మన వ్యవసాయం

Summer Kheera Cultivation: వేసవిలో కీరా సాగు మెళకువలు

0
Kheera
Kheera

Summer Kheera Cultivation: వేసవిలో దాహార్తిని తీర్చె సలాడ్ పంటగా కీరా సాగు విస్తరిస్తుంది. పచ్చి కూరగాయ గానె కాకుండా షర్భత్‌లలో కూడా అధికంగా ఉపయోగిస్తున్నారు. వేసవి కాలంలో ఉష్ణతాపాన్ని తగ్గించడంలో కీరా కీలక పాత్ర పోషిస్తుంది. వేసవిలో దాదాపు ప్రతి ఒకరు కీరాని తినకుండా ఉండరు. అంతే కాకుండా తక్కువ రోజులల్లో అనగా నెల కాలంలో పంట చేతికి వచ్చి రైతులకు లాభాన్ని తెచ్చిపెడుతుంది.

kheera

kheera

వేసవి కాలంలో కీరా సాగు చేసుకున్న రైతులకు చాలా లాభాలు ఉంటాయి.నేల తయారీలో భాగంగా నేలను 2-3 సార్లు బాగా దుక్కిని దున్నుకోవాలి.డ్రిప్ ఉన్నట్లైతే మల్చింగ్ పద్ధతిలో కీరాను నాటుకుంటె మంచి దిగుబడి వస్తుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ ,33.3కిలోల మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి.సంకర రకాలు అయితే 300-400 గ్రాములు,సూటి రకాలు అయితే 1కిలో విత్తనం ఎకరాకు సరిపోతుంది.

Also Read: ఎండాకాలంలో డీహైడ్రేట్ కాకుండా తీసుకోవలసిన పండ్లు..

విత్తన శుద్ధి చేసుకోవడానికి కిలో విత్తనానికి 5మి.లీ ఇమిడాక్లోప్రిడ్ ఎఫ్.ఎస్ కలుపుకోవాలి. తరువాత మైక్రోబియల్ ఏజెంట్ ట్రెకోడెర్మా విరిడి కిలో విత్తనానికి 4గ్రాముల చొప్పున కలుపుకొని నాటుకోవాలి. ఇలా విత్తన శుద్ధి చేయడం వలన నారు పెరిగే వరకు, పంట మొదటి దశలో కీటకాలు, తెగుళ్లు రాకుండా పనిచేస్తుంది. నాటుకోవడానికి 1.5మీ×45-50 సెం.మీ దూరాన్ని పాటించాలి.

విత్తనం మొలకెత్తిన తరువాత అనగా రెండు ఆకుల దశలో మరియు నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు, రెండు సార్లు బోరాక్స్ ను లీటరు నీటికి 3గ్రా.ల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేల అది‌ చేసుకోలేక పోయినట్లు అయితె పూతకు ముందు 10లీ.నీటికి 2.5గ్రా సైకోసెల్ లేదా 2.5 మిల్లి.లీ ఇథరిల్ ను కలిపి వారానికి ఒకసారి, అలా రెండు సార్లు పిచికారి చేసుకోవాలి. విత్తిన 20-30 రోజులలో ఒకసారి, కాయ పూత దశలో ఒకసారి ఎకరానికి 45 కిలోల యూరియాను పైపాటుగా ఇచ్చుకోవాలి.

Kheera Cultivation

Kheera Cultivation

వేసవిలో డ్రిప్ పద్ధతి ఏర్పాటు చేసుకుంటె తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. అవసరమైన యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను సమ భాగాలుగా చేసుకొని డ్రిప్ ద్వారా వారానికి రెండు సార్లు ఇచ్చినట్లైతే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. కీరాలో ఎక్కువ ఎండ వాతావరణం ఉన్నపుడు పూత, పిందె రాలడం సాధారణంగా గమనిస్తాము.

ఇలా రాలకుండా ఉండడానికి లీటరు నీటీకి 5గ్రా. సూక్ష్మధాతు మిశ్రమం, 0.23మి.లీ ప్లానోఫిక్స్‌ను 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకుంటె పూత పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. కీరలో వెర్రి తెగులు వైరెస్ వల్ల సోకుతుంది. ఇది అధిక నష్టాలను కలుగ చేస్తుంది. ఈ వైరస్ అనేది మొక్కలకు సోకినప్పుడు ఆ మొక్క గిడుసవారి పోయి పూలు కాయ ఏమి ఏర్పడకుండా గొడ్డుబారిపోతుంది. ఇలాంటి మొక్కలను దూరంగా గుంటలో వేయాలి లేదా మంటలో వేసి నాశనం చేయాలి. ఇది తామర పురుగు లేదా ఇతర రసం పీల్చు పురుగుల ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకి సంక్రమించడం జరుగుతుంది.

Summer Kheera Cultivation

Summer Kheera Cultivation

కనుక ఈ తామర పురుగులను నివారించుకోవడానికి లీటరు నీటికి 2మి.లీ. డైమిథోయేట్ లేదా 0.35మి.లీ ఇమిడాక్లోప్రిడ్ అనే మందును కలిపి పిచికారి చేసుకోవాలి. వీటి ఉదృతిని తగ్గించుటకు జిగురు అట్టలను అమర్చాలి. తరువాత బూడిద తెగులు వలన ఆకుల మీద బూడిద మచ్చలు ఏర్పడి పండు బారి ఆకులు రాలిపోతూ ఉంటాయి. దీనిని గమనించిన వెంటనే లీటరు నీటికి 1గ్రా. కార్బెన్డైజిమ్ మరియు మాంకోజెబ్ రెండు కలిపి ఉన్న మందుని లీటరు నీటికి 2గ్రా. కలిపి పిచికారి చేసుకొని వీటిని అదుపులో పెట్టుకోవాలి.

Also Read: అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే అత్యుత్తమ ప్రయోజనాలు

Leave Your Comments

Kesar Badam Lassi: వేసవిలో కేసర్ బాదం లస్సీతో ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Pomegranate Farming: పిన్‌హోల్ బోరర్ వ్యాధి కారణంగా దానిమ్మ తోటకు తీవ్ర నష్టం

Next article

You may also like