చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Red Palm Weevil Management in Coconut: కొబ్బరిలో ఎర్రముక్కు పురుగుని ఇలా నివారించండి.!

0
Red Palm Weevil Management in Coconut
Red Palm Weevil Management in Coconut

Red Palm Weevil Management in Coconut: కొబ్బరిని పండించటంలో కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల తరువాత తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపిలో అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగవుతుంది. కొబ్బరి మనకు భగవంతుడు ప్రసాదించిన అమృతభాండము. అందుకే కొబ్బరిని కల్పవృక్షమని పిలుస్తారు. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము మానవాళికి ఉపయోగకరము. ప్రపంచ దేశాలలో కొబ్బరితో తయారైన ఉప ఉత్పత్తులకు మంచి గిరాకి ఉన్నది. ఈ ఉప ఉత్పత్తులలో కోకో కెమికల్స్, కొబ్బరి పాలు ఉత్పన్నాలు, కొబ్బరి నీరు ఆధారంగా ఉత్పన్నాలు, కొబ్బరి టెంక మరియు కొబ్బరి పీచుతో ఉత్పన్నాలు ప్రధానమైనవి.

Red Palm Weevil Management in Coconut

Red Palm Weevil Management in Coconut

Also Read: Mango Cultivation: మామిడిలో నేల తయారీ మరియు మొక్కలు నాటుటలో మెళుకువలు.!

గుర్తింపు చిహ్నాలు (MOI) :

    • ఇది కాండాన్ని ఆశించి డొల్లగా చేస్తుంది.
    • పెంకుపురుగులు ముదురు ఎరుపు రంగులో ఉండి వంపు తిరిగిన ముక్కు కలిగి ఉండును.
    • ఉరంపైన 6 నల్లటి మచ్చలుంటాయి.
    • లద్దెపురుగు పసుపురంగులో ఉండి ఎర్రని తల కలిగి ఉండును.

గాయపర్చు విధానం & గాయం లక్షణాలు :

  • లేత కొబ్బరిచెట్లకు ఇది ఎక్కువ ప్రమాదకరం. ఇది కొమ్ము పురుగు వలె పెంకుపురుగు దశలో ఎక్కువ నష్టాన్ని లద్దెపురుగు కాండంలోపలికి ప్రవేశించి లోపల ఉన్న కణజాలాలను తింటూ కాండంలోపల భాగాన్ని దొల్లగా చేస్తుంది. ఫలితంగా చెట్లు ఎండిపోతాయి.
  • కాండంపై రంధ్రాలు ద్వారా కాఫీ రంగు జిగురు నమిలిన పిప్పి బయటికి వచ్చును. అప్పుడప్పుడు ఆకుల మట్టలు నిలువుగా చీలిపోవును. ఈ పురుగు ఆశించిన వెంటనే మొవ్వులోని ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. కాండంపై గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి.

నివారణ :

  • ఈ పురుగు ఆశించే చనిపోయిన మానులను నరికి చీల్చి తగులబెట్ట వలెను.
  • పురుగుపాటుకు లేక మొవ్వు క్రుళ్ళుతో చనిపోయిన కొమ్మలను వెంటనే తోటనుండి తొలగించవలెను.
  • కొబ్బరిచెట్టు కాండంపైన మొదలువద్ద ఏ విధమైన గాయం చేయరాదు.
  • పేర్లు నరకరాదు. పచ్చి ఆకులు లాగకూడదు.
  • ఎర్రముక్కు పురుగులను గుంపులుగా ఆకర్షించడానికి కృత్రిమ ఎరలను బకెట్లో ఉంచిక కొబ్బరిచెట్టు కాండమునకు అమర్చాలి.
  • వేరు ద్వారా మందు పెట్టాలి.
  • కొబ్బరి చెట్టు కాండానికి 100ml తారు 10g లిండేన్ పొడి కలిపి పూసినట్లయితే ఈ పురుగు యొక్క గుడ్లు పొదగబడవు.

Also Read: Soils in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ నేలల లక్షణాలు మరియు యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Botulism Disease in Cattle: పశువులలో వచ్చే బోటులిజమ్ లక్షణాలు మరియు దాని నివారణ చర్యలు.!

Previous article

Post Harvest Management in Mango: మామిడి పంట కోతానంతరం చేయవలసిన పనులు.!

Next article

You may also like