Soil Components: నేల అంతర్గత భాగాల గురించి మీకు తెలుసా.!నేలలో నాలుగు అంతర్భాగములు ఇమిడి ఉన్నవి.
అవి:-
1. ఖనిజ పదార్ధం
2. సేంద్రియ పదార్థం
3. స్థూల సూక్క నాళికలు
4. సూక్ష్మ జీవులు
ఈ నాలుగు అంతర్భాగాల సమ్మేళనం సహజంగా మిళితమై ఉంటాయి. ఈ అంతర్గత భాగాల సమ్మేళన స్థాయిని అనుసరించి వీటి మధ్య జరిగే పరస్పర చర్యల ప్రభావం మొక్కల ఎదుగుదలపై గణనీయంగా చూపుతుంది.
1. ఖనిజ పదార్థం (MINERAL MATTER): మాతృ శిలల నుండి ఏర్పడిన శిలా ఖండికలు, వాటి నుండి ఏర్పడిన ఖనిజ లవణాలు ఈ ఖనిజ పదార్ధం లో ఉంటాయి.ప్రతి నేలా మోటు ఇసుక, మెత్తటి ఇసుక, ఒండ్రు, బంక మన్ను లతో కూడి ఉంటుంది. ఈ మట్టి కణాలు, గుండ్రంగా, కొన్ని కోణాకారంగా, కొన్ని దీర్ఘం గా ఉంటాయి. అంతే గాక పరిమాణంలో కూడా మోటు ఇసుకకి, మెత్తటి బంకమన్నుకి ఎంతో తేడా ఉంటుంది.రేణువుల పరిమాణం, అమరిక, నిర్మాణం, అనే అంశాల మీద భౌతిక, రసాయన, జీవ రసాయన చర్యలు ఆధార పడి తద్వారా పోషకాల లభ్యత, నేల ఉత్పాదకత సామర్ధ్యం ఆధార పడి ఉంటుంది. ఈ అంతర్గత భాగాల నిష్పత్తుల కారణంగామొక్కలకు కావలసిన నీరు, పోషక పదార్థాలు లభిస్తాయి.
2. సేంద్రియ పదార్ధము (ORGANIC MATTER): ఇది సంపూర్ణంగా గాని పాక్షికం గా కుళ్ళిన జంతు, వృక్ష అవశేషాల మిశ్రమము. దీని పరిమాణం నేలలో గల నీరు, వాతావరణ ఉష్ణోగ్రత లపై ఆధారపడి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత ప్రాంతాల్లో దీని పరిమాణం తక్కువగా ఉంటుంది. నేల సారాన్ని, నేల ఉత్పాదకత పెంచే ప్రక్రియలో ఈ సేంద్రియ పదార్ధం. పాత్ర అమోఘమైనది.
3. నేలలో నీరు (SOIL WATER): నేలలో ని స్థూల, సూక్ష్మ రంధ్రాలు (నాళికలు) స్థాయి ననుసరించి నేలలో నీటి పరిమాణం ఉంటుంది.వివిధ రకాల పోషక పదార్థాలు నీటిలో కరిగి వ్రేళ్ళ ద్వారా మొక్కలకు అందజేయబడుతుంది. నేల మరియు బాహ్య వాతావరణానికి మధ్య సంభవించే వాయు ప్రసారం gaseous exchange), శక్తి సమతుల్యత (energy balance) లో నీరు నియంత్రిస్తుంది.వివిధ భౌతిక, రసాయన, యాంత్రిక, జీవ రసాయనిక ధర్మాలను నీరు నిర్వహిస్తుంది.
Also Read: Soil pollution : నేల కాలుష్యం కావడానికి కారణాలు
4. నేలలో గాలి (SOIL AIR): నేలలోని గాలి పరిమాణం నేలలో గల నీటి పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. వాతావరణం గాలి మిశ్రమానికి, నేలలో గాలి మిశ్రమానికి తేడా ఉంటుంది. బాహ్య వాతావరణం లో గల 0.03 శాతం బొగ్గుపులుసు వాయువు (CO2) కంటే నేలలో CO, శాతం వందలాది రెట్లు అధికంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం సూక్ష్మ జీవులు, మొక్కల వేర్లు ప్రాణ వాయువు పీల్చుకొని బొగ్గుపులుసు వాయువు వదలడమే. నేలలో ప్రాణ వాయువు శాతం సాధారణంగా 20 కంటే తక్కువగా ఉంటుంది.నేలలో అధిక తేమ ఉన్నపుడు, నేలలో గాలి పరిమాణం తగ్గి మొక్క పెరుగుదలకు ప్రతికూల మవుతుంది.
సూక్ష్మ జీవులు (MICROBES): సూక్ష్మ జీవులు నేలలో గాలి, తేమ మరియు సేంద్రియ పదార్ధ పరిమాణాన్ని బట్టి వాటి సంఖ్య మారుతుంది. సేంద్రియ పదార్ధాన్ని అనేక జీవ రసాయన మార్పులకు లోను చేసి చివరగా “హ్యూమస్ “ అను పదార్థం క్రింద సూక్ష్మ జీవులే తయారు చేయగలవు, మొక్కలు తీసుకోలేని క్లిష్ట రూపంలో గల పోషక పదార్ధాలను, సులభంగా తీసుకోగల రూపాల లోనికి మార్పు చేసేవి సూక్ష్మజీవులే.
Also Read: Soil Testing: భూసార పరీక్ష గురించి సందేహాలు- సలహాలు.!