నేలల పరిరక్షణమన వ్యవసాయం

Soil Conservation: భూసార పరీక్షల ఆవశ్యకత మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యం

1
Soil Conservation

Soil Conservation: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం యొక్క వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌ వారి దత్తతగ్రామం అయినటువంటి కొత్తూరు (మం) గూడురు గ్రామంలో ‘‘ప్రపంచ నేలల దినోత్సవం’’ సందర్భంగా ‘‘భూసార పరీక్షల ఆవశ్యకత మరియు సమగ్ర ఎరువుల యాజమాన్యం ’’ అనే అంశంపై రైతాంగానికి అవగాహన కల్పస్తూ ఒక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వారి సౌజన్యంతో జరుపబడిరది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచి శ్రీ బి.సత్తయ్యగారి ఆద్వర్యంలో జరిగింది.

Soil Conservation

ఈ కార్యక్రమాన్ని డా.బి.రాజేశ్వరి గారు, ప్రొఫెసర్‌ మరియు కన్వీనర్‌ వ్యవసాయంలో నేలల యొక్క ముఖ్యతను తెలుపుతూ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ప్రస్తుత వ్యవసాయంతో మంచి దిగుబడులు లేదా సుస్థిరతను సాధించుటకై నేల స్వభావం గమనించి దానికి తగ్గట్టుగా నేల ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని తెలిపారు. తద్వారా మన ముందు తరాల వారికి మంచి భూములను ఇవ్వగలమని తెలపారు. ఈ కార్యక్రమంలో డా.జి. జయశ్రీ, సీినియర్‌ ప్రోఫెసర్‌ Ê హెడ్‌, మృత్తిక శాస్త్ర విభాగం, వ్యవసాయ కళాశాల, రాజేంద్రనగర్‌ వారు ముఖ్య అతిధిగా పాల్గొని వ్యవసాయంలో నేల యొక్క ముఖ్యతను వివరించారు. ఇందుకు గాను మనిషికి ఆరోగ్య పరీక్షలు చేయించినట్టుగానే నేెలకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు మట్టి నమూనాలను సేకరించి రైతులు ఖచ్చితంగా మట్టినమూ పరీక్షలను చేయించవలసిందిగా సూచించారు. ఇందువలన నేలలోని సారాన్ని, పోషకాల లభ్యతను తెలుసుకోవచ్చు అని అన్నారు.

Also Read: మేలైన పంట దిగుబడిలో పొటాషియం పాత్ర
నేలలో చౌడు ఏర్పాటుకు కారణాలు :

చౌడు తగ్గించుకొనుటకు వివిధ పద్ధతులను వివరించారు. అదే విధంగా పంటలకుకావలసినటువంటి పోషకాలను కేవలం రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, ఎర్రల ఎరువు, పచ్చిరొట్టల ఎరువు, జీవన ఎరువు వంటివి కూడా కలిపి వాడినట్టయితే మంచి సుస్థిర దిగుబడులతో నేల లారోగ్యాన్ని కాపాడుకోవచ్చనని వివరించారు.

Soil Conservation

ఈ కార్యక్రమంలో రైతుల ఆసక్తి పెంచుటకై ఒక చిన్న క్విజ్‌ను కూడా పెట్టారు. ఇందులో నేలకు, వ్యవసాయానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను రైతులను అడిగారు. తరువాత ప్రధమ మరియు ద్వితీయ బహుమతులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, హైదరాబాదు నుండి శ్రీ.వి పద్మనాభ పిల్లై మరియు శ్రీమతి వి.సుష్మిత, బ్రాంచి మేనేజరు, కొత్తూరు వారు పాల్గొన్నారు. వారు ప్రస్తుతం బ్యాంకులనందు ఉన్నటువంటి వివిధ పధకాలను గురించి వివరించారు.

ఈ కార్యక్రమం నుండి కొత్తూరు మండలం వ్యవసాయ అధికారి శ్రీ బి.గోపాల్‌ గారు పాల్గొన్నారు. రైతులకు పోషక యాజమాన్యం గురించి వివిధ పంటలతో పాటించవలసిన మెళకువలు గురించి వివరించారు.
వ్యవసాయ కళాల, రాజేంద్రనగర్‌ శాస్త్రవేత్తలు, కొత్తూరు పిఎసిఎస్‌ చైర్మన్‌, గూడూరు వార్డు మెంబర్లు, రాపెడ్‌ విద్యార్థులు, ఎ.ఇ.ఓ సన, ఎస్‌. బి.ఐ (భారతీయ స్టేట్‌ బ్యాంక్‌) అధికారులతో పాటుగా మొత్తం 45 మంది పాల్గొన్నారు.

Also Read: పొటాషియం లోపం లక్షణాలు మరియు యజమాన్యం

Leave Your Comments

Cabbage And Cauliflower: క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్‌ పంటలలో జాగ్రత్తలు

Previous article

కోడి పిల్లల సంరక్షణ విధానం…

Next article

You may also like