మన వ్యవసాయం

Seed Production in Redgram: కంది పంట విత్తనోత్పత్తిలో మెళుకువలు

0
Redgram
Redgram

Seed Production in Redgram: కంది మనరాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 2.02 లక్షల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. ఎకరాకు 180 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరిపంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు.

Seed Production in Redgram

Seed Production in Redgram

Also Read: Sweet Corn Cultivation: తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు

విత్తనోత్పత్తి :

  • విత్తనోత్పత్తి ఖరీఫ్ మరియు రబీలో చేసుకోవచ్చు. విత్తనోత్పత్తికై పండించేటప్పుడు అంతర పంటలు వేయకూడదు.
  • కందిలో స్వతహాగా కొంత పరపరాగ సంపర్కం జరుగుతుంది. కావున తగు జాగ్రత్తలతో విత్తనోత్పత్తి చేపట్టాలి. లేని యెడల అధికోత్పత్తినిచ్చే రకాలు జన్యు పరంగా క్షీణించి వాటి శక్తిని కోల్పోయే అవకాశం ఉంది.
  • వివిధ రకాల కంది పంట మరియు విత్తనోత్పత్తి పొలం మధ్య మూల విత్తనోత్పత్తికి కనీసం 250 మీ., ధృవీకరణ విత్తనోత్పత్తికి కనీసం 100 మీ. వేర్పాటు దూరాన్ని పాటించాలి.
  • నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధనా స్థానం నుండి సేకరించి తదుపరి విత్తనోత్పత్తికి వాడుకోవాలి.
  • ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫారసు మేరకు సేంద్రీయ మరియు రసాయనిక ఎరువులు వేయవలెను.
  • తమ ప్రాంతానికి అనువైన, చీడపీడలు / రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడి నిచ్చు రకాలు ఎన్నుకోవాలి.
  • కంది విత్తనోత్పత్తికి ఎన్నుకున్న పొలం ఇంతకు ముందు కంది వేసిన పొలం కాకుండా చూసుకోవాలి.
  • విత్తనపు పంటకు అంతరకృషి సకాలంలో చేసి, కీలక దశలైన మొగ్గ, పిందె, కాయ తయారగు దశలలో నీరు పారించవలెను.
  • కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.
  • పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరుకు మొక్కలను ఎత్తు, రంగు మరే విధంగానైనా తేడాగా ఉన్న మొక్కలు కనిపిస్తే పీకి వేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కల్ని తీసివేయాలి.
  • అవసరమైన సస్యరక్షణ చర్యలను సకాలములో తీసుకోవాలి.
  • కంది పూత దశ నుండి 45-60 రోజులలో పరిపక్వత చెంది కోతకు వచ్చును. కాయలు సహజ పచ్చ రంగు నుండి ఛాయ నలుపు లేదా గోధుమ రంగుకు మారిన తర్వాత పరిపక్వత చెందినట్లుగా గుర్తించి 80శాతం పైగా మొక్కలు పరిపకృతకు వచ్చిన యెడల పంటను మొక్కలతో సహా కోసి గూళ్ళుగా పెట్టి 10-12 రోజులు ఎండనిచ్చి తరువాత సూర్పిడి చేయాలి.
  • విత్తనాన్ని 9 శాతం తేము వచ్చే వరకు ఎండబెట్టి, శుద్ధి చేసి కొత్త పాలిథీన్ సంచులలో నిల్వ చేసుకోవాలి.

Also Read: Bryophyllum Pinnatum Health Benefits: రణపాలాకువలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Leave Your Comments

Sweet Corn Cultivation: తీపిజొన్న సాగులో పాటించవలసిన ముఖ్యమైన మెళకువలు

Previous article

Groundnut harvesting and Storage: వేరుశనగ కోత మరియు నిల్వ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

Next article

You may also like