మన వ్యవసాయం

Soyabean harvesting: సోయాచిక్కుడు పంట కోత సమయం లో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

0

Soyabean సోయాచిక్కుడు ఇతర పప్పుధాన్యపు పైర్ల కంటే అధిక దిగుబడి నివ్వగల శక్తి కలిగి వాటి కంటే రెట్టింపు మాంసకృత్తులు (43 శాతం) మరియు నూనె (20 శాతం) కూడ కలిగిన శక్తి వంతమైన పప్పు ధ్యాన్యం.

ఈ పైరు రైజోబియమ్ జపానికమ్ అనే బాక్టీరియా సహాయంతో గాలిలోని నత్రజనిని వేరు బుడిపెల ద్వారా గ్రహించి మొక్కకు అందించడమే కాక భూమిని సారవంతం చేస్తుంది.

మన రాష్ట్రంలో సోయాచిక్కుడు లక్ష హె.లలో సాగుచేయబడుతూ 134 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది. దిగుబడి ఎకరాకు షుమారుగా 1000 కిలోలు.

నూనె తీసిన సోయా పిండిలో 55 నుండి 60% మాంసకృత్తులుంటాయి. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీన్ని గోధుమ, శనగ పిండితో కలిపి వాటి నాణ్యతను పెంచ వచ్చు.

సోయానూనె ఆరోగ్యానికి మంచిది. సోయా గింజలు వివిధ ఉత్పత్తుల (పాల సంబంధిత ఉత్పత్తుల, మందులు, రంగులు ఆయిల్స్ మొ”) తయారీలో ఉపయోగపడతాయి.

విత్తనశుద్ధి : ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల ధైరమ్ + 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్ మందుతోను, తరువాత 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30గ్రా. కార్బోసల్ఫాన్ తో విత్తనశుద్ధి చేయాలి. ప్రతి 8 నుండి 10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

అధిక దిగుబడికి, పురుగులు, తెగుళ్ళ నుండి రక్షణకు విత్తనశుద్ధి విధిగా చేయాలి. ముందుగా 1 గ్రాము కార్బండాజిమ్ లేదా 3 గ్రాముల థైరమ్ లేదా కాప్టాన్ మందుతో తరువాత 1.5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48% ఎఫ్యస్ ప్రతి కిలో విత్తనానికి  విత్తనశుద్ధి చేయాలి. అటు తర్వాత ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రా, రైజోబియం  తగినంత నీటితో దానికి కొంత జిగురును కలిపి విత్తనానికి పట్టించి, నీడలో ఆరబెట్టి అరగంట తర్వాత విత్తుకోవాలి. విత్తనశుద్ధి ప్రక్రియ అంతా విత్తనం వేసే గంట ముందు చేసుకోవాలి.

కోత

పంట దిగుబడులు నీటి లభ్యత, ఎకరాకు మొక్కల సంఖ్య మరియు పాటించే యాజమాన్య పద్ధతులపై ఆధారపడి వుంటాయి. వర్షాధారంగా పంట దిగుబడి హెక్టారుకు 1.5-2.5 టన్నుల వరకు వుంటుంది. ఆరుతడి కింద మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి రకాలను సాగు చేసినప్పుడు హెక్టారుకు 2.5 3.5 టన్నుల దిగుబడిని పొందవచ్చు.

పంట పరిపక్వానికి రాగానే ఆకు అంతా పసుపు వర్ణంలోకి (పండాకుగా) మారి, ఎండిపోతూ రాలు తుంటుంది. అలాగే మొక్కలో గుత్తులుగా వున్న కాయలు క్రింది నుండి పైకి పసుపు గోధుమ వర్ణంలోనికి మారుతూ, ఇంకా ఎండి పూర్తి గోధుమ /ముదురు గోధుమ వర్ణంలోకి మారుతాయి. ఈ దశలో కాయలను తాకితే బాగా ఎండినట్లు వుంటాయి. అప్పుడు పంటకోతను చేపట్టాలి. పైరును భూమికి సమాంతరంగా కోసి, అలాగే ఒకటి రెండు రోజులు ఆరనివ్వాలి.

 

 

Leave Your Comments

Green gram cultivation: ఖరీఫ్ వరి మాగాణులలో రబీ పెసర విత్తుకున్నప్పుడు కలుపు నివారణ చర్యలు

Previous article

PJTSAU MIC Report: అన్ని పంటలకు గిట్టుబాటు ధర కష్టం.!

Next article

You may also like