నిత్యవసరాలలో పప్పుధాన్యాల పాత్ర చాలా ముఖ్యమైనది. నేటి ఆధునిక కాలంలో వీటికి చాలా డిమాండ్ ఉంది. రైతులు వాణిజ్య పంటల సాగు మీద ఆసక్తితో రైతులు అపరాల పంటల సాగునే విస్మరించారు. వరికి తోడుగా వాతావరణ పరిస్థితులు వానాకాలం సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు మేలైన వంగడాలు ఉన్నప్పటికీ రైతులకు అవగాహన లోపం పంట గిట్టుబాటు ధరలు నిర్థిష్టంగా లేకపోడం, ఈ అపరాల సాగు దిగుబడి గణనీయంగా తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఈ తరుణంలో కనీసం రకాల మీద అవగాహన పెంచుకొని రైతాంగం అపరాల సాగు మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పప్పు ధాన్యాల పంటలో కంది పంటకి ప్రముఖ స్థానం ఉంది .
- కందులు ఆహారంలో మాంసకృతులు కొరతను తీరుస్తాయి .పెరిగే పిల్లల నుండి వృద్దుల వరకు తీసుకునే ఆహారంలో తగినంత మాంసకృతులు లేనిచో దేహ దారుఢ్యం ఉండదు .
- కందులు విటమిన్లు ,ఖనిజాలను ఎక్కువగా కలిగి ఉంటాయి .
- 22 % ప్రోటీన్లు ఉంటాయి .కందిపప్పు నిత్యావసర సరుకులలో ఒకటి .
- కంది పంట రోజు రోజుకి నిస్సారమవుతున్న సాగు భూములను పూర్వ స్థితికి తీసుకురావడానికి ఎంతో సహాయపడుతుంది.
- కంది పంట వేర్లు వాతావరణం లోని నత్రజనిని సంగ్రహించి వేరు బొడిపెల ద్వారా నేలకు అందిస్తాయి. రైజోబియం బాక్టీరియా వేరు బొడి పెలలో ఆవాసం ఏర్పరచుకొని నత్రజని స్థిరికరణకు తోడ్పడుతుంది. పప్పు ధాన్యాల పంటలు పశువులకు మేతగా ఉపయోగపడతాయి .
కంది పంట –విస్తీర్ణం :
- తెలంగాణ రాష్ట్రంలో 2. 49 లక్షల .హెక్టర్ లలో సాగుచేయబడుతుంది .
(2015–16 లెక్కల ప్రకారం)
- ఆంధ్ర ప్రదేశ్ లో కంది పంట 4. 01 మి.హె లలో సాగుచేయబడుతుంది.
మన తెలుగు రాష్ట్రాలలో సాగుకు అనువైన మరియు అందుబాటులో ఉన్న కంది పంట రకాలు :
1.పల్నాడు LRG 30 : 170 – 180 రోజులు (ఖరీఫ్ )
గుణగణాలు :- మొక్క గుబురుగా పెరిగి కాపు మీద పక్కలకు వాలిపోతుంది .పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి .గింజ మధ్యస్థ లావుతో గోధుమ రంగులో ఉంటుంది .మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు అనువైన రకం. రబీకి కూడా అనుకూలం. ఎండు మరియు వెర్రి తెగులను తట్టుకోలేదు.
దిగుబడి : 8.8 -10 క్వి /ఎ
2.మారుతి : పంట కాలం : 155 -160 (రోజులు)
గుణగణాలు :- మొక్క నిటారుగా పెరుగుతుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి .వరి మాగాణి గట్ల మీద పెంచడానికి అనువైనది.
దిగుబడి :8 క్వి/ఎ
3.అభయ : పంట కాలం : 160 – 165 రోజులు (ఖరీఫ్)
గుణ గణాలు :- మొక్కలు నిటారుగా పెరిగి కాయలు గుత్తులుగా కాస్తాయి. గింజలు మధ్యస్థ లావుగా గోధుమ రంగులో ఉంటాయి. కాయతొలుచు పురుగును కొంతవరకు తట్టుకుంటుంది .
దిగుబడి : 8-8.5 క్వి /ఎ
4.లక్ష్మీ ICPL 85063 : పంట కాలం : 160 –180 రోజులు (ఖరీఫ్)
గుణ గణాలు :- చెట్టు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలు కలిగి ఉంటుంది. ఎండ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. రబీ లో విత్తినప్పుడు ప్రధానమైన కొమ్మలు ఎక్కువగా ఉంది ఎక్కువ దిగుబడి యిస్తుంది. గింజలు లావుగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి.
దిగుబడి :7.2 -8 క్వి /ఎ
5.ఆశ: పంట కాలం :- 170 -180 రోజులు (ఖరీఫ్) ICPL 87119
గుణ గణాలు :- చెట్టు గుబురుగా ఉండి ఎకువ కొమ్మలు కలిగి ఉంటుంది. ఎండ తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. రబీ లో విత్తినప్ప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉండి దిగుబడి ఎక్కువగా వస్తుంది. వెర్రి తెగులును కూడా తట్టుకుంటుంది. గింజలు ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి.
దిగుబడి :7.2 -8 క్వి /ఎ
6. హెచ్ వై 3 సి : పంటకాలం :190-200 రోజులు (ఖరీఫ్ )
గుణ గణాలు :- ఎర్ర పూత ఉండి ,కాయలు వెడల్పుగా ఉంటాయి. గింజలు తెలుపు, పచ్చ గింజలను కూరగా ఉపయోగించవచ్చు. ఎండు మరియు వెర్రి తెగుళ్ళను తట్టుకుంటుంది .
దిగుబడి : 6.4 -7.2 క్వి /ఎ
7.ఎమ్ ఆర్ జి 66: పంట కాలం :180 రోజులు
గుణ గణాలు :- నల్ల రేగడి భూములకు అనువైనది. గింజలు మద్యస్థంగా ఉంటాయి. మాక్రోఫోమినా తెగుళ్ళను కొంతవరకే తట్టుకుంటుంది.
దిగుబడి :8.8 -9.6 క్వి /acre
8.ఎల్ ఆర్ జి 38: పంట కాలం 170 రోజులు (ఖరీఫ్ ),120 -130 రోజులు (రబీ )
గుణ గణాలు :- మొక్కలు ఎత్తుగా ,గుబురుగా పెరుగుతాయి .పువ్వులు పసుపు పచ్చగా ఉంటాయి .గింజలు లావుగా గోధుమ వర్ణంలో ఉంటాయి .తొలకరి రబీకి కూడా అనుకూలం.
దిగుబడి :8-8.8 క్వి/acre
9.డబ్ల్యు ఆర్ జి 27: పంట కాలం :180 రోజులు (ఖరీఫ్ ),120 -130 రోజులు (రబీ )
గుణ గణాలు :- మొక్కలు ఎత్తుగా ఉంటాయి. పువ్వులు ఎరుపుగా ఉంటాయి. కాయలు ఆకు పచ్చగా ఉంటాయి. గింజలు గోధుమ వర్ణంలో ఉంటాయి .
దిగుబడి :8- 8.8 క్వి /ఎ
- దుర్గ ఐసిపిఎల్ 84031: పంట కాలం :115 – 125 రోజులు (ఖరీఫ్ )
గుణ గణాలు:- అధిక దిగుబడిని ఇచ్చే స్వల్ప కాలిక రకం ,కాయ తొలుచు పురుగు బారినుండి తప్పించుకుంటుంది.ఉత్తర తెలంగాణా జిల్లాలకు ఖరీఫ్ పంటగా అనువైంది.
11 .పి ఆర్ జి 100: పంట కాలం :145 -150 రోజులు (ఖరీఫ్ )
గుణగుణాలు :- ఎండు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. తెలంగాణ మరియు రాయలసీమలోని కొన్ని తేలికపాటి ఎర్ర చల్కా నేలల్లో వర్షాధారంగా సాగుచేయటానికి అనువైనది.
12.ఐసిపిఎల్ 332 WR (TDRG 4): (హనుమ)
ఇది వ్యవసాయ పరిశోధన స్థానం (రంగారెడ్డి)నుండి విడుదల చేయబడిన రకం .ఇది ఎండ తెగులును తట్టుకుంటుంది ,శనగ పచ్చ పురుగును కూడా తట్టుకుంటుంది.
13.ఐసిపిఎల్ 14003 (PRG 176): (UJWALA)
ఈ రకం ప్రాంతీయ వ్యవసాయం పరిశోధనా స్థానం పాలెం ,మహబూబ్ నగర్ నుండి విడుదల చేయబడింది.
పంట కాలం :130 రోజులు
ఈ రకం బెట్టను తట్టుకుంటుంది. ఎర్ర రేగడి నేలలు (నల్గొండ ,మహబూబ్ నగర్) ప్రాంతాలకు బాగా అనువైనది.
|