Assam Manohari Gold Tea ఉదయం నిద్ర లేవగానే ఓ టీ పడందే రోజు మొదలవ్వదు. ముఖ్యంగా భారతీయులు రోజులో నాలుగైదు టీ లు తాగుతారు.ఇక అస్సాం టీ ప్రత్యేకత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.దాని రంగు, రుచి, నాణ్యత టీ లవర్స్ కి ఎంతగానో నచ్చుతుంది.కాగా అస్సాం టీ డిమాండ్ ఏ రేంజ్ లో ఉందంటే.. దాని ధర కిలో లక్ష పలికింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
డిబ్రూఘర్ జిల్లాకు చెందిన మనోహరి గోల్డ్ టీ ధర వేలం వేయగా కిలో రూ. 99,999 రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గౌహతి టీ ఆక్షన్ సెంటర్‌లో ఈ వేలం పాట జరిగగా…గతంలో నమోదు చేసిన రికార్డును మనోహరి గోల్డ్ టీ బ్రేక్ చేసింది. మనోహరి గోల్డ్ టీని సౌరవ్ ట్రేడర్స్ sourav traders కొనుగోలు చేశారు. అయితే గత సంవత్సరం మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75వేలకు అమ్ముడుపోగా ఈ ఏడాది లక్షకు చేరింది. మంగళవారం జరిగిన వేలంలో సౌరవ్ టీ ట్రేడర్స్ కిలో మనోహరి గోల్డ్ టీని కొన్నారు. Manohari Gold Tea Sold at RS 99999
Assam Manohari Gold Tea కాగా అస్సాం టీ కి విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది.విదేశాల్లో ఉండే కొన్ని బడా సంస్థలు ఎక్కువ మొత్తం చెల్లించి అస్సాం టీ ని దిగుమతి చేసుకుంటారు. సాధారణంగా తేయాకు పంటకు సరైన వర్షపాతం అవసరం. కానీ నీరు నిల్వ ఉండకూడదు. అందుకే ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతాలలో తేయాకును పండిస్తుంటారు. మన దేశంలో అసోం రాష్ట్రంలో ఎక్కువగా తేయాకును పండిస్తారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, నీలగిరి కొండల్లో కూడా తేయాకును పండిస్తుంటారు. ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో మరియు ఎగుమతిలో అగ్రస్థానంలో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి Assam Special Manohari Tea