Tamarind cultivation చింత చెట్టు పెద్దగా నిత్యం పచ్చగా ఉంటుంది. ఇది 100 అడుగుల ఎత్తు వరకు పెరిగి 15 అడుగుల వ్యాసం కలిగి ఉండును.ఇది గుండ్రంగా వ్యాపించే శిఖరం కలిగి ఉంటుంది.దీని ఆకులు 1.2-1.5 సెం.మీ ల పొడవు ఉండి 10-20 జతల లీఫ్ లైట్స్ సంయుక్త పత్రాలను కలిగి ఉండును.కలప గట్టిగా ఉండి బియ్యం దంచే సామాగ్రికి నూనె మరియు చక్కెర మిల్లులలో పనిముట్లను మరియు ఇతర ఫర్నీచర్స్ తయారీలో ఉపయోగిస్తారు.చింత చెట్టును నీడ కొరకు, అలంకరణ కొరకు మరియు కాయల కొరకు పెంచుతారు.ఇది సెంట్రల్ ఆఫ్రికాలో విస్తారంగా పెరుగును. ఇండియాలో చింత చెట్టు విస్తారంగా రోడ్ల వెంబడి గ్రాములలో ఉండును.వీటిని అరణ్య చెట్టుగా నాటేదరు.చింత చెట్టు దక్షిణ భారత దేశంలో సహజంగా పెరుగుతుంది.
వాతావరణం:
చింత చెట్టు ఉష్ణ మండల వాతావరణంలో పెరిగే చెట్టు ఈ చెట్టు నివసించే ప్రాంతాలలో 0-47° సెం.గ్రే ఉష్ణోగ్రత ఉండును. వర్షపాతం 500-1500 మిల్లీ మీటర్లు ఉండినచో ఈ చెట్టు బాగా పెరుగును.
నేలలు:
చింత చెట్టు వివిధ రకాలైన నేలల్లో పెరుగును. ఈ చెట్టు లోతైనా ఒండ్రుమట్టి గల నేలల్లో బాగా పెరుగును.ఈ చెట్టు కొద్దిగా క్షారత్వం గల మరియు ఉప్పు గల నేలలను తట్టుకొనును. ఈ చెట్టు ఆకురాల్చు అడవులలోనూ, ఎత్తు పళ్ళములున్నా ప్రదేశంలోనూ కొద్దిగా ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో కూడా పెరుగును.
నాటడం:
సూటిగా విత్తుట:
- చింత విత్తనాలను వరుసలలో నాగలి వెంబడి సూటిగా విత్తుకోవచ్చు.
- 45 చ.సెం.మీ దూరంలో (లేదా) 30 సెం.మీ లోతులో ఉన్న గుంతలో విత్తుకోవాలి. వరుసలలో విత్తేటపుడు 5X5 మీటర్ల దూరం పాటించాలి.
- 1 హెక్టారుకు 200 కేజీ విత్తనము అవసరమగును.
నారుపద్ధతి:
- కొత్తగా పోగుచేసిన విత్తనాలను నారుమడులలో మారిచ-ఏప్రిల్ నెలల్లో విత్తవలెను.
- మొలకెత్తుట ఒక వారంలో ప్రారంభమగును.
- నాటుటకు అవసరమయ్యే 30 సెం.మీ మొక్క కలిగి ఉండాలి.
- ఈ ఎత్తు 3-4 నెలల్లో పెరుగును.
- అలాంటి లేత మొక్కలను వర్షాకాలం చివరలో నాటుకోవాలి.
- ఒకవేళ లేత చెట్టు ఎత్తు పెరగక బలహీనంగా ఉన్నచో అలాంటి చెట్లను నారుమడిలో మరొక సంవత్సరం ఉంచి వచ్చే వర్షాకాలంలో నాటుకోవాలి.
- రోడ్ల ప్రక్కన నాటుటకు లేత చెట్లను 15×15 మీటర్ల దూరంలో 30 సెం.మీ పరిమాణం గల గుంతలో నాటాలి.
- పూర్తిగా చింతచెట్టు గల వనంలో 5×5 మీ దూరం పాటిస్తూ చెట్లు బాగా పెరిగిన తర్వాత 10×10 మీటర్ల దూరం పాటించాలి.
- గ్రామాలలోనూ పొలాల తీరుల వెంబడి చెట్లు నాటినచో 10×15 మీటర్ల దూరం పాటించాలి.