Soil ఆరు రకాల కలుషిత పదార్ధాలు నేలలోకి చేరి నేలను కలుషితం చేస్తున్నాయి.
1) చీడ పీడలను నివారించే రసాయనాలు: పంటలకు హాని చేసి అనేక చీడ పీడలను (కీటకాలు, శిలీంద్రాలు, ఎలుకలు, నులి పురుగులు, బాక్టీరియా) నివారించ డానికి వివిధ రకాల రసాయనాలు వాడడం పరిపాటి.. అయింది,ఉదా: డి.డి.టి, బి.హెచ్. సి, 2,4,5,-T, రసాయన గుళికలు- తిమ్మెట్, కార్బోఫ్యురాస్, మెర్క్యురీ కి. సంబంధిత శిలీంద్ర నాశనులు, నేలలో విచ్చిన్నం కాక పోవడం వల్ల సూక్ష్మజీవుల మనుగడకే ప్రమాదం ఏర్పడుతున్నది. దీనిపై మానవ మనుగడ ఆధారపడి ఉన్నది.
2) విష పూరితమైన భారీ లోహాల కాలుష్యం: భారీ లోహాలైన (కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం, మెర్క్యురీ, లెడ్, నికెల్, మాలిబ్దినం, ఫ్లోరీస్, బోరాస్, కాపర్, మాంగనీస్, జింకు) వంటి పదార్ధాలు అత్యధిక పాళ్ళలో నేలలో చేరడం వల్ల నేలలు కలుషిత మవుతున్నాయి.
దీనివల్ల నేలలో గల జీవరాశుల మనుగడే ప్రశ్నార్ధకం- మొక్కలచే అవి గ్రహింపబడి వాటి నుండి వచ్చే ఆహారం తినడం వల్ల మానవుని దేహం లో ప్రవేశించి అనారోగ్యాలకు
3) సేంద్రియ వ్యర్ధ పదార్ధాలు: వీటిలో ముఖ్యంగా ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఇవి కొన్ని వందల సంవత్సరాలైనా చివకకుండా నేలలో ఉండటం వల్ల వర్షపు నీరు నేల అడుగు పొరలలోనికి ఇంకకుండా చేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటు తున్నాయి. అంతే కాక నేల ఉపరితలం కోత కు గురి కావడం జరుగుతోంది.
4) ఉప్పు లవణాల కాలుష్యం: సముద్ర తీర మరియు నదీ పరీవాహక ప్రాంతాల్లో సాగులో వున్న నేలల్లో ఉప్పు లవణాలు చేరడం వల్ల నేల సేద్యానికి పనికి రాకుండా పోతుంది.
5) ఆమ్ల వర్షాలు: పరిశ్రమ ల నుండి వెలువడే అనేక విష వాయువులు, నైట్రిక్ ఆక్సైడ్ (NO), నైట్రోజన్ డై ఆక్సైడ్ (NO:), మరియు సల్ఫర్ డై ఆక్సైడ్ (SO) గాలిలో కలిసి వర్షాకాలంలో వాన నీటిలో కలిసి ఆమ్ల వర్షాలు గా పడుతున్నాయి. దీనివల్ల నేలలో ఆమ్లత్వం సంతరించుకొని నేలలో సూక్ష్మ జీవుల మనుగడ ప్రశ్నార్ధకం గా వుతున్నది.
6) రేడియో ధార్మిక వ్యర్ధ పదార్ధాలు: అణు శక్తి ప్రస్తుతం అనేక విధాలుగా వినియోగించ బడుచున్నది. దీనిలో రేడియో ధార్మిక పదార్ధములైన స్ట్రాటియం-91, సీజియం-137 వంటివి నేలకు చేరి కలుషిత పరుస్తున్నాయి. వీటితో పాటు సహజ సిద్ధమైన రేడియో ధార్మిక పదార్ధములైన పొటాషియం-40, రూబిడియం-87, కార్బస్-14 వంటివి కూడా నేల కాలుష్యాన్ని పెంచుతున్నాయి