మన వ్యవసాయం

Soyabean cultivation: సోయాచిక్కుడు సాగుకు అనుకూలమైన సమయం

0

Soyabean సోయాచిక్కుడు ఇతర పప్పుధాన్యపు పైర్ల కంటే అధిక దిగుబడి నివ్వగల శక్తి కలిగి వాటి కంటే రెట్టింపు మాంసకృత్తులు (43 శాతం) మరియు నూనె (20 శాతం) కూడ కలిగిన శక్తి వంతమైన పప్పు ధ్యాన్యం.

ఈ పైరు రైజోబియమ్ జపానికమ్ అనే బాక్టీరియా సహాయంతో గాలిలోని నత్రజనిని వేరు బుడిపెల ద్వారా గ్రహించి మొక్కకు అందించడమే కాక భూమిని సారవంతం చేస్తుంది.

మన రాష్ట్రంలో సోయాచిక్కుడు లక్ష హె.లలో సాగుచేయబడుతూ 134 వేల టన్నుల ఉత్పత్తినిస్తుంది. దిగుబడి ఎకరాకు షుమారుగా 1000 కిలోలు.

నూనె తీసిన సోయా పిండిలో 55 నుండి 60% మాంసకృత్తులుంటాయి. దీనికి విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. దీన్ని గోధుమ, శనగ పిండితో కలిపి వాటి నాణ్యతను పెంచ వచ్చు.

సోయానూనె ఆరోగ్యానికి మంచిది. సోయా గింజలు వివిధ ఉత్పత్తుల (పాల సంబంధిత ఉత్పత్తుల, మందులు, రంగులు ఆయిల్స్ మొ”) తయారీలో ఉపయోగపడతాయి.

 విత్తనశుద్ధి : ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల ధైరమ్ + 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల ధైరమ్ లేదా కాప్టాన్ మందుతోను, తరువాత 5గ్రా. ఇమిడాక్లోప్రిడ్ లేదా 30గ్రా. కార్బోసల్ఫాన్ తో విత్తనశుద్ధి చేయాలి. ప్రతి 8 నుండి 10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం జపానికం కల్చరును కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

అధిక దిగుబడికి, పురుగులు, తెగుళ్ళ నుండి రక్షణకు విత్తనశుద్ధి విధిగా చేయాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండాజిమ్‌ లేదా 3 గ్రాముల థైరమ్‌ లేదా కాప్టాన్‌ మందుతో తరువాత 1.5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌ 48% ఎఫ్‌యస్‌ తో విత్తనశుద్ధి చేయాలి. అటు తర్వాత ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రా. రైజోబియం కల్చర్‌ను తగినంత నీటితో దానికి కొంత జిగురును కలిపి విత్తనానికి పట్టించి, నీడలో ఆరబెట్టి అరగంట తర్వాత విత్తుకోవాలి. విత్తనశుద్ధి ప్రక్రియ అంతా విత్తనం వేసే గంట ముందు చేసుకోవాలి.

సోయాచిక్కుడు ఖరీఫ్ పండించుటకు అనువైన పంట. దీని వంటకాలం దాదాపు నాలుగు నెలలు

(110 – 120 రోజులు). ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని ఖరీఫ్ పంటగానే వేస్తారు. మన రాష్ట్రంలో రబీ మరియు వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికి, దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి కాబట్టి ఈ రెండు సీజన్లు సాగుకు అనుకూలం కాదు.

ఖరీఫ్ లో ఈ పంటను జూన్, జూలై నెలల్లో విత్తుకోవాలి. జూన్ 15 నుండి జూలై 10 లోపు విత్తుకొంటే దిగుబడులు బాగా వస్తాయి. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్ళు ఎక్కువవుతాయి.

Leave Your Comments

Sesame seeds: నువ్వుల తో ఆరోగ్యానికి మేలు

Previous article

Farmer success story: గులాబీ పండించి నెలకు లక్షలు సంపాదన

Next article

You may also like