Microorganisms and Soil Fertility: ఆధునిక వ్యవసాయం అంటే అందరి మనసుల్లో అధిక దిగుబడి వంగడాలు, రసాయనిక ఎరువులు, నీటి వనరుల గురించి ఆలోచనలుంటాయి. తల్లిని నమ్ముకొన్న వాళ్ళు నేలను నమ్ముకున్నవాళ్ళు నష్టపోరనే సామెత అందరు మరచిపోయారు. రైతులకు రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడాలనే తపన తప్ప నేలలకు నష్టం కలుగుతుందనే ఆలోచనలేదు. ఇందువల్ల నెల రక్షణకు చేపట్టవలసిన చర్యలు ఎన్నో. వాటిలో కొన్ని….
భూసార పరీక్షా కేంద్రాలు:
ప్రతి జిల్లాలో నేలల పరీక్షా కేంద్రాలు ప్రభుత్వం స్థాపించి రైతుల నేలలు పరీక్షించి ఏ పంటలకు అనువైనవో తెలియజేస్తారు. ఈ పరీక్షల్లో ఉదజని సూచిక (పి. హెచ్) గురించి, మొక్కలకు కావాల్సిన ముఖ్యమైన నత్రజని, భాస్వరం, పొటాష్లు ఎంత మోతాదులో ఉన్నాయో తెలియజేస్తారు. ఎవరైనా రైతులు అడిగితే సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాపరు గురించి కూడా తెలియజే స్తారు. అంతే గాని భూమిలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి. ఈ మార్పుల వల్ల నేలలకు, పంటలకు లాభమా, నష్టమా అనే వివరాలు తెలియజేసే వ్యవస్థ లేదు.
శాశ్వత ఎరువులు, పరిశోధనలు:
వ్యవసాయ క్షేత్రాల్లో శాశ్వత ఎరువుల పరిశోధనలు జరుగుతుంటాయి. వాటిలో సేంద్రియ ఎరువులు,ముఖ్యంగా పశువుల ఎరువు వాడకం చాలా సంవత్సరాలు లేవు. అవి ఉన్నా చాలా తక్కువ మోతాదులో, కొన్ని సంవత్సరాలు మాత్రమే వేయడం జరుగుతుంది. ఈ పరిశోధనల్లో సేంద్రియ, రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేలలో జరిగే మంచి, చెడు మార్పులు ఏ విధంగా జరుగుతున్నాయనే పరీక్షలు చాలా అరుదు. ఆ ఆలోచనే లేదు.
Also Read: Rangpur Lime Root Stock: చీని అంట్ల తయారీలో రంగపూరు వేరుమూలం ప్రాధాన్యత.!
నేలలో సూక్ష్మజీవులు:
మానవుని శరీరంలో ఉన్నట్లుగా నేలలో కూడా కొన్ని కోట్ల సూక్ష్మక్రిములు, వానపాములుంటాయి. ఇవి నేలలో ఉంటూ మొక్కలకు కావాల్సిన పోషకాలనందిస్తాయి. మొక్కల్లో బాగా పూలు, కాయలు, గింజల ఉత్పత్తికి దోహదపడతాయి. మనుషులు రోజూ ముందుల ద్వారా కావాల్సిన పిండి పదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వు విటమిన్లు, లవణాలు, మాత్రలు (మందుల) ద్వారా తీసుకుంటే ఎంతకాలం ఆరోగ్యంగా ఉండగలరు. అదే విధంగా నేలలు కూడా రసాయనిక ఎరువులు అధిక మోతాదులో అందిస్తే నేలలోని సూక్ష్మజీవులు, వానపాములు కనుమరుగవుతాయి. దీని ఫలితమే మొక్కలకు అన్ని పదార్థాలు అందక పోషక లోపాలు, పురుగులు, తెగుళ్ళ సమస్య పెరుగుతుంది. నేల పరీక్షల్లో సూక్ష్మజీవుల గురించి ప్రస్తావించడం లేదు. శాస్త్ర జ్ఞులు అన్ని రకాల సూక్ష్మజీవుల మీద పరిశోధనలు చేశారేమోగాని నేలలోని సూక్ష్మజీవుల మార్పు గురించి కావాల్సిన పరిశోధనలు చేయలేదనిపిస్తుంది. ఒకవేళ రైతులకు అందుబాటులో లేదు. చాలా దయనీయమైన పరిస్థితి ఇది.
Also Read: Natural Farming: నేలల రక్షణలో పురాతన ప్రకృతి వ్యవసాయం.!