Sweet orange మన రాష్ట్రంలో ఈ తోటలు లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ 21.22 లక్షల టన్నుల పంట దిగుబడి నిస్తున్నవి. దిగుబడి షుమారుగా ఎకరాకు 10 టన్నులు. చీని, నిమ్మ పండ్ల నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మనూనె, నిమ్మ ఎస్సెన్స్ మొదలైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. పూలు, ఆకుల నుంచి పరిమళ ద్రవ్యాలు తయారు చేయవచ్చు.750 మి.మీ. వర్ష పాతం మరియు నీటి ఆధారం కల్గి,గట్టి ఈదురు గాలులు లేని ప్రాంతాలు అనుకూలం. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు సాగుచేయవచ్చు
మొక్కల ఎంపిక :చీనీలో రంగపూర్ నిమ్మపై కట్టిన వైరస్ తెగుళ్ళులేని అంట్లను, నిమ్మలో మొలకలు లేదా గజ నిమ్మలో రంగపూర్ నిమ్మకట్టిన అంట్లను ఎన్నుకోవాలి.
అంట్ల ఎంపికలో మెళకువలు :
వేరు మూలంపై 15 సెం.మీ. ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తరువాత 6-10 నెలల వయస్సుగల అంట్లను ఎన్నుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా మొదలైన వెర్రితెకుళ్ళు లేని అంట్లను ఎన్నుకోవాలి. కణుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి, ఆకుల పరిమాణం మధ్యస్థంగా ఉన్న అంట్లు నాణ్యమైనవి. ముదురు ఆకు దశలో ఉన్న అంట్లను ఎన్నుకోవాలి.
అంట్లు నాటే సమయంలో జాగ్రత్తలు :
అంట్లు నాటేటప్పుడు అంటు భాగం నేల మట్టం నుంచి 15 సెం.మీ. ఎత్తులో ఉండాలి. సాయంత్రం వేళళ్ళో అంట్లు నాటాలి. నాటిన అంట్ల ప్రక్కన కర్ర నాటి ఊతం ఇవ్వాలి.
నాటటం :
చీనీ, నిమ్మ మొక్కలను 6 x 6 మీటర్ల దూరంలో నాటాలి. సారవంతమైన నేలల్లో 8 x 8 మీ. దూరంలోనూ నాటుకోవచ్చు. మొక్కలను నాటడానికి ఒక నెల రోజుల ముందే 1 x 1 x 1 మీటరు పరిమాణం గల4 గుంతలను త్రవ్వి ఆర బెట్టాలి.
ప్రతి గుంతలోనూ పై పొర మట్టితో పాటు 40 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్ఫేటు, 100 గ్రాముల పది శాతం లిండేను పొడివేసి కలిపి నింపాలి.