ఉద్యానశోభమన వ్యవసాయం

River Tamarind Cultivation: సుబాబుల్ సాగులో మెళుకువలు

1

River Tamarind Cultivation: సుబాబుల్ చెట్టు ఇప్పుడు అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో సహజసిద్ధంగా పెరుగుతుంది. ఈ చెట్టుకి పూసే పువ్వులు తెల్లని కేశరములతో తల వలె గుండ్రంగా ఉంటాయి. దీనిని వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీనికలప పనిముట్లకు మరియు కాగితపు గుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు. విత్తనాలలో 24 శాతం మాంసకృత్తులు కల్గి ఉంటాయి. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకునే శక్తిగల బాక్టీరియాను వేరుబుడిపెలందు కలిగి ఉంటుంది. ఎక్కువసార్లు పిలకపంట తీసుకోవచ్చు. ఉష్ణమండలాల్లో బాగా పెరుగుతుంది. వర్షపాతం 600-1700 మీ.మీ. ఉన్న ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది.

River Tamarind

River Tamarind

నేలలు

అన్నిరకాల తటస్థ నేలల్లో పెరుగుతుంది. క్షార మరియు ఆమ్ల నేలల్లో పెరగదు. లోతైన, సారవంతమైన మరియు ఎక్కువ తేమ లభ్యమయ్యే నేలలు అనుకూలమైనవి. బంజరు భూముల్లోను, చెరువు గట్లపైన, పశువుల తాకిడి లేని కాలువ గట్లపైన, పొలాల గట్లపైన పెంచవచ్చు. అటవీ వ్యవసాయంగా పంటపొలాల్లో కూడా పెంచవచ్చు.

Soil Farming

Soil Farming

నారు మొక్కల పెంపకం

రెండు సంవత్సరములు ఆపై బడిన చెట్ల నుండి విత్తనాలను సేకరించాలి. ఒక కిలోకు 16వేల నుండి 20వేల విత్తనాలుంటాయి. విత్తన శుద్ధికి గాను ఈ విత్తనాలను సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి, తీసిన విత్తనాన్ని చల్లని నీటిలో 12 గంటలు నానబెట్టి విత్తుకోవాలి. విత్తన శుద్ధి తర్వాత నారుమళ్ళలో నేరుగా విత్తడానికి వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో 4 సెంటీమీటర్ల దూరంలో 1.5 సెంటీమీటర్ల లోతుగా విత్తనాలు విత్తుకోవచ్చు. లేదా 22 * 10 సెంటీమీటర్ల పాలిథీన్ సంచుల్లో పేడ, ఎరువులను కలిపిన మట్టిని నింపి ఒక సంచికి 2 విత్తనాలు చొప్పున విత్తుకోవాలి. ఈ విత్తనాలను మార్చి, ఏప్రిల్‍లో విత్తినట్లయితే జూలైకల్లా మొక్కలు నాటటానికి తయారవుతాయి.

నాటే పద్ధతి

వేసవిలో 30 * 30 * 45 ఘ.సెం.మీ. పరిమాణం గల గుంతలను త్రవ్వితే నేల గుల్లబారి మొక్క నాటటానికి అనువుగా ఉంటుంది. వర్షాకాల ప్రారంభంలోనే మట్టి నింపిన గుంతల్లోను, సంచుల్లోను మొక్కలను నాటాలి. మొక్కల మధ్య దూరం 2 * 2 మీటర్లు గాని, 2 * 3 మీటర్లు గాని ఉంచాలి. ఎకరాకు 666 నుండి 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు.

అంతర కృషి

మొదటి సంవత్సరం మొక్కల మధ్య అంతర సాగు చేయాలి.

River Tamarind Planting

River Tamarind Planting

అంతర పంటలు

మొదటి సంవత్సరం పప్పుదినుసు జాతి పైర్లను లాభసాటిగా పెంచుకోవచ్చు. రెండవ సంవత్సరం నుండి పశుగ్రాస పైర్లను పెంచుకోవచ్చు.

Also Read: కరివేపాకు సాగు లో యాజమాన్య పద్ధతులు

River Tamarind Plants

River Tamarind Plants

యాజమాన్య పద్ధతులు

కలుపు నివారణ మొదటి 2 సంవత్సరముల వరకు చేయాలి. అవసరాన్ని బట్టి 2 నుంచి 5 సంవత్సరాల మధ్య చెట్లను నరకవచ్చు. వంటచెరుకు కయితే 2 నుంచి 3 సంవత్సరముల మధ్య నరకవచ్చు. పశుగ్రాసానికయితే ప్రతి 2 నుంచి 3 నెలలకు 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తులో నరకాలి. కాగితపు గుజ్జుకయితే 4 నుంచి 5 సంవత్సరముల మధ్య నరకవచ్చు. చెట్ల ప్రక్క కొమ్మలను ఎప్పటికప్పుడు నరికి చెట్లు ఎత్తుగా పెరిగేటట్లు చేస్తే 10 నుంచి 15 సంవత్సరముల వరకు కలప ఉత్పత్తి అవుతుంది.

దిగుబడి

సుబాబుల్ 6 సంవత్సరములలో 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. వర్షాధార ప్రాంతాల్లో సాధారణంగా కలప దిగుబడి ఎకరాకు సంవత్సరానికి 4 నుంచి 8 ఘ.మీ. వస్తుంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 2 నుంచి 3 రెట్లు అధికంగా కలప దిగుబడి వస్తుంది. పశుగ్రాసం ఎకరాకు వర్షాధార ప్రాంతాల్లో 5 నుంచి 10 టన్నులు, నీటివసతి ఉన్న ప్రాంతాల్లో 32 నుంచి 36 టన్నులు వస్తుంది.

River Tamarind Plants Firewood

River Tamarind Plants Firewood

లాభాలు

కలప గట్టిగా, నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి, ఫర్నీచర్ తయారీకి ఉపయోగపడుతుంది. గుంజలు, కంచె స్థంభాలుగా ఉపయోగపడతాయి.

పశువుల మేత, వంట చెరకు

కొమ్మలు వంటచెరుకుగా పనికివస్తాయి. ఆకులు పశుగ్రాసంగా ఉపయోగపడతాయి. మొక్కలను 8 మీటర్ల ఎడంగా రెండు ఉమ్మడి వరుసల్లో (వరుసల మధ్య దూరం 60 సెంటీమీటర్లు) నాటి, వాటిని భూమి నుండి 30 సెంటీమీటర్ల ఎత్తుకు కొస్తే ఎకరాకు 0.8 టన్నుల వరకు ఎండుమేత, అర టన్ను వంట చెరుకు లభిస్తాయి.

River tamarind plants feed on livestock

River tamarind plants feed on livestock

పచ్చి రొట్ట

సుబాబుల్‍ను పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఖరీదైన నత్రజని ఎరువులపై ఆధారపడటం తగ్గించవచ్చు. పచ్చిరొట్టగా ఉపయోగిస్తే ఎకరాకు 8 నుంచి 12 కిలోల నత్రజని లభిస్తుంది. అంతరపంటగా నత్రజని అవసరాన్ని 50 శాతం తగ్గించవచ్చు.

కాగితం గుజ్జు

కాగితం తయారీకి కావలసిన శ్రేష్ఠమైన గుజ్జు సుబాబుల్ నుండి లభిస్తుంది.

Also Read: అరటిలో అధిక దిగుబడి రావాలంటే రైతులు తప్పక చేయాల్సిన పనులు

Leave Your Comments

Indian Fisheries Sector: భారతీయ మత్స్య రంగాల్లో శాస్త్రీయ పద్ధతులు అవసరం: కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాలా

Previous article

Soil Testing Procedure: సత్వర మట్టి పరీక్షా విధానములో ఉదజని సూచికను కనుక్కొనె ప్రక్రియ

Next article

You may also like