రైజోబియం బాక్టీరియా జాతికి చెందినది. ఇది మొక్క వేర్ల బొడిపెలలో ఉంటూ కావాల్సిన నత్రజనిని అందిస్తూ జీవన ఎరువుగా ఉపయోగపడుతుంది. పప్పు జాతి పంటలైన కంది, పెసర, మినుముతో పాటు వేరుశనగ, సోయాచిక్కుడు వంటి నూనె గింజల పంటలకు రైజోబియం కల్చర్ ను విత్తనాలకు పట్టించి ఉపయోగించవచ్చు. ఈ పంటలు గాలి నుంచి నత్రజనిని తీసుకోగలవు కనుక నత్రజని ఎరువులను ఎక్కువగా వేయనక్కర్లేదు. ఏ పంటకు ఉపయోగించాల్సిన రైజోబియంను ఆయా పంటలకు మాత్రమే వాడాలి. రైజోబియంను విత్తనశుద్ధి లో ఉపయోగించడం వలన ఎకరాకు 20 నుంచి 25 కిలోల నత్రజనిని మొక్కలకు అందించినట్లవుతుంది.
విత్తన శుద్ధి విధానం:
100 మిల్లీ లీటర్ల నీటిలో 10 గ్రాముల చక్కెర లేదా బెల్లంను వేసి 10 నిమిషాలు ఉడికించి చల్లార్చాలి.
చల్లబడిన తర్వాత 200 గ్రాముల రైజోబియం కల్చర్ ను కలిపి 10 కిలోల విత్తనాలపై చల్లి గింజలకు పట్టేలా కలపాలి.
తర్వాత ఈ విత్తనాలను నీడలో ఆరబెట్టి పొలంలో విత్తుకోవాలి.
రైజోబియం కల్చర్ తో విత్తనశుద్ధి..
Leave Your Comments