Rains భారతదేశంలోని ప్రధాన నగరాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైతు సోదరులు అప్రమత్తంగా ఉండాలని ఈ క్రింది సూచనలు పాటించాలని మనవి.
- భారీ వర్షాలకు పంట పొలాల్లో నిలిచిన నీరు ని లోతట్టు ప్రాంతాల వైపుగా కాలువలు చేసి తీసి వేయగలరు
- రాగల మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నందున వరి నారుమడులు వర్షాలు తగ్గేదాకా వాయిదా వేసుకొగలరు.
- రైతు సోదరులు కరెంట్ ఆన్ మరియూ ఆఫ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
- ప్రత్తి పంటలో వర్షాలు ఎక్కువగా ఉండి, అంతరకృషి ద్వారా కలుపు నివారణ వీలుకాని పరిస్థితులలో ప్యారక్వాట్ (5.0 మీ.లి./లి నీటికి) తో పాటు 10 గ్రా. యూరియా లీటరు నీటికి కలుపుకొని ప్రత్తి మొక్కలపై పడకుండా, వరుసల మధ్య కలుపు మీద మాత్రమే పడేటట్లు పంటకు అందించాలి.
- అధిక వర్షాలు లేదా అధిక తేమ వంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, సిఫార్సు చేసిన ఎరువులతో పాటు అదనంగా ఎకరాకు 25-30 కిలోల నత్రజని పైపాటుగా పంటకు అందించాలి.
- మొక్కజొన్న పంట అధిక నీటిని మరియు నీటి ఎద్దడిని తట్టుకోలేడు విత్తిన తరువాత పొలంలో నీరు నిలబడితే విత్తనం మొలకెత్తదు. 30 రోజులలోపు పైరుకు అధిక నీరు హానికరం. అధిక వర్షాలతో నీరు నల్లబడకుండా బయటకు తీసివేయాలి. వర్షాలు తగ్గిన వెంటనే ఎకరాకు 25 కిలోల యూరియాను భూమిలో వేయాలి. తెగులు సోకకుండా మాంకోజెబ్ ను పిచికారీ చేయాలి.
- అధిక వర్షాలకు పంట పొలాల్లో నీరు ఎక్కువగా నిలిచినప్పుడు ఆ నీటిని తీసివేసి మెగ్నీషియం దాతు లోపం ఉన్నట్లు అయితే లీటర్ నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేయవలెను
Leave Your Comments