Soil Erosion: నీటి మూలంగా , గాలి మూలాన గాని లేక వర్షపు చినుకుల మూలంగా, నేల నుండి మట్టి వేరు పడి (సారవంతమైన ఒక చోటి నుండి ఒక చోటికి కొట్టుకొని పోవడాన్ని నేల కోత అంటారు.
మట్టి నేలపై పడే వర్షపు చినుకులు వల్ల: పై నుండి వర్షపు చినుకులు విసురుగా పొడిగా నున్న నేలపై పడినపుడు ఆ మట్టి రేణువులు నేల నుండి విడివడి లేక కదిలి పోయి ప్రక్కలకు వెదజల్లబడతాయి. విధంగా వర్షపు చినుకులు నేలపై పడిన చోట నుండి మట్టిని దాదాపు రెండు అడుగుల ఎత్తు వరకు మరియు 5 అడుగుల దూరం వరకు వెదజల్లుతాయి. వర్షపు చినుకులు సుమారు 25-30 కి.మీ. వేగముతో క్రిందకు పడతాయి.
ఒరవడితో ప్రవహించే బురదనీటి తాకిడి వల్ల: వర్షపు నీటి తాకిడికి విడగొట్టబడిన మట్టి రేణువులు వర్షపు నీటితో కలిసి బురదగా మారి నేలపై భాగం మీదుగా ప్రవహిస్తూ పోయి చిన్న చిన్న కాల్వలతో చేరిపోవడం మూలంగా అక్కడక్కడా పిల్ల వాగులు ఏర్పడతాయి.
ఈ బురద నీరు ఎక్కువైన కొలదీ దీనితో కూడా కొట్టుకొని పోయే మట్టి నీటి ఘన పరిమాణము కూడా ఎక్కువై పెద్ద పెద్ద వాగులు ఏర్పడతాయి. దీనినే జాలు కోత అంటారు. ఎప్పుడు ఎడతెగకుండా వర్షం చినుకు తాకిడికి బురద నీటి ప్రవాహాలకు గురైన నేలలో అంత కంతకూ లోతైన వాగు ఏర్పడి ఆ నేల ఏ పంట పండించడానికి పనికి రాకుండా పోతుంది.
Also Read: Veneer Grafting: వెనీర్ గ్రాఫ్టింగ్ ద్వారా మామిడి ప్రవర్థనం ఎలా చేస్తారు.!
నష్టాలు:
సారవంతమైన మట్టి కొట్టుకొని పోవడం:
నేలపై భాగంలో ఉన్న సారవంతమైన మట్టి పొర పంట పెరుగుదలకు చాలా ముఖ్యo. ఎందుచేతనంటే మొక్కల వ్రేళ్ళు చాలా వరకు ఈ పై పొలం లోనే ఉంటాయి. కాబట్టి నేల పై భాగంలో మట్టి పొర కొట్టుకొని పోయినపుడు క్రింద వున్న నేల తక్కువ సారవంతంగా ఉండటం చేత ఈ నేలలో పంటలు బాగుగా పండుటకు అవకాశం తగ్గుతుంది.
సారవంతమైన వంట భూముల మీద ఇసుక చేరి పోవడం:
వాలకు క్రింద భాగంలో వున్న ప్రాంతాలలోని సారవంతమైన నేలలు పై నుండి నీటితో కొట్టుకొని వచ్చే ముతక మరియు ఇసుక పదార్థాలతో కప్పబడి పంటలు పండించడానికి పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది..
జలాశయాలు, సరస్సులు మేట వేయడం:
త్రాగడానికి, మంచి నీరు లేద పంటల నీటి పారుదలకు అవసరమైన వర్షపు నీటిని నిలువ చేసి ఉంచడానికి జలాశయాలు నిర్మించబడతాయి. జలాశయాలకు పైన లేక చుట్టూ వున్న ప్రాంతా నుండి నీరు వచ్చి వీటిలో చేరుతుంది. ఈ ప్రాంతాలలో నేల కోతను అదుపులో పెట్టకుండా వదలివేసే పై నుండి ప్రవాహనీటితో కొట్టుకొని వచ్చిన మట్టి ఈ జలాశయం లో అడుగు భాగములో చేరి మేట ఏర్పడుతుంది. అందుచేత వీటిలో నిలువ చేయబడే నీటి పరిమాణము తగ్గిపోయి త్వరలోనే మనకు ఉపయోగం లేకుండా పోతాయి.
నేల అడుగున ఉన్న నీటి మట్టం తగ్గిపోవుట:
వర్షపు నీరు వేగంగా నేలపై పడి కొట్టుకొని పోవడం ఎక్కువైతే నేలలోనికి ఇంకి పోవడానికి మిగిలి పోయే నీటి ఘన పరిమాణం తగ్గుతుంది. ఈ విధంగా ఇంకిపోయే నీరు తగ్గి పోయినపుడు బావులలోని నీటిని ఎప్పటి కప్పుడు భర్తీ చేయడానికి నేల అడుగు భాగంలో నుండి లభ్యమయ్యే నీరు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే బావులలో నీరు తగ్గిపోతే నీటి పారుదలకు కావలసిన నీరు లేక పంట దిగుబడి తగ్గుతాయి.
Also Read: Swine Fever in Pigs: పందులలో జ్వరం ఎలా వస్తుంది.!