Neem Cake Powder: అన్నదాత రైతేరాజు, ఓకర్షకుడు. పదిమందికి అన్నం పెట్టాలని తన కష్టంను భరిస్తూ పదిమందిని పోషిస్తున్నాడు. వాన పడిన దగ్గర నుంచి ఎండలు కాసే వరకు బరువులను మోస్తునే ఉంటాడు. రైతుకు సకాలంలో విత్తనాలు, ఎరువులు అందవు, అందిన మద్దతు ధర కరువు. రైతుకు అన్ని విధాలగా సకాలంలో అండగా ఉండాల్సింది ప్రభుత్వం.
సమగ్ర సస్యరక్షణ పర్యావరణాన్ని దృష్టిలో వుంచుకొని పైరులలో అధిక దిగుబడులు సాధించటలో హాని చేయు చీడపీడలను నష్ఠపరిమితి స్ధాయి దాటకుండా నియంత్రిస్తూ పైరుకు మేలు చేయు పురుగులను రక్షించుకొనుటకు అనుసరించే విధానమే సమగ్ర సస్యరక్షణ అంటే ముందుగా మనం విత్తనం వేసే ముందు మట్టిని మనం సాయిల్ టేస్టుకు పంపించాలి..నేల మంచిగా ఉంటేనే మనం చేసే వ్యవసాయంలో దిగుబడులను సాధించవచ్చు. ఈరోజు మనం ఏరువాకలో భుమిలో వేపపిండి వేయడం వల్లన కలిగే ప్రమోజనాలు గురించి తెలుసుకుందాం…
Also Read: Oil Palm Cultivation: మీకు తెలుసా? ఒక్కసారి నాటితే 40 సంత్సరాలు దిగుబడి వచ్చే పంట
నేల స్వరూపం మారుతుంది.
భూమిలో వేపపిండి వేసుకోవటం వల్లన సేంద్రియ కర్బన శాతాన్ని బాగా పెంచుతుంది. నేల స్వరూపం కొంత మేర మారుతుంది. అంతేకాకుండా చౌడుశాతాన్ని తగ్గించి తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని పెంచుతుంది. వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది. అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది. మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను కూడా అరికడుతుంది. ముఖ్యంగా నులి పురుగులను అదుపులో ఉంచుతుంది.
వేపపిండి స్థూలపోషకాలతోపాటు సూక్ష్మపోషకాలు కలిగి ఉంటుంది. దీనిని అన్ని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు ఒకసారి భూమిలో వేస్తే పంట చివరి వరకు మొక్కలకు వేపపిండి అందుతుంది ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఇందులో ఉండవు. దీనివల్లన పంట దిగుబడులు బాగా పెరుగుతాయి. దీనికి రసాయనకమందులు కూడా అవసరం ఉండదు. కానీ మార్కెట్లో కల్తీలేని వేపపిండిని మాత్రమే తీసుకోని భూమిలో వేసుకోవాలి..
రసాయన అవశేషాలు లేని దిగుబడులను సాధించాలంటే ముందు నేల స్వభావం గురించి తెలుసుకోవాలి. నేల సమత్యుల్యత ఉంటేనే మనం ఏపంటలోనైనా కాసులు వర్షం కురిపించవచ్చు. వేపపిండి వాడాలి అనుకున్న రైతులు, ఇది వేపపండ్లు రాలే సమయం కాబట్టి, వేపకాయలు సేకరించి, మధ్యవర్తులకు, మిల్లువాళ్లకు అమ్మేవారి దగ్గర సేకరించి, ఎండబెట్టి, రోడ్డుమీద పోసి ట్రాక్టర్‌తో త్రొక్కించి వాడుకుంటే, అంతకన్నా మించిన ఎరువు పంటలకు మరొక్కటి ఉండదు..
Also Read: Oil Prices: నూనె ధరలు భారీగా తగ్గుతున్నాయి.!