్రియ వ్యవసాయం లాభాలు:
- నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది.
- నేలలో “హ్యూమస్” నిల్వలు పెరిగి అన్ని పోషకాలను పంటలకు అందిస్తుంది.
- నేల భౌతిక, రసాయనిక, జీవ పరంగా అభివృద్ధి చెందుతుంది.
- నీటిని, పోషకాలను నిలువరించే గుణం పెరుగుతుంది.
- నీటి నిల్వ సామర్థ్యం, మురుగు నీరు పోవు సౌకర్యం కలుగుతుంది.
- నేల కాలుష్యం తగ్గి నాణ్యత తో కూడిని ఉత్పాదకత జరుగుతుంది.
- భూగర్భ జలాల కాలుష్య నివారణకు దోహద పడుతుంది.
- Buffering Capacity పెరుగుతుంది
- చీడ పీడల బెడద తగ్గుతుంది
- వానపాముల అభివృద్ధి ఇతోధికంగా సాయ పడుతుంది.
- పర్యావరణ సమతుల్యతకు దోహదపడుతుంది.
- నాణ్యమైన సురక్షిత ఆహారం లభిస్తుంది.
- నాణ్యత, నిల్వ వుండే గుణం పెరుగుతుంది.
- సుస్థిర సేద్యానికి, రైతు మనో వికాసానికి, దేశ ప్రగతికి మూలమవుతుంది.
సేంద్రియ వ్యవసాయం లో అవరోధాలు:
- మొత్తం సాగు భూమికి కావలసిన సేంద్రియ పదార్ధాన్ని సేకరించడం కష్టం.
- రైతులకు పశు పోషణ సామర్ధ్యం తగ్గి పశువులను పోషించలేక పోవడం వల్ల సేంద్రియ ఎరువుల తయారీ.
- రైతుల జీవన శైలిలో మార్పు వల్ల సేంద్రియ పదార్ధాల తయారీకి సుముఖం గా ఉండరు.
- సేంద్రియ ఎరువుల ప్రభావం మొక్క పెరుగుదలపై ఆశించినంత లేకపోవడం వల్ల రైతులు రసాయనిక ఎరువులపై మొగ్గు చూపిస్తున్నారు.
- కౌలుకు చేసే రైతులు సేంద్రియ ఎరువులపై శ్రద్ధ చూపరు.
- అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ లు సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా ఆశించిన ఫలితాలు రాక పోవచ్చు.
- సేంద్రియ ఎరువుల వలన నాణ్యత పెరిగినా దిగుబడులు రసాయనిక ఎరువుల వల్లే పెంచ వచ్చు.
- నీటి ఎద్దడి ప్రాంతాల్లో సేంద్రియ ఎరువుల సమీకరణ, సేంద్రియ సేద్యం కష్టతరమవుతుంది.
- సేంద్రియ ఎరువు పండించిన పంటకు మద్దతు ధర లేకపోవడం వల్ల రైతు దానివైపు మొగ్గు చూపడం లేదు.
Also Read: Organic Farmer Story: సేంద్రీయ వ్యవసాయం ద్వారా 3 లక్షలు సంపాదిస్తున్న రైతు
Leave Your Comments