ఈ నెల పంటనేలల పరిరక్షణ

Care During Application of Chemical Fertilizers: రసాయన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు

0

Care During Application of Chemical Fertilizers: మొక్క ఎదుగుదలకు దాదాపు 18 ధాతువులు అవసరమవుంటాయి. ఈ 18 ధాతువులలో కొన్ని ఎక్కువ మోతాదులోను మరి కొన్ని తక్కువ మోతాదులోను మొక్కకు అవసరమవును. తగు మోతాదులలో అందించినప్పుడే మొక్క సరిగ్గా ఎదిగి మంచిదిగుబడి ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కనుక మొక్కకు కావలసిన అన్ని ధాతువులు సమకూర్చుటకు సమగ్ర సస్య పోషణ యాజమాన్య వద్ధతులు పాటించవలసిన అవసరం చాలా ఉంది.

Care During Application of Chemical Fertilizers

Care During Application of Chemical Fertilizers

వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రతి పంటకు నేల స్వభావమును భట్టి వేయవలసిన ఎరువుల మోతాదును వ్యవసాయ పంచాంగములో పొందుపరచియున్నారు.ఇది రైతులకు దీక్షుచిగా ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు సిఫార్సుల ప్రకారం, రైతులు భాస్వరము కలిగియున్న కాంప్లెక్స్ ఎరువులు లేక సూటి ఎరువులైన, సింగిల్ సుమారు పాస్పేట్ ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. తరువాత పంట ఎదుగుదల దశలో యూరియాను పైపాటుగా వేసుకోవాలి. కానీ కొంత మంది రైతులు ఎలాంటి సిపార్సు పాటించకుండా కంప్లెక్స్ ఎరువులు వేయకుండా యూరియా మాత్రమే ఉపయోగించుచున్నారు.దీని వలన పోషక లోపం ఏర్పడుతుంది. మరికొంత మంది రైతులు కంప్లేక్స్ ఎరువులు సిపార్సు లేక పోయినప్పటికీ పైపాటుగా వేయుచున్నారు.

Also Read: రైతుసోదరులకు వాతావరణాధారిత సలహాలు మరియు సూచనలు

దీని వలన నేల లో విషపదార్థమయి మొక్కలపైనా దుష్ప్రభావం చూపుతుంది. కావున మొక్క ఎదుగుదల లేక దిగుబడులు తగ్గవచ్చు లేదా రాకపోవచ్చు. భాస్వరము, పొటాషియం కలిగిన కాంప్లేక్స్ ఎరువులు ఆఖరు దుక్కిలో వేయకుండా ఒక్క యూరియా మాత్రమే అధిక మోతాదులో వాడిన యేడల మొక్క ఎవుగా పెరిగి చీడ పీడలు ఆశించుటకు అనువుగా ఉండును.

Organic Fertilizers

Organic Fertilizers

మొక్కకు కావలసిన ఇతర ధాతువులు భూమి నుండి అధిక మోతాదులో తీసుకొనుట వలన భూమి ఆరోగ్యమును దెబ్బతినును. పంట దిగుబడులు గణనీయంగా పడిపోవును. అతిగా కాంప్లేక్సు ఎరువులు పై పాటుగా వేసినపుడు కంప్లేక్స్ యూరియా ;మురియట్ ఆఫ్ పోటాష్, భాస్వరము మొక్క తీసుకోకపోగా భూమి లోని సూక్ష్మధాతువులతో కలిసి సూక్ష్మధాతులు మొక్కకు లభ్యము కానీ స్ధితిలోనికి మార్చుట వలన పంటలో సూక్ష్మధాతులోపము ఏర్పడును.

కనుక రైతు సోదరులు వ్యవసాయ అధికారులు సూచించినట్లు పశువుల ఎరువు, నత్రజని, భాస్వరము, పొటాషియం కలిగియున్న కంప్లేకు ఎరువులు, జింకుతో పాటు ఆఖరు దుక్కి లోను మిగిలిన మోతాదు నతజని సిపార్సు మేరకు పైపాటుగా వేసి అధిక దిగుబడులు సాధించువచ్చును.

Indian Farmer

Indian Farmer

అట్లుగాక అధిక మోతాదులో యూరియా మాత్రమే ఉపయోగించిన యేడల మొక్క ఏపుగా పెరిగి చీడ పీడలు ఆశించిన దిగుబడులు గణనీయంగా తగ్గి రైతుకి నష్టము వాటిల్లుతుంది.రసాయన ఎరువుల పూర్తి ప్రతిఫలాన్ని పొందడానికి పచ్చి రొట్టె ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు వేయడం తప్పనిసరి. సమగ్ర యాజమాన్యంతో మాత్రమే మొక్క పూర్తి ఎదుగుదలను ఆశించవచ్చు. సేంద్రియ ఎరువులు దీర్గకాలం పోషకాలు అందేలా చేస్తుంది అలాగే నెల ఉత్పర్దకతను పెంచడంలో తోడ్పడుతుంది.

Also Read: తెలంగాణలో పండించిన పంటలకు విలువ జోడిస్తేనే లాభాలు!

Leave Your Comments

Crops of Telangana: తెలంగాణలో పండించిన పంటలకు విలువ జోడిస్తేనే లాభాలు!

Previous article

Weather Apps For Farmers: రైతుసోదరులకు వాతావరణాధారిత సలహాలు మరియు సూచనలు

Next article

You may also like