మనదేశంలో పండించే ఆహార పంటల్లో వరి ప్రధానమైంది. ఖరీఫ్ కాలంతో పోల్చితే రబీ కాలంలో నిర్దిష్ట సాగునీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు ఉండటమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. కాని ఖరీఫ్ తో పోల్చితే రబీ వరి సాగువ్యయం మాత్రం రెండింతల నుంచి మూడింతలు పెరిగిపోవడం వల్ల సరాసరి నికర ఆదాయం మాత్రం నామ మాత్రంగానే ఉంటుంది. దీనికి ముఖ్యకారణం రబీలో అధికదిగుబడులు సాధించవచ్చనే భావంతో రైతులు అవసరానికి మించి ఎరువులు, పురుగుమందులు ఎక్కువగా వాడటం, శీతాకాలం వాతావరణ పరిస్థితులు, అధిక కూలీల ఖర్చులు వెరసి అధిక దిగుబడులు సాధించినప్పటికీ సరాసరి నికర ఆదాయం పెరగడం లేదు.
రబీ వరిలో అధిక దిగుబడికి…
రబీ వరి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులతో పాటుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటూ తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడినిచ్చే స్వల్ప కాలిక వరి రకాలను ఎంచుకోవాలి. రబీ వరి రకాల ఎంపికలో ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకొని, వివిధ ప్రాంతాల నేలలకు అనువైన, వివిధ పద్ధతుల వరిసాగు విధానాలైన నేరుగా వెదజల్లే పద్ధతి, యాంత్రీకరణ సాగు, సాధారణ రైతువారి పద్ధతులకు అనువైన అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవాలి. రబీ కాలంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి గనుక సాగు నీటి లభ్యతను బట్టి కాండం దృఢంగా ఉండి, మంచి వేరు వ్యవస్థ కలిగిన స్వల్ప కాలిక వరి రకాలను ఎంచుకోవాలి. మరీ ముఖ్యంగా పంట కోతలు ఏప్రిల్ మాసంలోపు పూర్తయ్యే విధంగా, అధిక వేసవి తీవ్రతకు గురికాకుండా చూసుకోవాలి.

అనువైన రకాలు – వాటి గుణగణాలు:
ఎం.టి.యు 3626 (ప్రభాత్): ఈ వరి రకం 125 రోజుల కాలపరిమితితో అగ్గి తెగులును సమర్థంగా తట్టుకుంటుంది. గింజ తెలుపుతో ఉండి మధ్యస్థ పొడవు, లావుగా ఉండటం వల్ల ఈ వరి రకాన్ని బోండాలుగా పిలుస్తారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగవుతూ కేరళ, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్న రకం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉప్పుడు రవ్వగా వినియోగించే రకం. ఎకరానికి 35 – 40 క్వింటాళ్ళ దిగుబడినిస్తూ చేనుపై పడిపోని రకం.
ఎం.టి.యు 1121 (శ్రీ ధృతి): ఈ వరి రకం 125 – 130 రోజుల కాలపరిమితితో దోమ పోటును, అగ్గి తెగులును సమర్థంగా తట్టుకుంటుంది. కంకిలో చివరి వరకు గింజలు తోడుకుంటాయి. గింజ రాలిక బాగా తక్కువగా ఉండి, కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు గనుక నేరుగా వెదజల్లుటకు, కోత యంత్రాలకు అత్యంత అనుకూలమైన వరి రకం. ఎకరానికి 40 – 45 క్వింటాళ్ళ దిగుబడి నిస్తూ చేనుపై పడిపోదు.
ఎం.టి.యు 1156 (తరంగిణి): ఈ వరి రకం 120 – 125 రోజుల కాలపరిమితితో దోమ
పోటును, అగ్గి తెగులును తట్టుకుంటుంది. ఎం.టి.యు 1010 రకంలో ఉన్న గింజరాలిక, చేనుపై పడిపోయే లోపలక్షణాలకు ప్రత్యామ్నాయంగా అదే గింజ నాణ్యతతో ఉన్న వరి రకం. ఎకరానికి 35 – 40 క్వింటాళ్ళ దిగుబడి నిస్తూ చేనుపై పడిపోని రకం.
ఎం.టి.యు 1153 (చంద్ర) : ఈ వరి రకం 115 – 120 రోజుల కాలపరిమితితో దోమ పోటును, అగ్గి తెగులును బాగా తట్టుకుంటుంది. గింజరాలిక బాగా తక్కువగా ( 2 శాతం కన్నా తక్కువ) ఉండి చేనుపై పడిపోని వరి రకం. ఇది కూడా ఎం.టి.యు 1010 రకానికి ప్రత్యామ్నాయంగా అదే గింజ నాణ్యతతో ఉంటుంది. ఎకరానికి 35 – 40 క్వింటాళ్ళ దిగుబడి నిస్తూ జాతీయ స్థాయిలో 2015 సంవత్సరంలో 9 రాష్ట్రాలకు విడుదలైన వరి రకం.
ఎన్.ఎల్.ఆర్. 34449 (నెల్లూరు మషూరి): ఈ వరి రకం 120 రోజుల కాలపరిమితితో అగ్గి తెగులును అత్యంత సమర్థంగా తట్టుకునే సన్నగింజ రకం. గింజరాలిక తక్కువగా ఉండి చేనుపై పడిపోదు. దాళ్వాకు అనువైన పొట్టి రకం.
ఎం.టి.యు 1010 (కాటన్ దొర సన్నాలు): ఈ వరి రకం 115 – 120 రోజుల కాలపరిమితితో సుడిదోమను, అగ్గి తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది. ఎగుమతులకు అత్యంత అనుకూలమైన రకం. గింజరాలిక, చేనుపై పడిపోయే లక్షణం ఉండటం వల్ల కర్ర పచ్చి మీద ఉండగానే పక్వతను బట్టి కోయడం మంచిది. ముదురు నారు నాటడానికి, అక్టోబర్ మాసంలో విత్తటానికి అనుకూలమైన రకం కాదు. ఎకరానికి 30 – 35 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
ఎన్.డి.ఎల్.ఆర్. 8 (నంద్యాల సన్నాలు): ఈ వరి రకం 120 – 125 రోజుల కాలపరిమితితో సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. నీటి ఎద్దడిని తట్టుకునే సన్న గింజ రకం. గింజ సాంబ మషూరిని పోలి ఉంటుంది. ఎకరానికి 30 – 35 క్వింటాళ్ళ దిగుబడి నిచ్చే సన్నరకం.
ఎం.టి.యు 1210 (సుజాత): ఈ వరి రకం 120 – 125 రోజుల కాలపరిమితితో సుడిదోమను, అగ్గి తెగులును తట్టుకుంటుంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. గింజ రాలిక తక్కువగా ఉండటం వల్ల నేరుగా విత్తే విధానానికి బాగా అనుకూలమైన రకం. ఎకరానికి 35 – 40 క్వింటాళ్ళ దిగుబడినిస్తుంది.
ఎన్.ఎల్.ఆర్ – 3354 (నెల్లూరు ధాన్యరాశి): ఈ వరి రకం 120 – 125 రోజుల కాలపరిమితితో అగ్గి తెగులును సమర్థంగా తట్టుకుంటుంది. కాండం దృడంగా ఉండి చేనుపై పడిపోదు. దాళ్వాకు అనువైన పొట్టి రకం. గింజ రాలిక తక్కువగా ఉండి అధిక వేడిమిని తట్టుకునే గుణం కలిగి యెడగారు సాగుకు అనుకూలమైంది. మంచి నాణ్యమైన సన్నబియ్యం రకం.
ఎం.టి.యు. రైస్ 1293: ఈ వరి రకం 2022 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు విడుదలైన రకం. 120 రోజుల కాలపరిమితితో అగ్గితెగులు, పొట్టకుళ్ళు, టుంగ్రో వైరస్, ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. చౌడును సమర్థంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే వరి రకం. గింజ పొడవుగా సన్నగా ఉండి, బియ్యం పొట్ట తెలుపు లేకుండా పారదర్శకంగా ఉంటుంది. ఎగుమతికి అనువైన రకం.
ఎన్.ఎల్.ఆర్. రైస్ 3238: ఈ వరి రకం 120 – 125 రోజుల కాలపరిమితితో కొంతవరకు అగ్గి తెగులును, మెడవిరుపు తెగులును తట్టుకుంటుంది. ఈ వరి రకం 2023 సంవత్సరంలో విడుదలైంది. కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోదు. మధ్యస్థ సన్నరకం. బియ్యం నాణ్యత కలిగి, మిల్లులో ఎక్కువ బియ్యం దిగుబడినిస్తుంది. అన్నం రుచిగా ఉంటుంది. పాలిష్ బియ్యంలో అధిక జింకు శాతం (24.7 పి.పి.ఎం.) కలిగిన వరి రకం.
ఎం.టి.యు. రైస్ 1273: ఈ వరి రకం 2022 సంవత్సరంలో విడుదలైంది. 120 రోజుల కాలపరిమితితో అగ్గితెగులు, గోధుమ రంగు మచ్చ తెగులును మధ్యస్థంగా తట్టుకుంటుంది. ఎక్కువ నిండు గింజల శాతం, గింజ నాణ్యత కలిగిన పొడవు సన్న రకం. గింజ రాలే ఎం.టి.యు.1010 రకానికి ప్రత్యామ్న్యాయంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతికి అనువైనరకం.

ఎగుమతికి అనువైన రబీ వరి రకాలు:
రబీలో పండించే వరి రకాలలో కొన్ని రకాలు వివిధ దేశాలకు ముఖ్యంగా ఆఫ్రికా, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేయడానికి అత్యంత అనుకూలమైన రకాలు ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలై రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలను సాగు చేసుకోవడం వల్ల రైతుకు లాభసాటిగా ఉంటుంది. ఎగుమతికి అనువైన రబీ వరి రకాలలో ఎం.టి.యు. రైస్ 1273, ఎం.టి.యు 1010 (కాటన్ దొర సన్నాలు), ఎం.టి.యు. రైస్ 1293, ఎం.టి.యు 1156 (తరంగిణి), ఎం.టి.యు 1153 (చంద్ర) ముఖ్యమైనవి.
రబీ వరి సాగులో రకాల గురుంచి మరింత సమాచారం కోసం ఏరువాక కేంద్రం, రాజమహేంద్రవరం వారిని సంప్రదించవచ్చు.
డా. మానుకొండ శ్రీనివాస్, డా. సి.హెచ్.వి. నరసింహారావు
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఫోన్:9949599965.

Leave Your Comments