Soil Moisture Uses: మొక్కల పెరుగుదలకు, మొక్కలలో అనేక రసాయన, జీవ ప్రక్రియలకు, నేలలో సూక్ష్మ జీవుల పెరుగుదల, నీటిలో పోషక పదార్దాలు కరిగి నీటి ద్రావణం గా మారి మొక్కలకు పోషక పదార్ధాలను అందిస్తుంది. నీరు యానకం గా పనిచేయును. నీరు నేల నుండి ఆవిరి రూపం లోనికి మారి వాతావరణం లో కలియును. (Evaporation) నేల నుండి నీటితో కలిసియున్న పోషక పదార్ధాలను వేళ్ళ ద్వారా తీసుకొని నీటిని ఆకుల ద్వారా ఆవిరి రూపం లోకోల్పోతుంది (Transpiration). దీని వలన మొక్కల యొక్క ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది.
నేలలో నీరు – వివిధ స్థితులు:
సంతృప్త దశ: (Saturation): వర్షము పడినప్పుడు లేదా పంటకు నీరు పెట్టునపుడు స్థూల మరియు సూక్ష్మ నాళికలు అన్నీ పూర్తిగా నీటితో నిండిపోతుంది .ఈ దశ ను ” సంతృప్తి దశ ” (Saturation) అంటారు.ఈ స్థితి లో నేలలో గాలి లేనందున మొక్కలకు కావలసిన ప్రాణ వాయువు లభించదు. అందువలన మొక్కలు పోషక పదార్ధాలను తీసుకోలేవు. ఈ దశ ఎక్కువ కాలమున్నచో మొక్కలు చనిపోతాయి. ఈ దశ లో నీటిని పట్టి ఉంచే శక్తి ” 0″ ఎట్మాస్పియర్లు.
నీటి నిల్వ సామర్ధ్యం (Field Capacity): గురుత్వాకర్షణ శక్తి వలన స్థూల రంధ్రముల లోని నీరు నేల అడుగు పొరల లోనికి పోతాయి. ఈ నీటిని గురుత్వాకర్షణనీరు (Gravitational Water) అంటారు.దీనికి నేల రచన / నేల నిర్మాణాన్ని బట్టి 24 -72 గంటలు లేదా ఎక్కువ కాలము పట్ట వచ్చు. అప్పుడు స్థూల రంధ్రములలోనికి గాలి చొరబడుతుంది. ఈ స్థితి ని “నీటి నిల్వ సామర్థ్య స్థితి “(Field Capacity) అంటారు. ఈ స్థితి లో మొక్కలకు కావలసిన నీరు సూక్ష్మ రంద్రాలలో (Micro Pores), గాలి స్థూల రంధ్రాలలో (Macro Pores) లభించడం వల్ల మొక్కలకు కావలసిన పోషక పదార్ధాలను గ్రహించగలవు.ఈ స్థితి లో నీటిని పట్టి ఉంచే స్థితి 1/3 ఎట్మాస్ఫియర్లు ఈ నీటిని కేపలరీ నీరు (Capillary Water) అంటారు. ఈ నీరు సూక్ష్మ రంధ్రాలలో పైకి పోవుచు మొక్కల వేళ్ళకు అందుబాటులో ఉంటుంది.ఈ నీటిని తీసుకోవడానికి మొక్కలు కొంత శక్తిని ఉపయోగించడం వల్ల మొదట్లో తక్కువ శక్తి తో కొంత నీరు సులభంగా తీసుకొంటాయి.
శాశ్వతం గా మొక్క వడలిపోయే స్థితి (Permanent Wilting Point):
నేలనుండి, మొక్కల ఆకుల నుండి నీరు ఆవిరి రూపంలో బయటకు పోయి గాలిలో కలియడం వల్ల నేలలో తేమ రోజు రోజుకూ తగ్గిపోతుంది. కనుక పంటకు సరైన సమయంలో నీరు పెట్టనిచో పంట వడలిపోయే స్థితి కి చేరుతుంది. దీనినే పంట శాశ్వతం గా వడలి పోయే స్థితి (Permanent Wilting Point) అంటారు.పంట ఎక్కువ శక్తిని కోల్పోకుండా నీటిని తీసుకోవాలంటే నీటి నిల్వ సామర్థ్యం నుండి (Field Capacity) 50 శాతం వీరు ఖర్చు అవగానే పంటకు నీరు పెట్టాలి.పంట శాశ్వతం గా వడలి పోయే స్థితి కి రాకుండానే నీరు పెట్టాలి.ఈ స్థితి వద్ద నీటిని పట్టి వుంచే శక్తి 15 ఎట్మాస్పియర్లు
వాయురూప స్థితి (Hygroscopic Coefficient):
నేలలో నీరు ఈ స్థితి కి చేరే సరికి పంట పూర్తిగా ఎండి పోతుంది.నీరు వాయు రూపం లో ఉం టుంది.మొక్కలు ఈ నీటిని తీసుకోలేవు . నీటిని పట్టి ఉంచే శక్తి 10000 ఎట్మాస్పియర్లు. కొన్ని రకాల సూక్ష్మ జీవులు మాత్రమే ఈ నీటిని వినియోగించుకోగలవు.