నేలల పరిరక్షణమన వ్యవసాయం

Benefits of Deep Ploughs: వేసవి దుక్కులు

1
Benefits of Deep Ploughs
Benefits of Deep Ploughs

Benefits of Deep Ploughs: “వేసవి దుక్కులు” అనగా మధ్య వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు ప్రత్యేకమైన వ్యవసాయ పరికరాల సహాయంతో నేలను వాలుకు అడ్డంగా దున్నడం.ఇది సాధారంగా మే నెలలో చేస్తారు. మట్టిని ఏకకాలంలో కిందా మేడా చేసి నెలలో ఉన్న కలుపు విత్తనాలను, పురుగుల లార్వా,ప్యూపా దశలను, తెగలు కారక అవశేషాలను సూర్యరష్మి కి బహిర్గతం చేయడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలకు వాటిని నిర్వీర్యం చేయడం వేసవి దుక్కుల యొక్క అంతరార్థం. దీనితో పాటు తొలకరి సమయంలో వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది నైరుతి రుతుపవనాలు ప్రారంభమైన వెంటనే పంటలను సకాలంలో విత్తుకోవడానికి వీలు కల్పిస్తుంది.

Benefits of Deep Ploughs

Benefits of Deep Ploughs

దుక్కుల సంఖ్య మరియు లోతు కలుపు యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది.సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు 15-20 రోజుల అంతరంలో రెండు వేసవి దుక్కులు దున్నడం ఉత్తమం. దీనితో ప్రాథమిక దుక్కి అయిపోతుంది. తర్వాత మూడవ దుక్కి హారో లేదా కల్టివేటర్ తో ద్వితీయ దుక్కి చేసుకున్నట్లైతే తొలకరి ప్రారంభమైన వెంటనే విత్తడానికి ప్రధాన పొలం తయారు చేసుకొనవచ్చు.

Also Read: ఆముదం సాగుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు

వేసవి లోతు దుక్కుల వలన ప్రయోజనాలు:

  1. పై పోరా మట్టి మీద ఏర్పడ్డ గట్టి పైపొరను మెత్తగా చేయడం వలన నెలల నీరు ఇంకు సామర్థ్యం పెరుగుతుంది. కావున పంట పెరుగుదలకు కావాల్సిన నీరు మొక్క వేరు భాగంలో నిల్వ చేయబడుతుంది.
  2.  వేసవి దుక్కులు నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి.
  3.  నేలలో గాలి ప్రసారం మెరుగుపడుతుంది. కావున సూక్ష్మజీవుల చర్యలు పెరిగి నెల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.
  4. సేంద్రీయ పదార్థం త్వరగా చివకడం వలన మొక్కలకు కావలసిన పోషకాల లభ్యత బాగుంటుంది.
  5. వాయు ప్రసారం పెరగడం వలన కలుపు మరియు పురుగు మందుల అవశేషాలు, మునుపు వేసిన పంటల నుండి వెలువడే హానికరమైన అల్లెలోపతిక్ రసాయనాలను నిర్వీర్యం చేయుటకు సహాయపడుతుంది.
  6. వేడి వేసవిలో కీటకాలు మరియు తెగుళ్లు నేల లోపల పొరలలో నిద్రాణస్థితిలో ఉంటాయి. వేసవి దుక్కి నేల తారుమారు చేయడం వలన సూర్య కిరణాలు మట్టి లోపల పొరలకు ప్రవేశించి, కీటకాలు మరియు తెగుళ్ల యొక్క గుడ్లు, లార్వా మరియు ప్యూపలను డిహైడ్రాట్ చేసి చంపుతాయి. తద్వారా వేసే పంటపైన కీటకాల ఉధృతి తక్కువ అవుతుంది.
  7.  వేసవి దుక్కులు దున్నడం వలన నెమటోడ్లు(నులి పురుగులు ), తెగుళ్ల కారక బాక్టీరియా మరియు శిలీంధ్ర బీజాలు నిర్వీర్యం అవును.తద్వారా పురుగు మందుల వాడకం తగ్గించవచ్చు.
  8.  లోతుగా దున్ని నేలను తారుమారు చేయడం వలన కలుపు మొక్కలు నేల లోపల పొరలకు పోవడం వలన గాలి, వెలుతురు లేక మొలకెత్తలేవు. . పర్యవసానంగా పంట మరియు కలుపు మొక్కల మధ్య పోటీ తగ్గి, ఉత్పాదకత పెరుగుతుంది.
  9. వాలుకు అడ్డంగా పొలాన్ని దున్నడం కారణంగా నేలపైన గల సారవంతమైన పైపొరకు జరిగే గాలి, నీటి కోతను చాలా వరకు తగ్గించవచ్చు.

Also Read: బంజరు భూమిని సారవంతం చేసి జనపనార సాగు

Leave Your Comments

National Garlic Day: జాతీయ వెల్లుల్లి దినోత్సవం సందర్భంగా వెల్లుల్లి ప్రత్యేకత

Previous article

Importance of Groundnut Stripper: వేరుశనగ స్ట్రిప్పర్ ఆవశ్యకత

Next article

You may also like