Sheep Farming: ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డి లో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది.

Sheep Farming
జాగ్రత్తలు:
గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కొనుగోలు చేసి మన రాష్ట్ర గొర్రెల సంపదను వృద్ది చేసుకోవడం జరుగుతుంది. మేలు రకపు గొర్రెలను ఎంపిక చేసిన దూర ప్రాంతాల నుండి కొనుగోలు చేసి తీసుకురావడం జరుగుతుంది. కావున గొర్రెల ఎంపికలో, రవాణా విషయంలో ప్రయాణ సమయంలో మరియు కొట్టాలలో చేర్చిన తరువాత గొర్రెల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉంది. గొర్రెల ఎంపికలో వాటి వయస్సు, జాతి, బాహ్య లక్షణాలు, శారీరక స్థితి మొదలగు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి.

Sheep
Also Read: గొర్రెల రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- అధిక మాంసాన్నిచ్చే మేలు జాతి గొర్రెలైన నెలల్లారు, డెక్కని, మాండ్య మొదలగు జాతులను ఎంపిక చేసుకోవాలి.
- ఆడ గొర్రెలు ఒకటి నుండి ఒకటిన్నర వయస్సు నుండి 25-30 కిలోల బరువు కలిగిన వాటిని ఎంపిక చేసుకోవాలి.
- క్రింది దవడకు రెండు శాశ్వత పళ్ళు వచ్చి ఉండాలి.
- పొట్టేలు ఒక్కటిన్నర నుండి రెండు సంవత్సరాల వయస్సు కలిగి సుమారు 35 కిలోల బరువుతో ఉండాలి. 2-4 శాశ్వత పళ్ళు వచ్చి ఉండాలి.
- ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలి. మేత మేయడం, నెమరు వేయడం సాధారణంగా ఉండాలి.
- చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉండాలి. కాళ్ళు నిటారుగా ఉండాలి. అంతేకాక దగ్గడం కాని, కాళ్ళు, ముక్కుల నుండి స్రావాలు కారటం కాని, దవడ క్రింద వాపు , ఉబ్బిన పెదవులు, కుంటడం మొదలగు అనారోగ్య లక్షణాలు కలిగి ఉండరాదు.
- శారీరకంగా గొర్రెలు మంచి పుష్టి కలిగి ఉండాలి.
- గొర్రెలు బక్కచిక్కి ఉండరాదు.

Sheep Farming in India
- ఆడ గొర్రెల ఎంపికలో ఒక ఈత గొర్రలె లేదా పాలు మరచిన లేదా పాలు త్రాగే ఆడ గొర్రె పిల్ల కలిగిన గొర్రెలను ఎంచుకోవాలి.
- ఆరోగ్యంగా చురుకుగా ఉండాలి. పొదుగు వాపు ఉండకూడదు.
- ఆరోగ్యంగా ఉండాలి. విత్తనపు పొట్టేలు ఎంపికలో కూడా జాగ్రత్తలు పాటించాలి. మంచి లైంగిక సామర్థ్యం కలిగి ఉండాలి. వృషణాలు సమానంగా ఉండాలి. ఎలాంటి వాపు ఉండకూడదు.
- చర్మవ్యాధులు ఉండరాదు. నెలూరు జాతి పొట్టేళ్ళ నెలూరు, కనిగిరి, కావలి, నందిగామ, గురజాడ, మాచర్ల ప్రాంతాలు మరియు దక్కన్ జాతి పొట్టేళ్ళు తెలంగాణ ప్రాంతములలో లభ్యమవుతాయి.
Also Read: మేకలలో పోషక యజమాన్యం