Soil fertility పోషకాలలో భారత నేల చాలా తక్కువగా ఉందని పేర్కొంది. సాంపిల్స్‌లో దాదాపు 85 శాతం మట్టిలో ఆర్గానిక్ కార్బన్ లోపం ఉంది. వీటిలో దాదాపు 15 శాతం శాంపిల్స్‌లో ఆర్గానిక్ కార్బన్ తక్కువ స్థాయిలో ఉంది.
కారణాలు:
- పంటలు వినియోగించుకోవడం వలన: వివిధ రకాల పంటలు వివిధ పరిమాణాల్లో పోషక పదార్ధాలను తీసుకోవడం ( ఉదా: వరి 3 టన్నుల దిగుబడి వస్తే 85-15-90 కిలోల నత్రజని, భాస్వరాన్ని, పొటాషియం లను పంట తీసుకుంటుంది. అదే విధం గా 5 టన్నుల దిగుబడి నిచ్చు మొక్కజొన్న170-35-175 కిలోల నత్రజని, భాస్వరం, పొటాప్ లను తీసుకొంటుంది.
- కలుపు మొక్కలు: (weeds): పంట మొక్కల కంటే అత్యధిక పాళ్ళలో పోషక పదార్ధాలను గ్రహించడం వల్ల నేల సారం తగ్గుతుంది.
- నేల కోత: (soil erosion): సారవంతమైన నేల పై పొర కోత వల్ల (నీటి వల్ల గాని, గాలి వలన గాని) నేల సారం తగ్గి పోతుంది.
- సులభం గా కరిగే పోషక పదార్ధాలు నేల లోపలి పొరలలోనికి దిగిపోవడం (leaching): నత్రజని నైట్రేట్ రూపం లోనికి మారిన వెంటనే నీటితో పాటు వేల అడుగు పొరల లోనికి పోతుంది. సంకీర్ణ
- ఎరువులు: సంకీర్ణ ఎరువులు (28-28-0) (17-17-17) మొదలైనవి వాడడం వలన సూక్ష్మ పోషక లోపాలు కనబడతాయి.
- సూక్ష్మ పోషకాల విషయం లో శ్రద్ధ చూపకపోవడం ప్రతి పంటకు నత్రజని, భాస్వరం మరియు పొటాష్ గెల ఎరువులను అధిక మోతాదు లలో వాడుచున్నారు కాని సూక్ష్మ ధాతు పోషకాల అవసరాన్ని గమనించడం లేదు.
- పంట మార్పిడి చేయక పోవడం పంట మార్పిడి చేయక పోవడం వల్ల పంట యొక్క వేర్లు ఒకే లోతుకు చొచ్చుకొని పోయి అక్కడ గల పోషకాలనే తీసుకొంటుంది. ఆ విధం గా కాకుండా ఒక పంట పేర్లు పై పై వే వుండి పోషకాలు తీసుకొంటే (ఉదా: వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి) మరొక పంట వేర్లు లోతు గా పోవునది ఎంచు కోవాలి ( ఉదా: కంది, ప్రత్తి, పొద్దుతిరుగుడు పువ్వు). దీనివలన చీడ పీడల బాధ కూడా తగ్గును.
Leave Your Comments