పంట సాగుచేసుకునే ముందు నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే 15- 20 శాతం అదనపు దిగుబడిని సాధించవచ్చు. విత్తన నాణ్యతను మొలకశాతం, తేమ, స్వచ్చత( జన్యు, భౌతిక)ల ఆధారంగా నిర్ధారిస్తారు.
విత్తన రకాలు :
-
బ్రీడరు విత్తనం : విత్తనాన్నిరూపొందించిన శాస్త్రవేత్త పర్యవేక్షణలో న్యూక్లియస్ విత్తనం ద్వారా జరుగుతుంది. ఇది నూరు శాతం స్వచ్చత కలిగి ఉంటుంది.
-
ఫౌండేషన్ విత్తనం : బ్రీడర్ విత్తనం లేదా పౌండేషన్ స్టేజి -1 నుండి ఈ విత్తనాన్ని తయారు చేస్తారు. దీనికి 98-99 శాతం జన్యుస్వచ్ఛత ఉంటుంది.
-
సర్టిఫైడ్ (ధ్రువీకరణ) విత్తనం : దీన్ని పౌండేషన్ విత్తనంతో పెంచిన పైరు నుండి సేకరిస్తారు. ఇది విత్తన ధ్రువీకరణ సంస్థచే దృవీకరించబడి 98 శాతం జన్యు మరియు భౌతిక స్వచ్ఛత, 80 శాతం మొలకశాతం, జడ పదార్థం 2 శాతం పై పొట్టులేని గింజలు 2 శాతం కలిగి ఉంటుంది.
-
ట్రూత్ ఫుల్ లేబుల్ విత్తనం : పెత్తనం దీన్ని విత్తన ధ్రువీకరణ సంస్థ ధ్రువీకరించదు. విత్తనోత్పత్తిదారులు, నాణ్యత ప్రమాణాలను పాటించి వారే స్వంతంగా, స్వంత బాధ్యత పై ఉత్పత్తి చేస్తారు. నమ్మకంతో మాత్రమే ఈ విత్తనాన్నికొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాలుగు దశల్లో తయారైన విత్తనాల్లో సర్టిఫైడ్, ట్రూత్ ఫుల్ లేబుల్ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిలో విత్తన ధ్రువీకరణ చేస్తేనే కొనుగోలు చేయాలి. దృవీకరణ సంస్థ సీలు ఉన్న విత్తనాన్నే కొనాలి. పరీక్ష చేసిన 9 నెలలలోపు వాడుకోవాలి. బ్రీడర్ విత్తనం బంగారు రంగు, పౌండేషన్ విత్తనం తెలుపు రంగు, సర్టిఫైడ్ విత్తనం నీలి రంగు, ట్రూత్ ఫుల్ లేబుల్ విత్తనం ఆకుపచ్చరంగు ట్యాగ్ గల సంచుల్లో లభిస్తాయి.
విత్తనోత్పత్తిలో మెళకువలు :
-
విత్తనోత్పత్తి సారవంతమైన, మంచినీటి వసతి ఉన్న పొలాల్లోనే చేపట్టాలి లేనిచో విత్తన నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
-
విత్తనత్పోత్తి అంతకముందు పంటకాలంలో అదే రకం వేసిన పొలంలో పంట వేసిన పొలంలో సాగు చేయటం వల్ల, స్వయం ఉత్పత్తి మొలకల వల్ల కల్తీ జరగకుండా జాగ్రత్త పడవచ్చును.
-
విత్తనోత్పత్తి చేసే పొలం చుట్టూ అదే పంటకి చెందిన వేరే రకం ఉంటే కనీసం 3 మీటర్ల ఏర్పాటు దూరం పాటించాలి.
-
భూసార పరీక్షలను అనుసరించి సిఫారసు మేరకు ఎరువులు వేయాలి. కేళీల ఏరివేత
విత్తనోత్పత్తిలో ప్రధానాంశం పంటలో కేళీలు తీయుట. ఈ కేళీల ఏరివేత ముఖ్యంగా మూడు దశలలో చేపట్టాలి.
Also Read : వెదురు పిలకల కూర అద్భుతం
అవి ఏమిటంటే ????
-
పైరు దుబ్బు చేసే సమయం
-
పూత దశ
-
గింజగట్టి పడినప్పుడు (కోతకు ముందు)
దుబ్బు చేసే సమయం : మనం సాగుచేసిన రకం భౌతిక లక్షణాలను బట్టి అంటే పైరు ఎత్తు, ఆకురంగు, పొట్టిగా లేదా పొడవుగా ఇతరత భౌతిక లక్షణాల ఆధారంగా వేర్లతో సహా తీసివేయాలి.
పూత దశ : ఈ దశలో ముందుగా పూతకు వచ్చినవి లేదా ఆలస్యంగా పూతకు వచ్చినవి పొటాకు అమరికలో వ్యత్యాసాలున్న మొక్కలను పూర్తిగా తీసివేయాలి.
గింజగట్టిపడే దశ : వెన్ను లక్షణాలు, గింజరంగు,ఆకారం ,పరిమాణం ఆధారంగా తీసివేయాలి. పై విధంగా మూడు దశల్లోనూ కేళీలు తీసివేయాలి.
విత్తనం నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : –
-
వరి కోతకు వచ్చినప్పుడు నూర్పిడి సమయాల్లో యాంత్రిక కల్తీ అనగా యంత్రాల ద్వారా గాని,పనిముట్ల ద్వారా గాని ఇతర రకాల గింజలు కలవకుండా జాగ్రత్త వహించాలి. నూర్పిడి యంత్రాల ద్వారా విత్తన కల్తీ జరుగుతుంది. కావున ఎట్టిపరిస్థితుల్లోనూ విత్తనోత్పత్తి చేలలో యంత్రాలను వాడరాదు.
-
విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమశాతం 13 శాతానికి చేరుకునే వరకు బాగా ఎండలో ఎండబెట్టాలి. కల్లల్ల్లో యాంత్రిక కల్తీ లేకుండా చూడాలి.
-
విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనే సంచులను లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే నిల్వ చేసేటప్పుడు అధిక తేమశాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వచేయాలి.
-
విత్తనాన్ని గాదెల్లో గాని, పాతరల్లో గానీ, లేదా ఎరువుల సంచుల్లో గాని నిల్వ ఉంచరాదు. విత్తనాలను నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని,పురుగు మందులను గాని ఉంచకూడదు.
డాక్టర్. ఆర్ శ్రీనివాసరావు, బి.శివ , వి.లక్ష్మీనారాయణమ్మ, యమ్.వింధ్య ,డా .ఆర్ .విశ్వతేజ మరియు యమ్.సుమన్
Also Read : మిరపలో పూతను ఆశించు తామర పురుగులు – యాజమాన్య పద్దతులు
Leave Your Comments