మన వ్యవసాయం

Subabul Cultivation :సుబాబుల్ సాగులో మెళుకువలు

0

Subabul సుబాబుల్‌ను ఉష్ణమండలంలో పశుగ్రాసంగా, ముఖ్యంగా పొడి వ్యర్థ భూముల్లో విస్తృతంగా సాగు చేస్తారు. ఇది మిమోసా మరియు పొడవాటి చదునైన పాడ్‌లను పోలి ఉండే పసుపు రంగుతో తెల్లటి పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. సుబాబుల్ చెట్లు భారతదేశం అంతటా పెరుగుతాయి. సుబాబుల్ ఆకులను జంతువులకు పచ్చి మేతగా ఇస్తారు.

సుబాబుల్ విత్తనాలలో మాంసకృత్తులు అధికంగా ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు బాగా పెరుగుతాయి. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకునే శక్తిగల బాక్టీరియాను వేరుబుడిపెలందు కలిగి ఉంటుంది. చెట్టును నరికినా తిరిగి కొమ్మలు వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో దీనిని సాగు చేసుకునేందుకు అనుకూలం.

అన్నిరకాల తటస్థ నేలల్లో పెరుగుతుంది. క్షార మరియు ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన పెంచవచ్చు. అటవీ వ్యవసాయంగా పంటపొలాల్లో కూడా పెంచవచ్చు. కలప గట్టిగా, నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నీచర్ తయారీకి ఉపయోగపడుతుంది. గుంజలు, కంచె స్థంభాలుగా ఉపయోగపడతాయి. కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి.

కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు. సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నుల దిగుబడి వస్తుంది.

మొక్కలను 8 మీటర్ల ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో నాటుకోవాలి. సుబాబుల్‍ను పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటం తగ్గించవచ్చు. పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఎకరాకు 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతరపంటగా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించవచ్చు. కాగితం తయారీకి కావలసిన శ్రేష్ఠమైన గుజ్జు సుబాబుల్ నుండి లభిస్తుంది.

ఈ చెట్టుకి పూసే పువ్వులు తెల్లని కేశరములతో గుండ్రంగా ఉంటాయి. దీనిని వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. త్వరగా పెరిగే బహువార్షిక మొక్కగా చెప్పవచ్చు. దీనికలపను పనిముట్ల తయారీకి, కాగితపు గుజ్జు లాంటి అవసరాలను వినియోగిస్తారు.

 

Leave Your Comments

Sprinkler Irrigation: స్ప్రింక్లర్ ఇరిగేషన్ తో నీటి మరియు కలుపు సమస్యలకు చెక్

Previous article

Aliv seeds benefits: అలీవ్ గింజలతో ప్రయోజనాలు బోలెడు

Next article

You may also like