Ranikhet Disease in Poultry: ఈ వ్యాధిని మొట్టమొదటి సారిగా 1926వ సంవత్సరంలో డోయలి అనే శాస్త్రవేత్త యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికాలో గల న్యూకాజల్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. మన దేశంలో ఈ వ్యాధిని 1927వ సంవత్సరంలో ఎడ్వర్డ్ అనే శాస్త్రవేత్త ఉత్తరాంచల్ లోని రానిఖట్ అనే ప్రాంతంలో కనుగొన్నారు. అందుకే ఈ వ్యాధిని రానికేట్ వ్యాధి లేదా న్యూకాజల్ వ్యాధి అని కూడా పిలుస్తుంటారు. కోళ్ళలో ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ వ్యాధిలో మోర్టాలిటి 50-100 శాతం వరకు ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంటుంది. ఈ వ్యాధితో పాటు ఇన్ ఫెక్ష్యూయస్ లారింజియో ట్రెకైటిస్ వ్యాధి కూడా ఒకే సారి కోళ్ళలో కలిగి మరింత నష్టాన్ని కలిగిస్తుంటుంది.
ఈ వ్యాధి కోళ్ళతో పాటు అన్ని రకాల పక్షులలో (బాతులు, పావురాలు, కౌంజులు, గిని కోళ్ళు, ఈము, ఆస్ట్రిచ్) కూడా కలుగుటను గుర్తించుట జరిగినది. ఈ వ్యాధిలో ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థ లక్షణాలు, నాడీ మండల ఇబ్బందులతో పాటు గ్రుడ్ల ఉత్పత్తి తగ్గడం జరుగుతుంటుంది.
ఈ వ్యాధి పారామిక్సో విరిడే కుటుంబానికి చెందిన పారామిక్సో వైరస్ వలన కలుగుతుంటుంది. ఊపిరితిత్తులకు సోకే గుణం కల వైరస్ ను ఎసియాటిక్ పామ్ అని, పొట్ట, ప్రేగులు, కాలేయంకు సోకే గుణం కల వైరస్ను విజరోట్రోపిక్ వైరస్ అని, నాడీ మండలంకు సోకే గుణం కల వైరస్ను న్యూరోట్రోపిక్ వైరస్ అంటారు.
Also Read: Leptospirosis Symptoms in Cattle: పశువులలో లెప్టోస్పైరోసిస్.!
వ్యాధి బారిన పడు పక్షులు:- ఈ వ్యాధి నాటు కోళ్ళలో చాలా అరుదుగా వ్యాపిస్తుంటుంది. మిగిలిన అన్ని రకముల కోళ్ళు ఈ వ్యాధి బారిన పడుతుంటాయి. గిని ఫౌల్స్, పావురాలు, బాతులు, కౌంజు కోళ్ళు, టర్కి కోళ్ళు, ఈము, చిలుకలు మరియు అన్ని రకముల ఎగిరే పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడుతుంటాయి.
వ్యాధి కారక పక్షులు, లేదా వాటి యొక్క రెట్ట, ముక్కు స్రావాలు, గ్రుడ్లు లేదా చనిపోయిన కోళ్ళు లేదా ఇతర పక్షుల ద్వారా ఈ వ్యాధి కారకము ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపిస్తుంటుంది. ఆరోగ్యంగా ఉన్న కోళ్ళుగాలిలో ఉన్న వ్యాధి కారక క్రిమిని పీల్చుట ద్వారా లేదా కలుషిత దాణా లేదా నీటి ద్వారా లేదా గ్రుడ్డు ద్వారా పిల్లలకు వ్యాపిస్తుంటుంది.
అరుదుగా ఈ వ్యాధి లైవ్ టీకాల ద్వారా కూడా ఆరోగ్యంగా ఉన్న కోళ్ళకు వ్యాపిస్తుంటుంది. అంతే కాకుండా ఈ వ్యాధి ఫారమ్ పని చేసే మనుషులు, కుక్కలు మరియు పిల్లుల ద్వారా కూడా ఒక ఫారమ్ నుండి మరొక ఫారము వ్యాపిస్తుంటుంది.
వ్యాధి వ్యాప్తి:- ఈ వ్యాధి శరీరంలో వ్యాప్తి చెందుట అనేది వ్యాధి కారక స్ట్రెయిన్ మీద ఆధారపడి ఉంటుంది. లెంటోజెనిక్ స్ట్రెయిన్ ద్వారా వ్యాధి కలిగినప్పుడు శ్వాసకోశ ఇబ్బందులతో పాటు లేయర్ కోళ్ళలో గ్రుడ్ల ఉత్పత్తిలో తగ్గుదల ఉంటుంది. మిసోజెనిక్ స్టెయిన్ (లెస్సి లిరులెంట్) ద్వారా వ్యాధి కలిగినప్పుడు 5-15 శాతం మోర్టాలిటీ ఉండి, గ్రీనిష్ డయేరియా లక్షణాలతో, నాడీ మండల ఇబ్బందులను గమనించవచ్చు. విలోకివిక్ స్ట్రెయిన్ (విరులెంట్) ద్వారా వ్యాధి కలిగినప్పుడు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో పాటు, హిమోరీజిక్ డయేరియా ఉంటుంది.
Also Read: Pigment Methods in Pomegranate: దానిమ్మలో కాయరంగు పెంచే పద్ధతులు.!