Soil Organic Matter: అనేక సూక్ష్మజీవుల ఆవాస సేంద్రియ కార్బణం
పంటలకు కావలిసిన అన్ని రకాల పోషకాలు భూమిలో ఎక్కువగా ఉంటాయి.
రైతులు రసాయనలను విచక్షణారహితం గా ఉపయోగిచడం వలన నేలలో సేంద్రియ పదార్ధo తగ్గిపోతుంది.తద్వారా భూమిలో ఉన్న పోషకాలన్ని మొక్కలకు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఈ పోషకాలు అన్ని మొక్కలకు అందుబాటులోకి రావాలి అంటే భూమి లో సేంద్రియ పదర్ధం అనేది తగినంత ఉండేలా చూసుకోవాలి.నేలలో సేంద్రియ కార్బనం ఉండే నీటిని నింపుకొనే శక్తీ నేలకు పెరుగుతుంది.అపరాలు సాగు చేస్తే భూమి మంచిగా ఉంటుంది. రైతులకు కూడా మంచి ఆదాయం వస్తుంది.
పెసర లో శక్తీ అనే దిగుబడినించే రకాలు వేసుకోవాలి.
దీన్ని వరి, మిరప, ప్రత్తి పంటలు వేసే నేలలో ముందుగా వేసుకొని పెసర పంట తీసుకున్న అనంతరం ఈ పంట సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి.
అలాగే కంది పంట కూడా భూమికి సేంద్రియ పదర్ధాన్ని ఇస్తుంది.
హెక్టారుకు సుమారు 2టన్నుల కంది పంట ఆకుని రాలుస్తుంది.
అన్ని రకాల మినుము, పెసర, శెనగ వంటి అపరాలు పంటలు నేలను సారవంతం చేస్తాయి.
అపరాలు సాగు చేసిన నేలల్లో తరువాత వేసే పంట ఆరోగ్యం గా పెరిగి చీడ పిడలను తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి.
Also Read: Bio Fertiliser to Improve Soil Fertility: నేల యొక్క సారవంతం పెంచడంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత.!
అపరాల సాగులో రైతులు చేస్తున్నవి –
- అధిక దిగుబడినిచ్చే రకాలను వాడక పోవడం.
- విత్తన మోతదు ఎక్కువగా వాడడం. దాని వల్ల పురుగులు, తెగుళ్ల ఉధ్రుత్తి ఎక్కువ కావడం పైరు మెట్టకు గురి కావడం, గింజ నాణ్యత తగ్గడం.
- మేలైన విత్తనo వాడక పోవడం.
- విత్తన శుద్ధి చేయకపోవడం వలన.
- వరుసల్లో విత్తకపోవడం.
- సరియైన సమయం లో కలుపు నివారణ చేయకపోవడం
నేల ద్వారా పారించు పద్దతిలో నీటి తడులు ఇవ్వడం. - జీవన ఎరువులు వాడకపోవడం.
- పైరు 90 రోజుల దశలో చివర్లు తుంచక పోవడం.
అధిక దిగుబడికి రైతులు చేయవలసినవి –
- అధిక దిగుబడులను ఇచ్చే రకాలను ఎంపిక చేసుకోవాలి.
- నాణ్యమైన విత్తన్నాని వాడుకోవాలి.
- సిఫార్సు మేరకు విత్తన మోతదు వాడాలి.
- పురుగుమందులు మరియు తెగుళ్ల మందులతో విత్తన శుద్ధి చేసినట్లు అయితే తొలి దశలో రసంపీల్చే పురుగులు తద్వారా వ్యాపించే వైరస్ తెగుళ్ళను, వేరు కుళ్ళు తెగుళ్ళను నివారిచవచ్చు.
- వరుసల్లో విత్తుకునట్లు అయితే అంతర కృషి ద్వారా కలుపు నివారణ మరియు తేమను నిలుపుకోవచ్చు.
- సరియైన సమయంలో కలుపు నివారణ చేసుకోవాలి.
Also Read:Problematic Soils: సమస్యాత్మక నేలల యాజమాన్యం ఎలా చేపట్టాలి.!
Also Watch: