మన వ్యవసాయంసేంద్రియ వ్యవసాయం

Sunlight Uses: సౌర శక్తి- మొక్కలకు ఎలా ఉపయోగపడుతుంది.!

1
Sunlight
Sunlight

Sunlight Uses: సౌర శక్తి – వెలుతురూ (కాంతి) టో బాటు ఉష్ణ శక్తినిస్తుంది. కాంతి మరియు ఉష్ణ శక్తి రెండూ మొక్కలకు అవసరం.మొక్కలలో గల ఆకు పచ్చని పత్రహరితము, నేల నుండి నీరు, సూర్యుని నుండి కాంతిని గ్రహించి కిరణజన్య సంయోగం ద్వారా పిండి పదార్ధాలను తయారు చేసుకుంటుంది.విత్తనాలు మొలకెత్తి, పెరుగుదలకు, పుష్పించడానికి ఫలాలు ఏర్పడడానికి కాంతి, ఉష్ణ శక్తి అవసరం.మొక్కలలో జరుగు అనేక జీవ రసాయన ప్రక్రియలలో అనేక ఎంజైములు అవసరం -ఎంజైములు పని చేయుటకు ఉష్ణ శక్తి అవసరం.

సౌర వికిరణం: సూర్యుని నుండి భూమి పైకి వచ్చే విద్యుదస్కాంత తరంగాలు యానకం లేకుండా వికిరణం చెందడాన్ని “సౌర వికిరణం” అంటారు. భూమికి సూర్యునికి మధ్య గల వాతావరణం ప్రత్యక్షం గా సౌర వికిరణం చేత వేడి చేయబడింది. అనగా సౌర శక్తి నేరుగా భూమి చేత శోషింపబడి ఉష్ణ శక్తి గా మార్పు చెందడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమి ఉష్ణోగ్రత పెరిగినప్పుడు- ఉష్ణ శక్తి నేల ఉపరితలం నుండి వాతావరణం లోని కి పరావర్తనం చెందుతుంది. దీనిని “భౌమ వికిరణం” లేదా “terrestrial radiation” అంటారు. దీని వల్ల భూ ఉపరితలానికి దగ్గర గల గాలి వేడెక్కుతూ పై పొరలకు ఉష్ణ శక్తి అందించబడుతుంది.

Also Read: Soil Components: నేల అంతర్గత భాగాల గురించి మీకు తెలుసా.!

Sunlight Uses

Sunlight Uses

కాంతి తీక్షణత: (LIGHT INTENSITY):

ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత (గాలిలో తేమ) లలో మార్పులను బట్టి కాంతి తీక్షణత లో మార్పులు వస్తాయి. కాంతిలో 1% మాత్రమే కిరణ జన్య సంయోగక్రియ లో ఉపయోగింపబడి రసాయన శక్తి గా మార్చబడుతుంది. అతి తక్కువ కాంతి తీక్షణత కిరణ జన్య సంయోగ క్రియ రేటును తగ్గిస్తుంది. పత్ర రంధ్రాలు మూసుకొని పోవచ్చు దీనివల్ల మొక్కల పెరుగుదల తగ్గుతుంది.ఎక్కువ కాంతి తీక్షణత -శ్వాస క్రియ రేటును ఎక్కువ చేస్తుంది.కిరణ జన్య సంయోగ క్రియ, శ్వాసక్రియ ల సంచలనానికి సంక్షోభం కలిగిస్తుంది.కాంతి తీక్షణత వల్ల ఎక్కువ నీటి నష్టం జరగడం వల్ల పత్ర రంధ్రాలు మూసుకొంటాయి. దీనివల్ల సరిపడినంత

CO, పత్ర రంధ్రాల ద్వారా ప్రవేశించక పోవడం వల్ల కిరణ జన్య సంయోగ క్రియ రేటును తగ్గిస్తుంది.కణ అంశాలు వాతావరణం లో గల ప్రాణ వాయువు చేత ఆక్సీకరణం చెందబడతాయి. దీనినే కాంతి- ఆక్సీకరణ (సోలరైజేషన్) అంటారు.కొన్ని జాతుల మొక్కలు (వరి, జొన్న, సజ్జ మొ) అధిక పొడి పదార్ధాన్ని (DRY MATTER) ఉత్పత్తి చేస్తాయి. అయితే మరికొన్ని పంటలు (తమలపాకు, పొద్దు తిరుగుడు పువ్వు, ప్రెస్ ఆపిల్, కాఫీ, అల్లం ) వేసవి లో పండించాలంటే కొంత నీడను ఇస్తే అధిక పొడి పదార్ధాన్ని ఉత్పత్తి చేస్తాయి.

కాంతి గుణం: ఒక సూర్య కిరణాన్ని విశ్లేషించినపుడు తెలుపు కాంతి ని ఒక పట్టకం ద్వారా పంపితే అది ఊదా రంగు నుంచి ఎరువు వరకు వివిధ రంగులు గల 400 – 750mu తరంగ దైర్ఘ్యాలు గా విక్షేపణ చెందుతుంది. ఈ తరంగ దైర్ఘ్య కాంతి నే కిరణ జన్య సంయోగ క్రియ లో వినియోగించబడుతుంది.

ఎరుపు, ఊదా మరియు నీల కాంతులు కిరణ జన్య సంయోగ క్రియ పెరుగుదలకు ఉపకరిస్తాయి. కంటే తక్కువ తరంగ దైర్ఘ్యము గల ×-రే, గామా కిరణాలు, అతి నీల లోహిత కిరణాలు, అదే విధంగా 750 mu కంటే ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల పరారుణ కిరణాలు మొక్క పెరుగుదలకు హానికరం.

Also Read: Medicinal Plant: సుగంధ తైల మొక్కల ప్రాముఖ్యత.!

Leave Your Comments

Soil Components: నేల అంతర్గత భాగాల గురించి మీకు తెలుసా.!

Previous article

Benefits of Eating Radish: ముల్లంగి తినడం వల్ల ప్రయోజనాలు.!

Next article

You may also like