మన వ్యవసాయం

స్ట్రాబెర్రీ సాగు విధానం… ప్రయోజనాలేంటి…?

0
Strawberry cultivation for higher return
Strawberry cultivation for higher return

మనందరికీ స్ట్రాబెర్రీ అంటే ఎంతో ఇష్టం. ఎర్రని రంగు ఆకుపచ్చని తొడిమతో వుండే స్ట్రాబెర్రీని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే పండే ఈ స్ట్రాబెర్రీ ఇప్పుడు మనవద్ద కూడా విస్తరిస్తోంది. దీన్ని సాగు చేయడం వలన రైతులు మంచి దిగుబడిని సాధిస్తారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారు కొందరు రైతులు. మనసుంటే మార్గం ఉంటుంది. వ్యవసాయంలో లాభాలు గడించాలనే కల ఉంటె చెయ్యడానికి ఎన్నో పంటలు ఉన్నాయ్. మనకు తెలిసిన నాలుగైదు రకాల పంటలతోనే సరిపెట్టుకోకుండా వివిధ రకాల పంటలతో అధిక ఆదాయాన్ని పొందవచ్చు. అందులో ఈ స్ట్రాబెర్రీ సాగు ఒకటి. అమెరికాలో పుట్టిన ఈ జాతి ఫలం ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ప్రస్తుతం మన దెగ్గర కూడా స్ట్రాబెర్రీస్ ని సాగు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు.

స్ట్రాబెరీ‌లను కొండ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. విశాఖ , డెహ్రాడూన్, హిమాచల్ ప్రదేశ్, మహాబలేశ్వరం, డార్జిలింగ్, మహరాష్ట్ర వంటి ఇతర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీని ఎలా సాగు చేస్తారో తెలుసుకుందాం. వీటి కోసం అడుగున్నర ఎత్తులో బెడ్ నిర్మిస్తారు. బెడ్ అంటే మట్టిని నేల కంటే కాస్త ఎత్తుగా పోస్తారు. ఒక్కో బెడ్డులో రెండు వరసల్లో జిగ్ జాగ్ క్రమంలో మొక్కలు వేస్తారు. వీటికి సేంద్రీయ, జీవ రసాయనాలను అందిస్తారు. ఈ మొక్కకు భూమి ఎప్పుడూ తేమగా ఉండాలి. ఎండిపోయిన ఆకుల్ని వేస్తే… అవి ఎరువుగా మారతాయి. అలాగే… ఆవుపేడలో మంచినీళ్లు కలిపి… మొక్కల మీద చల్లాలి. అందువల్ల పురుగుల బెడద ఉండదు. ఎప్పుడైనా సరే పురుగులు, కీటకాల వంటివి వస్తే… వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే అవి మొక్కను నాశనం చేస్తాయి.

ముఖ్యంగా ఈ పంటను సెప్టెంబరు లేదా అక్టోబరు నెలల్లో వేస్తారు. మొక్క నాటిన 45 రోజుల నుంచి పంట చేతికొస్తుంది. ఒక్కో మొక్కకు 500 గ్రాముల మేర పళ్లు వస్తాయి. సగటున హెక్టారుకు మూడు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి ఉంటుంది. అయితే ఈ స్ట్రాబెర్రీస్ ని ఎక్కువ రోజులు ఉపయోగించలేము. అధిక రోజులు నిల్వ ఉండని కారణంగా రెండు మూడు రోజుల్లోనే వాడుకోవాలి. కాకపోతే సాగు చేసే రైతులు మిగిలిన స్ట్రాబెర్రీస్ తో జాం కూడా తయారు చేస్తున్నారు. వృధా కాకుండా జాం తయారు చేసి అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు.

ఇక స్ట్రాబెర్రీస్ ని పంట పొలంలోనే కాకుండా మన ఇంట్లోనూ పెంచుకోవచ్చు. ఇంటి గార్డెన్‌లో పెంచితే… సంవత్సరం తర్వాత పండ్లు వస్తాయి. స్ట్రాబెర్రీస్ మొక్కలు మనకు నర్సరీలోనూ అందుబాటులో ఉంటాయి. స్ట్రాబెరీస్‌లో అనేక విటమిన్లు లభ్యమవుతాయి. విటమిన్ సీ, విటమిన్ ఏ, విటమిన్ కే వంటివి ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా జెల్లీ, ఐస్‌క్రీమ్, స్వీట్స్ వంటి వాటి తయారీలో స్ట్రాబెరీ ఫ్రూట్స్ ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఈ ఫ్రూట్స్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. స్ట్రాబెర్రీ రసం మన శరీర రంగుని మార్చేస్తుంది. రోజుకి ఒక్క ఫ్రూట్ తిన్నా ఎంతో మేలు. కంటి ఆరోగ్యానికి స్ట్రాబెర్రీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో, అంధత్వాన్ని దూరం చేయడంలో క్రీయశీలక పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పుకుండా స్ట్రాబెర్రీని ఆహారంలో భాగం చేసుకుంటే నోటి సమస్యలను చెక్‌ పెట్డవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

#Strawberrycultivation #AgricultureNews #LatestNews #Eruvaaka

Leave Your Comments

టేకు సాగు శ్రీరామరక్ష…

Previous article

దీపావళి పర్యావరణ బహుమతులు

Next article

You may also like