Red gram Pod borers control: కంది మనరాష్ట్రంలో దాదాపు 11.25 లక్షల ఎకరాల్లో సాగుచేయబడుతూ, 2.02 లక్షల టన్నుల ఉత్పత్తి నిస్తుంది. ఎకరాకు 180 కిలోల సరాసరి దిగుబడినిస్తుంది. ప్రత్తి, మిరప, పొగాకులకు ప్రత్యామ్నాయంగా అలాగే పెసర, మినుము, సోయాచిక్కుడు, వేరుశనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కందిని ఖరీఫ్‌లో పండించవచ్చు. కందిని సాధారణంగా తొలకరిపంటగా అనేక ఇతర పంటలతో కలిపి మిశ్రమ పైరుగా సాగు చేస్తుంటారు. కందిని రబీలో కూడా పండించవచ్చు.

Red gram Pod borers control
గుర్తింపు చిహ్నాలు :
- రెక్కల పురుగులు ముందు ఇత రెక్కలు లేత గోధుమ రంగు లేదా బూడిద రంగులో వుండి పై అందులో
- (Coastal Margin) తెల్లని మెరుస్తున్న దార ఉంటుంది. గుడ్ల నుంచి వచ్చే చిన్న లద్దె పురుగులు మొదట్లో ఆకుపచ్చగా ఉండి పెరిగే కొద్ది గులాబి రంగు లేదా లేత ఎరుపు రంగులోకి మారును.
- లద్దె పురుగు ప్రాగ్యక్షం పైన ఐదు నల్లని మచ్చలు ఉండును. కంది పంట చివరి దశలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది
Also Read: వేడి కారణంగా భారీగా తగ్గిన కోడిగుడ్ల ధరలు
గాయ పరిచే విధానం గాయం లక్షణాలు:
- లద్దె పురుగు తొలి దశలో పూ మొగ్గలను ఆశించి తరువాత కాయలను తొలుచుకుంటూ లోపలికి ప్రవేశించి.
- లోపలి గింజలను (విత్తనాలను) తింటాయి.
- లార్వా విసర్జించిన విసర్జక పదార్ధం కాదు లోపం ఉంటుంది.
జీవిత చక్రం:
- తల్లి పురుగు అండాకారంలో ఉన్న తెల్లని గుడ్లను చిన్న చిన్న గుంపులుగా పూ మొగ్గల పైన, కాయల పైన పెడుతుంది.
- గుడ్లు తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
- గుడ్డు దశ 5-10 రోజులు,
- లార్వా దశ 3-5 వారాలు
- వ్యూపా దశ 2-4 వారాలు..
- ఇవి భూమిలోనే కోశస్థ దశను పూర్తి చేసుకుంటాయి.
నివారణ చర్యలు:
- ఎండోసల్ఫాన్ 2ml లేదా కార్బరిల్ 3 గ్రా॥ లేదా మోనోక్రోటోఫాస్6ml లేదా ఫెనవలరే 1ml లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.
Also Read: గ్రీన్‌హౌస్‌లో సాగు విధానం
Leave Your Comments