Soil Fertility Decline: పంటలు వినియోగించుకోవడం వలన : వివిధ రకాల పంటలు వివిధ పరిమాణాల్లో పోషక పదార్ధాలను తీసుకోవడం.ఉదాహరణకు – ఒక టన్ను చెరుకు ఉత్పత్తికి కిలో నత్రజని కిలో భాస్వరం మరియు కిలో పోటాషియం అవసరం.ఈ విధంగా వివిధ రకాల పోషకాలను నేల నుండి గ్రహించి వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటాయి.
కలుపు మొక్కలు : పంట మొక్కలతో పాటు అత్యధిక పళ్ళలో పోషక పదార్ధాలను నేల నుండి గ్రహించడం వల్ల నేల సారం తగ్గుతుంది.
నేల కోత : సారవంతమైనా నేల పై పొర కోత వల్ల నేల సారం అనేది తగ్గిపోతుంది.
Also Read: Soil and Irrigation Water Tests: భూసార, సాగునీటి పరీక్షలు.!
సులభంగా కరిగే పోషక పదార్ధాలు నేల లోపలి పోరాలోనికి దిగిపోవడం : నత్రజని నైట్రేట్ రూపంలోనికి మారిన వెంటనే నీటితో పాటు నేల అడుగు పోరాలోనికి పోతుంది.వాయు రూపంలో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా నత్రజని ఈ రూపంలో నష్టపోతుంది.రాసాయనిక ఎరువులు నేలకు వేసే అప్పుడు మొక్కలకు అందుబాటులో గల దూరంలో కొంత లోతున వేసి మట్టితో కప్పిన చాలా వరకు నష్టాన్ని తగ్గించవచ్చు.
సంకీర్ణ ఎరువులు : సంకీర్ణ ఎరువులు (28-28-0)(17-17-17) మొదలైనవి వాడడం వలన మొక్కకు సమాతుల ఆహారం అందకపోవడం వలన నేల ఉత్పాదకత తగ్గుతుంది.
సూక్ష్మ పోషకాల విషయంలో శ్రద్ధ చూపకపోవడం వలన : ప్రతి పంటకు నత్రజని, భాస్వరం, మరియు పోటాష్ గల ఎరువులను అధిక మోతదులో వాడుచున్నారు గాని సూక్ష్మ ధాతూ పోషకాల అవసరాన్ని గమనించలేదు.
పంట మార్పిడి చేయకపోవడం వలన : పంట మార్పిడి చేయకపోవడం వలన పంట యొక్క వేర్లు ఒకే లోతుకు చొచ్చుకొని పోయి అక్కడ పోషకాలనే తీసుకుంటుంది.ఈ విధంగా గా కాకుండా ఒక పంట వేర్లపై న ఉండి పోషకాలు తీసుకుంటే..ఉదా – వరి, జొన్న, మొక్క జొన్న మెదలైనవి. మరొక పంట వేర్ల పోయేది ఎంచుకోవాలి.ఉదా – కంది, ప్రొద్దు తిరుగుడు, మొద…..) దీని వలన చీడ పీడల బాధ కూడా తగ్గుతుంది.రాసాయనిక ఎరువులు తగిన మోతదు లో వాడడం ఎంతయినా అవసరం.రాసాయనిక ఎరువులపై దృష్టి సారించి సేంద్రియ వినియోగం పెంచితే ఆరోగ్యం మరియు నేల సారం బాగుంటుంది. సమస్యాత్మక నేలలు చౌడు, ఆమ్లా,మరియు భౌతిక సమస్యలున్నా నేలలు పద్ధతులను బాగు చేయాలి.పోషక సమతుల్యత కాపాడాలి.పైర్లకు కావలిసిన పోషకాలను ఎక్కువ తక్కువ కాకుండా అవసరమైన మేరకు అవసరమైన సమయంలో మాత్రమే వేసుకోవాలి.
Also Read:Soil Types for Fruits Farming: పండ్ల తోటలకు అనువైన నేలలు.!
Must Watch:
Also Watch: