చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

వేరు పురుగు చేయు చెరకు ఇంత ఇంత కాదయ్యా ….

1
Root Warm

Rootworm sugarcane crop : వేరు పురుగులు ప్రధానంగా తేలిక పాటి నేలల్లో కాని తేమ తగినంత లేని పొలాల్లో కానీ ఎక్కువ ఆశించి పంట నష్టాన్ని కలుగజేస్తాయి. గత 2 – 3 సం . నుంచి ఈ వేరుపురుగు సమస్య వివిధ పంటలలో చెరకు ,పసుపు ,మినుము,వేరు శనగ ,జొన్న ,మొక్క జొన్న పంటలలో అధికంగా గమనించడం జరిగినది. ఈ పురుగు యొక్క ఉధృతిని బట్టి సుమారు 30 – 40 శాతం వరకు పంట నష్టం కలుగుతుంది.

 

Rootworm sugarcane crop ( చెరకు పంటల్లో వేరు పురుగు )

వేరు పురుగు ఉధృతికి అనుకూల పరిస్థితులు :-  సాధారణంగా వేరు పురుగు యొక్క తల్లి పురుగులు నిద్రావ్యవస్థను కలిగియుండుట వలన తొలకరి వర్షాలు పడేంతవరకు భూమిలోనే ఉండి, వర్షాలు పడిన వెంటనే బయటకు వచ్చి ఆశ్రయాన్ని ఇచ్చే చెట్ల మీద నివసిస్తూ సంపర్కం జరుపుకొని పదునైన నేలను గుర్తించి గుడ్లను ఒక్కొక్కటగా ఒకే చోట 20 నుండి 30 (20 -30)  గుడ్లను నేలలో పెడతాయి.

  • పొలంకి దగ్గరలో తుమ్మ ,వేప ,రేగు వంటి పొడవైన చెట్లు ఉన్నప్పుడు చెట్లు కొమ్మలు పడిపోయినప్పుడు ఈ తల్లి వేరు పురుగులకు ఆశ్రయ లభ్యత ఎక్కువగా ఉంటుంది.
  • పంట చేలకు దగ్గరగా పెంటకుప్పలు ఉన్నప్పుడు మరియు పూర్తిగా కుళ్ళని (మురగని) పశువుల ఎరువును పొలంలో చల్లినప్పుడు ఈ పురుగులు ఆశించే అవకాశం పెరుగుతుంది.

పొలంలో గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు తొలుత అక్కడక్కడ ఉన్నాతేమ తగినంత లేని యెడల ఉధృతి పెరిగి పొలమంతా వ్యాపిస్తాయి.

Also Read : అరటిలో ఎరువుల యాజమాన్యం

గుర్తింపు చిహ్నాలు:-

  • తల్లి పెంకు పురుగులు ముదురు గోధుమ రంగు కలిగి సుమారు 12.25 మి.మీ పొడవు కలిగి ఉంటాయి. రాత్రి పూట చురుకుగా వ్యవహరించి చెట్లపై ఉన్న ఆకులను తిని జీవిస్తాయి. పగలు పొలంలోకి వెళ్లి భూమిలో గ్రుడ్లు పెడతాయి.
  • పిల్ల పురుగులు తెల్లగా ” C “ ఆకారంలో ఉంటాయి. మూడు దశల్లో ఈ పిల్ల పురుగులు జీవిత చక్రాన్ని ముగించి కోశస్థ దశలో ప్రవేశిస్తుంది.

జీవిత చక్రం:

  • గ్రుడ్ల దశ – 12 రోజులు
  • పిల్ల పురుగుల మొదటిదశ  – 19 , 20 రోజులు
  • పిల్ల పురుగుల రెండవ దశ  – 21 , 22 రోజులు
  • పిల్ల పురుగుల మూడవ దశ – 30 , 32 రోజులు
  • కోశస్థ దశ                       – 32 రోజులు
  • తల్లి పురుగు – 95 రోజులు , నిద్రావ్యవస్థ అయితే  – 6 నెలలు

గాయపరిచే విధానం :

sugarcane crop

sugarcane crop ( చెరకు పంట )

  • వేరు పురుగులు ,మొక్కల యొక్క వేర్ల
  • ను మరియు కాండమును తినివేయుట వలన మొక్కల ఆకులు తొలుత పసుపు రంగుకు మారి క్రమేపి ఎండిపోతాయి.
  • ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడి ,ఎండి చనిపోతాయి. మొక్కను పీకితే సులువుగా ఊడివస్తాయి.
  • మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. బెట్ట పరిస్థితుల్లో ఒక్కోసారి పంట మొత్తం చనిపోతుంది.

యాజమాన్య చర్యలు:

తల్లి పురుగు నివారణకు :-

  • తొలకరి వర్షాల సమయంలో దీపపు ఎర పెట్టడం వలన తల్లి పురుగులను ఆకర్షింపజేసి చంపవచ్చును. ఒక హెక్టారుకు పొలానికి ఒక దీపపు ఎర సరిపోతుంది.
  • పొలం చుట్టూ ఉన్న రేగు, తుమ్మ మరియు వేప చెట్ల కొమ్మలను కత్తిరించాలి. పడిపోయిన వాలిపోయిన చెట్ల కొమ్మలను తీసివేయాలి మరియు పెంట కుప్పలు లేకుండా పొలం శుభ్ర పరుచుకోవాలి.
  • చెట్ల పై వేప నూనె 5.0 మీ .లీ లేక మోనోక్రోటోఫాస్ 1.6 మీ.లీ లేక క్లోరి పైరిపాస్ 2.5 మీ.లీ లీటరు నీటికి కలిపి సాయంత్ర సమయంలో పిచికారి చేసుకోవాలి.
  • చెట్ల మొదళ్ళలో గల తల్లి పెంకు పురుగులను సేకరించి నాశనం చేయాలి.

Also Read :

పిల్ల పురుగుల నివారణకు :-

  • వేసవి దుక్కులను తప్పక చేపట్టవలెను. తద్వారా కోశస్థ దశలో ఉన్న పురుగులకు సూర్యరశ్మి తగిలి చనిపోతాయి.
  • పంట మార్పిడి తప్పని సరిగా అవలంబించాలి. వరి పంట సాగు మంచి ప్రత్యామ్నాయం.
  • జీవ నియంత్రణ పద్దతులలో బయో రసాయనం – మోటా రైజియమ్ ఎనిసోప్లియెను 2 కిలోలు 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి పొలంలో నాటే ముందు ఒకసారి ఉధృతిని బట్టి తొలకరి వానలు తదుపరి మరొకసారి వేయడం వలన వేరు పురుగును నివారించవచ్చును.
  • హెటిరోరాప్ ఇండికా అనే నులిపురుగులు జీవ రసాయనంను (2 కిలోలు) 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి వాడినపుడు మంచి ఫలితాలు ఉంటాయి.
  • వేరు పురుగుల ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో 2 – 3 రోజుల పాటు నీళ్ళు వదలాలి.

రసాయన చర్యలు :

  • విత్తే ముందు పొలంలో ఎకరాకు కార్భోపూరాన్ 3 జి  గుళికలు 10 కిలోలు (లేక) ఫిసోనిల్ 0.3 గ్రా గుళికలు 8-10 కిలోలు వేసుకోవాలి.
  • విత్తన శుద్ధి కొరకు ఒక కిలో విత్తనానికి క్లోరిపైరిఫాస్ 10 మీ. లీ (లేక) ఇమిడా క్లోప్రిడ్ 2.0 మీ . లీ ఉపయోగించుకోవాలి.
  • ఎదిగిన పైరులో (లేక) తోటలలో ఈ పురుగు ఆశించినప్పుడు మొక్కల మొదళ్ళలో గుంతలు చేసి ఫిప్రోనిల్ 0.3 గ్రా గుళికలు 10 కిలోలు లేక క్లోరోట్రానిలిఫ్రోల్ 0. 4 గ్రా గుళికలు 8 కిలోలు చొప్పున ఒక ఎకరాకు వాడుకోవాలి.
  • ఉధృతిని బట్టి మొక్కల మొదళ్ళు బాగా తడిచేలా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ లేక క్వినాల్ ఫాస్ 2.0 మీ .లీ లేక ఇమిడాక్లోఫ్రిడ్ + ప్రిపోనిల్ 1.0 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

ఈ విధంగా సూచించిన నివారణ చర్యలను వేరుపురుగుల ఉధృతిని అంచనా వేసుకొని సకాలంలో చేపట్టిన యెడల ఈ పురుగుల వలన కలిగే నష్టం నుండి మన పంటలను  రక్షించువచ్చును.

Also Read : – యాసంగి మొక్కజొన్న సాగుకు – సూచనలు

డా . డి . సుధారాణి , సీనియర్ శాస్త్రవేత్త (సస్యరక్షణ విభాగం), వ్యవసాయ పరిశోధనా స్థానం , ఉయ్యూరు కృష్ణ జిల్లా.

Leave Your Comments

సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం !

Previous article

కంది పూత దశలో తీసుకోవాల్సిన సస్యరక్షణ

Next article

You may also like