Farm Embankment: రైతులు పొలం దున్నే సమయంలో పొలం గట్టు ఎక్కువగా దున్నారు అని పొలం పక్కన రైతులతో గొడవలు అవుతాయి. ఇలాంటి గొడవలు అవ్వడం చాలా చూశాము. రైతులు పొలం దునే అప్పుడు పొలం గట్టు కొంచం అయిన ధునుకుంటు వెళ్తారు. గట్టు దున్నే కొద్దీ పొలం స్థలం పెరుగుతుంది అని కూడా రైతులు మధ్య గొడవలు అవుతుంటాయి. ఇలాంటి గొడవలు రైతుల మధ్య జరగకుండా నిజామాబాదు జిల్లా , అంకాపూర్ గ్రామ రైతులు కొత్త పద్దతిలో ఆలోచించారు.
ఎక్కడి రైతులు ఎవరికి పోలంకి వాళ్ళు రాళ్లతో గట్టు కట్టుకున్నారు. పై భాగంలో ఉండే రైతు తనకి ఉండే పొలం వరకు రాళ్లతో ఒక చిన్న గోడల కట్టుకున్నారు. ఈ రాళ్ల గట్టు ఒక రెండు అడుగులు పొలం లోపలి ఉంటుంది. మరో రెండు నుంచి మూడు అడుగులు పొలం గట్టు ఫై భాగంలో కనిపిస్తుంది. ఈ రాళ్ల గట్టు నాలుగు నుంచి అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది.

Farm Embankment
పై భాగం రైతులు మాదిరిగానే కింది భాగంలో ఉండే రైతులు వాళ్ళ పొలం సరిహద్దు వరకు రాళ్లతో గట్టు కట్టుకుంటారు. రైతులు ఇలా రాళ్లతో గట్టు కట్టడానికి ఒక ఎకరంకి 20 వేలు వరకు ఖర్చు వస్తుంది. ఇలా కట్టడం ద్వారా రైతుల పొలం గట్టు ఎక్కువ దున్నుకున్నారు లేదా జరిగింది అని రైతుల మధ్య గొడవలు జరగవు. ఎక్కువ వర్షాలు వచ్చినపుడు కూడా మట్టి కొట్టుకొని పోకుండా ఉంటుంది.
Also Read: Mulberry Fruits: ఈ పండ్లు సాగు చేస్తే 45 రోజుల్లో లక్ష రూపాయలు ఆదాయం పొందవచ్చు..
Electric Issurrai: ఇసుర్రాయి..కొత్త పద్దతిలో ఇలా వచ్చాయి.!
Mic for Protect Crops from Birds: రైతులు పంటని పక్షుల నుంచి కాపాడుకోవడానికి కొత్త పరికరం..