చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Rhizome rot in turmeric: పసుపు పంటలో దుంప కుళ్ళు తెగులు నివారణ చర్యలు

0
Turmeric

Turmeric సుగంధ ద్రవ్యాల పంటల్లో పసుపు ఒకటి. మనదేశంలో పసుపును ప్రధానమైన పంటగా సాగుచేస్తున్నారు. మన భారతదేశంలో పసుపును ఎక్కువ విస్తీర్ణంలో సుమారు 50 శాతం వరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోనే పండిస్తున్నారు. పసుపులో రకాలను బట్టి (210 నుండి 270) రోజుల మధ్య దుంపలను, కొమ్ములను భూమిలో నుంచి వివిధ పద్ధతుల ద్వారా తీస్తున్నారు.

పసుపును ఆహారపదార్ధాలతోపాటు, సుగంధ ద్రవ్యాలు ,ఔషదాల తయారీలో వినియోగిస్తున్నారు. మార్కెట్లో పసుపుకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులు పసుపు సాగువైపు ఆసక్తి చూపుతున్నారు.ఎంతో సువాసనతో, పసుపు విలువకు ప్రాధాన్యతనిచ్చే కుర్కుమిన్‌ పదార్ధం శాతం అధికంగా ఉంటుంది. పసుపు సాగు చేయాలనుకునే రైతులు పంట బాగా ఉండాలంటే ముందుగా విత్తన శుద్ధిలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించటం వల్ల పంట దిగుబడిని చీడపీడల నుండి కాపాడుకోవచ్చు.

లక్షణాలు:.

  • తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు పచ్చగా మారి క్రమంగా ఎండిపోతాయి.
  • ఆకులు మొదట ఆకుల చివరల నుండి ఎండడం ప్రారంభమయి ఆకు మొత్తం ఎండుతుంది.
  • తెగులు సోకిన మొక్కల వేర్లు పూర్తిగా కుళ్ళిపోతాయి.
  • దుంపలు గోధుమ రంగుకి మారిపోయి క్రమంగా దుంప మొత్తం కుళ్ళిపోయి మెత్తగా తయారవుతుంది.

  • దుంపలు ప్రకాశవంతమయిన నారింజ రంగు నుండి గోధుమ రంగుకి మారుతాయి.
  • తెగులు సోకి వడలి పసుపుగా మారిన మొక్కలను పీకితే సులువుగా పైకి వస్తాయి.

వ్యాప్తి:

తెగులు సోకిన దుంపల ద్వారా, నీటి ద్వారా మరియు నేల ద్వారా వ్యాప్తి చెందును.

నివారణ:

  • పంట మార్పిడి అవలంబించాలి.
  • పసుపు, అల్లం పంటలను తేలికపాటి నేలలలో సాగు చేయాలి.
  • మురుగు నీరు పోయే సౌకర్యం ఉండాలి.
  • ఆరోగ్యవంతమయిన దుంపలను నాటుకోవాలి.
  • విత్తన దుంపలను మెటలాక్సిల్3గ్రా./ లి. లేదా బోర్డో మిశ్రమం 1% మందు ద్రావణంలో 40 నిమిషాలు నానబెట్టి నాటుకోవాలి.
  • తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీ క్లోరైడ్2% లేదా మెటలాక్సిల్ 0.25% మందు ద్రావణంను మొదళ్ళ వద్ద పోయాలి.
  • తెగులును కొంత వరకు తట్టుకొనే పసుపు రకం అయిన పి.సి.టి. – 13,14 లను నాటుకోవాలి.
Leave Your Comments

Neem seed decoction :వేప గింజల కషాయం తయారు చేసే పద్ధతి

Previous article

Forest policy: జాతీయ వన పాలసీలు మీకు తెలుసా?

Next article

You may also like