Aloe Vera Cultivation: కలబందగా పేరు గాంచిన ఈ మొక్క తెలంగాణ అన్ని ప్రాంతాల్లో సాధారణంగా కనిపిస్తుంది. కలబందలో ఆకులు మందంగా ఉండి, రసయుతమై అంచులందు ముళ్ళు కలిగి ఉంటాయి. ఇది ఎడారి ప్రాతాల్లో కూడా పెరగగిలగే ఆకుపచ్చని బహు వార్షిక మొక్క. 30 నుండి 60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. ఆకులు 60 సెం.మీ. పొడువు, 10 సెం.మీ. వెడల్పు, 1.5 నుండి 2 సెం.మీ. మందం కలిగి ఉంటాయి. నవంబర్, ఫిబ్రవరి మాసాల మధ్య ఒక మీటరు ఎత్తు పెరిగే కాడపై ఎరుపు కలిసిన పసుపు పచ్చ వర్ణము గల పుష్పాలు ఏర్పడతాయి. అలోవెరా మొక్కల నుండి వచ్చే పసుపు వర్ణ రసాన్ని ఎండబెట్టి మూసాంబరాన్ని తయారు చేయడమనేది ప్రాచీన కాలంలోనే భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో ఉంది.

Aloe Vera
ఉపయోగములు:
కలబంద పత్రాల్లో రసాయనికంగా అలాయిన్, గ్లైకొసైడ్ మిశ్రమంగా ఉండి బార్బలాయిస్, ఐసోబర్బలాయిన్, బి-బార్బలాయిన్ వంటి ఐసోమర్లు ఉంటాయి. కలబంద ఆకులను నేత్రరోగాల నివారణ, అల్సర్ల నివారణ, చర్మ వ్యాధుల నివారణ, కాలేయ వ్యాధులు, కుష్టు వ్యాధి, మొలలు, మానసిక రుగ్మతులలో వాడతారు. కలబంద జెల్ ను చర్మ సౌందర్య క్రీముల తయారిలోను, ప్లీహమునకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో, విరేచనకారిగాను, ఋతుక్రమాన్ని క్రమబద్ద చేయడంలో వాడుతారు. కలబంద జెల్ ను వడదెబ్బ, అధిక వేడి, కాలిన గాయాలకు పైన వ్రాసినచో ఉపశమనం కలుగుతుంది.కుమారి ఆసవం, రజఃప్రవర్తనీవటి ఆయుర్వేద మందువ తయారీలోను ఉపయోగిస్తారు.
నేలలు: కలబంద అన్ని రకాల నేలలో సాగు చేయబుతుంది. కాని తేలిక నేలలే కలబంద సాగు అదిక ఫలితాల్ని ఇస్తుంది. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో కలబంద సాగు ఎక్కువగా జరుగుతుంది.

Farming
Also Read: అలోవెరాతో ఇంట్లోనే వైద్యం…
వాతావరణం: కలబంద వివిధ రకాల వాతావరణ పరిస్థితులలో పెంచవచ్చును. దీనికి తక్కువ వర్షపాతం, ఎక్కువ వేడి ఉన్న ప్రదేశాలలో కూడ పెంచవచ్చును. ఈ మొక్క తక్కువ ఉష్ణోగ్రత మరియు మంచు ప్రదేశాలలో పెంచడం కష్టం.
పంటకాలం: కలబంద నాటిన తరువాత 10 నెలలో మెదటి కోతకు వచ్చును. తదుపరి 4 నెలలకు ఒకసారి ఆకులు సేకరించవచ్చును. ఈ పంట 5 సం.ల వరకు దిగుబడిని ఇస్తూవుంటుంది.
విత్తన మోతాదు: కలబంద వేరు పిలక మొక్కల ద్వారా ప్రవర్థనము చెందుతుంది. ఎకరాకు 8-10 వేల పిలకల వరకు నాటుకోవచ్చును.
విత్తే దూరం: మొక్కల మధ్యదూరం 90X45 సెం.మీ. వరకు పెట్టవచ్చును.
ఎరువులు: ఎకరాకు 8-10 టన్నుల పశువుల పేడను ఎరువుగా వెయ్యాలి. ప్రతి సంవత్సరం ఎకరాకు అంతే మోతాదు ఎరువును వెయ్యాలి. ఇది కాకుండ 20:20:20 కి.గ్రా N:P:K ఎరువును అధిక ఉత్పత్తి కోసం వాడవచ్చును.
అంతర కృషి: కలబందను వర్షాధారంగా మరియు నీటి పారుదల ద్వారా పెంచిన పంటలో అధిక దిగుబడి వస్తుంది. వేసని కాలంలో మరియు వర్షాభావ పరిస్థితులలో నీటి సదుపాయం కల్పించడం ఆవసరం. కలబంద సాగులో క్రమము తప్పకుండా కలుపు మొక్కలు తీసివేయాలి. మొక్కల చుట్టు త్రవ్వడం మరియు మొదల్లలో మట్టి పోయడం చేస్తుండాలి.

Aloe Vera Crop
ప్రవర్థన పద్ధతి: వేరు పిలక మొక్కలు
సస్యరక్షణ: కలబంద పంటకు ఆశించు తీవ్రమైన తెగుళ్ళు ఎమీలేవు, అయితే ఇటీవల కాలంలో ఆకు మచ్చ తెగులును గుర్తించడం జరిగింది.
కోత: కలబంద మొక్క తాజా ఆకులు 60 సెం.మీ. పొడవు 10 సెం.మీ. వెడల్పు, 1.5-2.0 సెం.మీ. మందం కలిగినవి ఉదయం వేళలో కాని సాయంత్రం వేళలో కాని సేకరించాలి. బాగా పెరిగన తరువాత సంవత్సరంలో 3 సార్లు ముదిరిన ఆకులు సేకరించవచ్చును. కలబంద ఆకులే కాకుండా పిలికలను కూడా సేకరించవచ్చును.
దిగుబడి: కలబంద ఆకులు – మొదటి సం.లో ఎకరాకు 25,000 కిలోలు, రెండవ సం.లో 30,000 కిలోలు దిగుబడి వచ్చును.
Also Read: కలబంద సాగుతో మంచి రాబడి..