Reasons for Land Area Decrease: పంచభూతాలలో ప్రధానమైన నేలకూ మానవునకూ గల అవినాభావ సంబంధమే మానవ నాగరికతకు మూలము.మానవుడు ఆహారం కోసం అందుబాటులో గల నేలను ఉపయోగించడం తో బాటు తన దైనందిన జీవితావసరాలకు నేలను భూమాత గా ఆరాధిస్తూ నేల ఆరోగ్యం కోసం ఎంతో శ్రమించాడు. ఆటవిక మానవుడు తొలి నాళ్ళలో చెట్లను కూల్చి ఆ నేలలో తిండి గింజల్ని పండించుకొంటూ భూసారం తరిగి పోగానే మరో ప్రాంతం లో చెట్లను కొట్టి ఆ నేలను సాగు చేసుకొనేవాడు. దీనిని “పోడు” వ్యవసాయం అని పిలిచేవారు.
శిలలు, ఖనిజ పదార్ధము, సేంద్రియ పదార్ధము లతో కూడిన మిశ్రమమే నేల.వివిధ వాతావరణ (ఉష్ణోగ్రత, వర్షపాతం) ప్రభావం వల్ల మాత్రు శిలలు విచ్చిన్నమై ఖనిజ పదార్ధం, సేంద్రియ పదార్ధాలుగా మార్పు చెంది సహజ, జల, వాయు, సూక్ష్మ జీవ రాశులను సంతరించుకుని భూమి పై ఏర్పడు సన్నని పొరను “నేల” అంటాము. ఈ సన్నని పొరను ఆధారంగా చేసుకొని పంటలు పండిస్తున్నారు. ఈ పొర ఏర్పడడానికి వేల సంవత్సరాలు పడుతుంది. కనుక భూమి పై పొరను పరిరక్షించుకోవడం ప్రతి మానవుని కర్తవ్యం గా గుర్తించాలి.
Also Read: Quail Bird Rearing: కౌంజు పిట్టల పెంపకంలో మెళుకువలు.!
“పోడు” వ్యవసాయం:
వర్షాధారంగా “పోడు” వ్యవసాయం చేసుకొంటూ నీటి ప్రాధాన్యత తెలుసుకొన్న మానవుడు క్రమంగా వ్యవసాయాన్ని నదీ పరీవాహక మైదానాలకు విస్తరింప జేశాడు. జీవ నదుల నీరు పంటల సాగుకు తోడ్పడమే గాకుండా భూసారాన్ని పరిరక్షిస్తున్న విషయం అవగాహన చేసుకోవడం వల్ల “పోడు” వ్యవసాయం వదలి “సుస్థిర వ్యవసాయం” సాగించాడు. దీనితో నేల ధర్మాలు, నేల పారం, నేల ఉత్పాదకతను గురించి అవగాహనను సంతరించుకొన్నాడు.భూసారాన్ని బట్టి భూమి శిస్తును వసూలు చేయడం ప్రాచీన కాలం లోనే చైనా లో అమలు పరచిన విషయాన్ని విన్నపుడు భూసారానికున్న ప్రాధాన్యత అర్థమవుతుంది.
తగ్గుదలకు కారణాలు:
• భూ గోళం పై ఒక వంతు భూమి మూడు వంతులు నీటితో కప్పబడి ఉంది. కనుక నేల విస్తీర్ణాన్ని పెంచడానికి వీలు కాదు.
• దీనితో బాటు నేటి ఆధునిక యుగం లో నేలను వ్యవసాయం చేయడానికే కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించడం వల్ల రాను రాను వ్యవసాయం చేసే భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది.
• సారవంతమైన భూమి మరియు జలవనరులు గృహ, పారిశ్రామిక వాడల నిర్మాణానికి వినియోగించుకోవడం. కోట్లాది రూపాయల ఖనిజ సంపదను భూమి నుంచి త్రవ్వి తీయడం.
• విచక్షణా రహితంగా రసాయన ఎరువులు, పురుగు మందులు నేలలో వేయడం వల్ల భూమి ఆరోగ్యం చెడిపోయి ఆ నేలలు వ్యవసాయ యోగ్యం కాకుండా పోతున్నాయి.
• అడవులు నరికి వేయడం వల్ల నేల కోతకు గురయి సేద్యానికి పనికి రాకుండా పోతున్నాయి.
• పల్లెల్లో, పట్టణాల్లో నేలనంతటినీ కాంక్రీటుతో కప్పి వేయడం వల్ల భూమి లోపలి పొరల లోనికి నీరు ఇంకకుండా చేయడం.
Also Read: Lemongrass Cultivation: నిమ్మగడ్డి సాగులో మెళుకువలు.!