మన వ్యవసాయం

Rice nursery : అధిక వర్షాలకు రైతులు వరి నారుమళ్ల లో పాటించాల్సిన జాగ్రత్తలు

1

Rains భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలి.

గత 3-4 రోజులుగా ముసురు, చిరుజల్లులు, కొన్ని చోట్ల భారీ అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నారుమలలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు /సూచనలు:

నారు మళ్ళు ఇప్పటి వరకు వేయకుంటే మరో 2-3 రోజులు వేచిచూడాలి. లేకుంటే వేసిన విత్తనం కుళ్ళి పోతుంది. మొలక శాతము తగ్గుతుంది. ఇప్పటికే వరి నారు మళ్ళు వేసుకున్నచోట్ల మడిలో నీరు నిలువ ఉండకుండా చూడాలి. వెదజల్లే పద్ధతిలో విత్తుకున్న పొలాల్లో, మడులలో నిలిచిన నీటిని తొలగించాలి.

చిన్న మొలకలు అధిక నీటి నిలవను తట్టుకోలేవు. కలుపు మందులు ప్రస్తుతము వాడకుండా ఉంటే మంచిది, ఎందువలన అంటే మందు పని చేసే సామర్థ్యము తగ్గిపోతుంది. మరో రెండు రోజుల్లో వాతా వరణం మామూలు స్థితికి చేరుకుంటుందనే సూచనలు ఉన్నాయి. అప్పుడు సూచించిన సిఫారసులు ప్రకారము ఎరువుల మరియు కలుపు మందులు వాడకం చేయవచ్చు. చేయాల్సిన ముఖ్యమైన పనులను చేపట్టవచ్చును. వర్షం తగ్గాక వరి నారు మళ్ళు పండు బారి పేలవంగా ఉన్నచోట్లపై పాటుగా (Urea) ఎకరాకు సరిపోయే నారు మడికి 1.5 నుండి 2 కిలోలు వేయాలి. పిచికారీ లో (Chelated Zinc 1 gr లేదా Zinc Sulphate 2 gr) లీటర్ నీటికిచొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. వరి నారు మడి నారు తీయుటకు వారము పది రోజుల ముందు తప్పనిసరిగా (Carbofuran 3G గుళికలు 800 gr) ఎకరాకుసరిపోయే 2 గుంటల నారు మడికి వేయాలి. భారీ వర్షాలకు పంట పొలాల్లో నిలిచిన నీరు ని లోతట్టు ప్రాంతాల వైపుగా కాలువలు చేసి తీసి వేయగలరు

 

Leave Your Comments

Egg Bad Combinations: గుడ్డుతో కలిపి వీటిని తింటున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్టే సుమా.!

Previous article

Black quarter disease in cattle: పశువుల లో వచ్చే జబ్బవాపు రోగం మరియు దాని నివారణ చర్యలు

Next article

You may also like