Soil Fertilizer Mixture: నారు మడుల తయారీకి, వివిధ పద్ధతులలో మొక్కలు పెంచడానికి మట్టితో పాటుగా వివిధ రకాల పదార్థాలను ఎరువుగా వాడుతారు. మరి మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమాలో లక్షణాలు ఎలా ఉండాలి. మిశ్రమం మరీ గుల్లగా తేలికగానూ లేదా మరీ గట్టిదనముతో కాకుండా మధ్య రకంగా ఉంటే మొక్కకి మంచిది. మట్టిలో మొక్కకి నిలబడటానికి తగినంత సత్తువ కలిగి ఉండాలి. నీరును పీల్చుకొని ఎక్కువ సేపు నిల్వ చేసుకునే గుణం ఉండాలి. తడిగా లేదా పొడిగా ఉన్నపుడు మట్టి పరిమాణంలో ఎక్కువ మార్పు ఉండకూడదు. మురుగు నీరు సులువుగా పోయే విధంగా ఉండి, బాగా గాలి వెచేందుకు అనువుగా ఉండాలి. మిశ్రమంలో కలుపు విత్తనాలు లేదా తెగుళ్ళు కలిగించే నులి పురుగులు, శిలీంధ్రాలు లేకుండా జాగ్రత్తపడాలి.
మట్టి మిశ్రమం తయారీకి అనువైన పదార్థాలు:
1. మట్టి: మట్టిలో సుమారు 75% ఇసుక ఉంటే మొక్క పెరుగుదలకు అనువుగా ఉంటుంది. మట్టికి ఇసుక కలిపి లేదా సేంద్రియ ఎరువులు కలిపి వాడాలి. చెరువు మట్టిలో సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉంటుంది. దీనిని కూడా
వాడుకోవచ్చు.
2. ఇసుక: ఇసుకను అటవీ లేదా పండ్ల మొక్కల విత్తనాలు మొలకెత్తించటానికి ఎక్కువగా వాడుతుంటారు. అయితే వాడే ముందు ఇసుకను వేడితో లేదా ఆవిరితో శుద్ధి చేసి వాడాలి. దీని వలన రోగకారక జీవులు, కలుపు విత్తనాలు నాశనం అవుతాయి.
3. పీట్: బురద నేలలో ఆకులు అలములూ పడి కొంత వరకు కుళ్ళి తయారైన పదార్థమే వీట్. ఇది సాధరణంగా కొంచెం సల్లగా ఉండి అధిక నీటిని ఒడిసి పట్టి నిలవ ఉంచుకుంటుంది. ఒక శాతం నత్రజని కలిగి ఉంటుంది. దీనిని మరీ తరచుగా మట్టిలో వాడరాదు. మట్టిలో కలిపే ముందు పొడి చేసి నీటిలో తడపాలి.
Also Read: Canadian Pygmy Goat: ప్రపంచంలోనే అత్యంత పోటీ విదేశీ మేక… ఇప్పుడు మన దగ్గర పెంచుతున్నారు..
4. స్ఫాగ్నంమాస్: నీటిలో పెరిగే నాచు మొక్కలను ఎండబెట్టి తయారు చేస్తారు. ఇది ఎలాంటి రోగకారక జీవులు లేకుండా, తేలికగా ఆమ్ల లక్షణాలు కలిగి ఉంటుంది. బాగా నీరును పీల్చుకునే లక్షణాలు కూడా ఉన్నాయి. దీనికి 10 నుండి 20 రెట్లు నీరు నిల్వ చేసుకునే గుణం ఉంటుంది.
5. వెర్మిక్యులైట్: ఇది ఒక మైకా పదార్థం వేడి చేస్తే బాగా ఉబ్బుతుంది, చాలా తేలికగా ఉంటుంది. రసాయనికంగా మెగ్నీషియం, అల్యూమినియం సిలికేట్లను కలిగి ఉంటుంది.
6. పర్లైట్ : ఇది అగ్ని పర్వతాల నుండి వెలువడిన లావా నుండి తయారయ్యే బూడిద రంగులో ఉండే , తేలికగా పరిశుద్ధంగా ఉండే పదార్థం. దీని బరువుకంటే 3-4 రెట్ల నీటిని తీసుకుంటుంది. దీనిలో ఎలాంటి పోషకాలుండవు.
7. ప్యూమైన్: ఇది కూడా లావా నుండి లభిస్తుంది. తెల్లగా లేదా బూడిద రంగులో గుల్లగా, తేలికగా ఉంటుంది. నీటిని బాగా పీల్చుకుంటుంది.
8. కుళ్లిన ఆకులు: ఎండిన లేదా పచ్చి ఆకులు పొరలు పొరలుగా ఒక గోతిలో వేసి, రెండు ఆకులు పొరల మధ్య అమ్మోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్పేట్ వేసి తరుచు నీళ్ళు చల్లుతుంటే 3-4 మాసాలలో తయావుతుంది. దీనిలో నులిపురుగులు, కలుపు విత్తనాలు, రోగకారక శిలీంధ్రాలు ఉండే అవకాశం ఉంది కనుక, దీనిని ఫార్మలిన్తో కలిపి వాడాలి.
9. రంపపు పొట్టు లేదా ఎండిన బెరడు ముక్కలు: దీనిని మట్టి మిశ్రమం తయారీలో వినియోగించవచ్చు.
Also Read: Tomato Farmer: టమాట సాగుతో 45 రోజులో 4 కోట్లు సంపాదించారు..