చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Rat Management in Paddy: వరిలో ఎలుకల నియంత్రణ

1
Rat Management in Paddy
Rat Management in Paddy

Rat Management in Paddy: మన రాష్ట్రంలో వరి ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో, పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేయబడుతుంది. వరి ఖరీఫ్ సుమారుగా 28 .03 లక్షల హెక్టార్లలోను, రబీలో సుమారుగా 15 .84 లక్షల హెక్టార్లలో సాగుచేయబడుతూ సుమారు 142 .10 లక్షల టన్నుల ఉత్పత్తినిస్తుంది. ఖరీఫ్ లో దిగుబడి ఎకరాకు 1196 కిలోలు, రబీలో 1472 కిలోలు మరియు సరాసరి దిగుబడి 1295 కిలోలు.

Rat Management in Paddy

Rat Management in Paddy

యాజమాన్య పద్ధతులు :

  • వరదలు ప్రకృతి వైపరిత్యాలు సంభవించిన తర్వాత ఎలుకల ఉధృతి గణనీయంగా పెరుగుతుంది. కనుక ఎలుక ఉనికిపై నిగా ఉంచాలి.
  • గట్ల సంఖ్యను పరిమాణాన్ని వీలైనంత వరకు తగ్గించడం ద్వారా వాటి నివాస స్థావరాలు చాలా వరకు తగ్గించడం ద్వారా నారుమడి పోసిన దగ్గర నుండి దమ్ము చేసిన తర్వాత నాట్లు వేసిన నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుకల గుట్టలను పెట్టినచో వలస వచ్చే మరియు పోయే ఎలుకలను సమర్ధ వంతంగా నివారించవచ్చు.
  • ఎలుకల నివారణ ఉద్యమం రూపంలో సామూహికంగా చేపడితే వాటి సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు.
  • పంట కాలంలో విషపు ఎరలను చిరుపొట్ట దశ ఏర్పడక ముందే ఉపయోగించాలి

Also Read: పసుపు రైతుల కష్టాలు

విషపు ఎరలు:

  • మోదయాలోన్ ఎరను వాడేటప్పుడు విషం కలుపునటువంటి ఎర ద్వారా ఎలుకలను మచ్చిక చేయనవసరం లేదు
  • 96 పాళ్ళ నూకలు, 2 పాళ్ళ నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున పెట్టాలి.

జింక్ ఎర:

  • ఎలుకల ఉదృతి మరి ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాలంలో ఒకసారి మాత్రమే జింకు ఫా ఎరను వాడాలి.
  • దీని కొరకు ముందుగా విషంలేని ఎర అనగా 98 పాళ్లు నూకలు, 2 పాళ్ళ మానె పొట్లాలుగా కట్టి కన్నానికి 1 W చొప్పున పెట్టి 2 రోజులు ఎలుకలను మచ్చిక చేసుకోవాలి.
  • 3 వ రోజు జింక్ ఫాస్పైడ్ ఎరను అనగా 96 పాళ్ళ మాకలు, 2 పాళ్ళు నూనె, 2 పాళ్ళ మందు పొట్లాలుగా కట్టి కన్నంలో 1 చొప్పున వేయాలి.

బర్రో ఫ్యూమిగేటర్:

పంట దశలోనైనా ఎలుకల కన్నాలలో బర్రో ప్యూమిగేటర్ ద్వారా పొగను వదిలి సులువుగా చంపవచ్చు. పొగను వదిలేటప్పుడు కన్నం చుట్టూ ఉన్న పగుళ్ళను మట్టితో మూసివేసి పొగను కనీసం 3 నిమిషాలు వదలాలి. పంట అనేక దశలో పాగబారించడం ద్వారా ఒకే కన్నంలో వివిధ దశలలో ఉన్న ఎలుకలను నిర్మూలించి తదుపరి సీజన్లో వాటి ఉదృతిని తగ్గించవచ్చు.

Also Read: కొనుగోలు పరిమితి పెంచిన కేంద్రం

Leave Your Comments

Oats Face Pack: ఓట్స్ ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా మేలు చేస్తుంది

Previous article

Curd Benefits: వేసవిలో పెరుగు దివ్యామృతం

Next article

You may also like