Sugarcane చెఱకు పంట ద్వారా పంచదార ,బెల్లం, ఖండసారి ,మొలాసిన్ , ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం,సాగుభూమి , సాగు పద్ధతులు , సస్యరక్షణ , సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి .
చెఱకు పంటలో లభించే చెరకు చెత్త పంటకు కావలిసిన పోషకాల లభ్యతకు మంచి ఆధారము. చెరుకు సాగులో ఒక హెక్టారుకు 10 నుండి 12 టన్నులు వరకు చెత్త ఉత్పత్తి అగును. చెరకు చెత్తలో 28.6% సేంద్రియ కర్బనము, 0.42% నత్రజని, 0.15% భాస్వరము మరియు 0.50 నుండి 0.42% పొటాషియం మరియు సూక్ష్మపోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఇనుము, జింకు 0.2-0.9 శాతము మేర కలిగి ఉంటాయి. చెరకు చెత్తను భూమిపై పలుచగ పరచడం. వల్ల అవసరమైన మూలకాలు నేలకు అంది. భూమి యొక్క భౌతిక, రసాయన మరియు జీవశాస్త్ర అంశాలను కూడ ప్రభావితం చేసి భూమిలో నీటిని పట్టి వుంచే శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా నేల యొక్క ఉదజని సూచిక మరియు విద్యుదాత్మకతను తగ్గిస్తు మట్టి రేణువులన్ని సమానంగా కలిసిపోయి నీరు ఇంకే గుణాన్ని పెంచుతాయి.
చెరుకు చెత్తను నేలపై పరచడం వల్ల నేల యొక్క స్థూల సాంద్రత కూడా పెరిగి నేలలోకి నీరు చొచ్చుకొని పోయే సామర్థ్యం తగ్గుతుంది. చెరకు చెత్త సులభంగా చివికిపోవడానికి కుళ్ళింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి బయోమినరలైజర్ వంటి వాటిని ట్రైకస్, ఆస్పర్జిల్లస్, పెన్సీలియం, మరియు ట్రైకోగ్రామా శిలీంద్రాలను ఉపయోగిస్తారు. కుళ్ళింపు ప్రక్రియలో భాస్వరము లభ్యతను పెంచడానికి 1 టన్ను చెత్తకు 5 కిలోల రాక్ ఫాస్ఫేట్ ను కలుపుతారు. ఒక టన్ను చెరకు చెత్త నుండి 50 కిలోల వరకు మంచి ఎరువు లభ్యమగును. దీని ప్రాముఖ్యతను తెలియని రైతాంగం చెరకు తోటలు నరికిన తరువాత చెరకు చెత్తను కాల్చి నేలను సారవిహీనం చేస్తున్నారు. చెరకు చెత్తను కాల్చడం వలన కేవలం పోషక పదార్థాలైన నత్రజని, భాస్వరము, పొటాష్లు నష్టపోవడమే కాక భూసారము, భూభౌతిక స్వభావము పెంపొందించే సూక్ష్మజీవులు మరియు సేంద్రియ పదార్థాలను కూడా నష్టపోతున్నారు.
సామాన్యంగా ఆలస్యముగా నాటిన చెఱకు తోటలలో వేసవి వేడి వాతావరణము వలన భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగి తోట నీటి ఎద్దడికి గురవుతువుంటుంది. అయితే వ్యవసాయ వ్యర్థ పదార్థాలయి నటువంటి చెత్త మొదలగునవి. చాళ్ళ మధ్యలో పలుచగ పరచడం వలన భూమి ” యొక్క ఉష్ణోగ్రతను నియంత్రిస్తు చీడపీడలు మరియు నీటి ఎద్దడికి గురికాకుండా చేస్తుంది. మొక్క తోటల్లో చెరకు నాటిన మూడవ రోజున మరియు వర్షాకాలంలో కాలువలు ఎగవేసే సమయంలో సేకరించిన చెరకు చెత్తను నేలపై పలుచగా పరచి, దానిపై ఎకరానికి 2 కిలోల కుళ్ళబెట్టే శిలీంధ్రం, 8. కిలోల యూరియా, 10 కిలోల సూపర్ ఫాస్పేట్ వేయటం వలన కొన్ని రోజులలో సేంద్రీయ ఎరువుగా తయారవుతుంది.
పిట్ పద్ధతిలో చెరకు చెత్తను సేంద్రియవు ఎరువుగా తయారు చేయుటకు ఒక మీటరు లోతు, 2 మీటర్ల వెడల్పు మరియు 6 మీటర్ల పొడవు గల గోతిలో చెఱకు చెత్తను సేకరించి కుప్ప చేసి, చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి 15 సెంటీ మీటర్ల మందములో పరచి తేమగా ఉండడానికి నీటిని మరియు బయోమినరలైజర్లను చిలకరించాలి. బయోమినెరలైజర్ అనేది సూక్ష్మజీవుల ద్వారా కుళ్ళింపు ప్రక్రియ వేగవంతం చేయడానికి ఉపయోగిస్తారు. దీని మీద నీరు, చివికిన పశువుల ఎరువుగాని, ఫిల్డరు మట్టిగాని కలిపి, 1-2 సెంటిమీటర్ల మందం మట్టితో పొరలుగా తయారు చేసుకొనవలెను. ఈ విధంగా చేస్తే సుమారు 4 మాసాల్లో చెఱకు చెత్త కుళ్ళి కంపోస్టుగా తయారై, పొలాల్లో వేసుకోవటానికి అనువుగా వుంటుంది. పశువుల ఎరువు లేదా కోళ్ళ ఎరువు అనేది నత్రజని లభ్యతకు మరియు కర్బన నత్రజని నిష్పత్తిని తగ్గించడానికి ఉపయోగిస్తారు