మన వ్యవసాయం

Teak cultivation: టేకు సాగు లో మెళుకువలు

0

Teak టేకు పెద్ద ఆకులు కలిగిన ఆకులు రాల్చు చెట్టు గుండ్రని శిఖరం కలిగి అనుకూల పరిస్థితుల్లో పొడవుగా పెరుగును. పొడగాటి సిలిండ్రికల్ కలిగి ఉండును.టేకు ఇండియా యొక్క అతిముఖ్యమైన కలప చెట్టు ఈ చెట్టు ప్రపంచం అంతా పేరుగాంచినద. ఈ చెట్టు కలపను విస్తారంగా ఫర్నీచర్ కోసం రైల్వే క్యారెజెస్ కొరకు మరియు వ్యాగర్స్ చెక్కుటకు ఇళ్ళ  నిర్మాణానికి ఉపయోగిస్తారు.

వాతావరణం:

ఈ చెట్టు ఎండిన ప్రాంతాల్లో ఎక్కడయితే ఎక్కువ ఉష్ణ మరియు కరువు ఉండునో అక్కడ కూడా పెరుగును. ఈ చెట్టు తీయగా వెచ్చగా మరియు ఉష్ణమయమైన వాతావరణంలో బాగా పెరుగును.

నేలలు:

  • ఈ చెట్టు ఎండిన ప్రాంతాల్లో ఎక్కడయితే ఎక్కువ ఉష్ణ మరియు కరువు ఉండునో అక్కడ కూడా పెరుగును.
  • ఈ చెట్టు తీయగా వెచ్చగా మరియు ఉష్ణమయమైన వాతావరణంలో బాగా పెరుగును.
  • టేకు అడవులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోను మరియు ఎత్తుపల్లాలున్న ప్రాంతాల్లో ఏర్పడి ఉన్నవి.
  • అలాగే చల్లనయిన అల్లువియర్ నేలలపై కూడా ఉన్నవి.
  • టేకు చెట్టుకు మురుగు నీటి సౌకర్యం చాలా అవసరం.

ముఖ్య లక్షణాలు:

  • పొడి ప్రాంతాల్లో నవంబర్-జనవరి నెలల్లో ఆకులు రాల్చును. కాని తేమ గల ప్రాంతాల్లో మార్చి వరకు ఆకులుండును.
  • కొత్త ఆకులు ఏప్రిల్-జూన్ వరకు వస్తాయి. షెన్సిల్ తెల్లని పూలు కలిగి ఉంటుంది.
  • దీన్ని వర్షాకాలంలో పండిస్తారు. కాయలు నవంబర్-జనవరి వరకు పండును తర్వాత క్రమంగా రాలిపోవును.

విత్తనాల ప్రోగు మరియు నిల్వః

  • కాయలు జనవరి-ఫిబ్రవరి మాసాల్లో చెట్ల క్రింద ఉన్న నేలలను శుభ్రం చేస్తూ ప్రోగు చేయాలి.
  • టేకు కాయలను 1200-3000 విత్తనములు 1 కేజీ బరువు ఉండును.

నాటుట:

  • 2X2 మీ. దూరంలో నాటవలెను. మరియు చెట్టు మధ్యదూరం అవసరం అనేది స్థలం మీద ఆధారపడి ఉంటుంది.

అంతర కృషి:

  • టేకు వనములో 3 ముఖ్యమైన అంతరకృషి పనులు ఏమనగా కలుపు నివారణం శుభ్రం చేయుట, పలుచన చేయుట.
  • కలుపు మొక్కలను ఎల్లప్పుడూ అంటే వర్షాకాలంలో ఎప్పుడయితే కలుపు విజృంభించి ఉండునో అప్పుడు 2వ సంవత్సరంలో ఒకే చోట రెండు ఉన్న కాండములను తీసివేసి చెడ్డ ఆకారంలో మరియు నష్టపరిచిన కాండములను క్రింది కొట్టి వేయబడును.
  • శుభ్రం చేసేటపుడు ఇతర జాతి చెట్లను టేకు చెట్టు పరిసరాల్లో ఉండకుండా తీసివేయవలెను.
  • స్థానిక పరిస్థితులను బట్టి టేకు వనములో ఎప్పుడు ఎంత పలుచన చెయ్యాలో అనేది మారుతూ ఉంటుంది. సాధారణంగా పలుచన చెయ్యటం సాధారణంగా 10-12 సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి.
  • ఇది 25-30 సంవత్సరాల వరకు చేస్తుండాలి.
  • తర్వాత వనములు ఎక్కువగా మరియు క్రమముగా అంతరములను పెంచుతూ పలుచన చెయ్యాలి.
  • వేగంగా పెరిగే వనములలో 5 సంవత్సరముల అంతరములో పలుచన చెయ్యడం సమంజసం.
Leave Your Comments

Fruit production: పండ్ల తోటల నుండి ఆశించిన దిగుబడులు రావాలంటే రైతులు వీటిని పాటించండి

Previous article

Eriophid Mite management in coconut: కొబ్బరిలో ఇరియోఫిడ్ నల్లి ని ఇలా నివారించండి

Next article

You may also like