సేంద్రీయ ఎరువులు : చివరి దుక్కిలో 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
జీవన ఎరువులు : రైజోబియం కల్చర్ 200 గ్రాములు 8 కిలోల చొప్పున కలియబెట్టి ఆరబెట్టుకోవాలి.(పదినిమిషాలు నీడలో) ఎకరాకు 2 కిలోలు పాస్పో బ్యాక్టర్ ను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తేటప్పుడు గాని సాలల్ల్లో వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలో భాస్వరం మొక్కలకు లభ్యమగు రూపంలో మార్చును.
రసాయనిక ఎరువులు :
ఎకరానికి ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ మరియు 40 కిలోల గంధకం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డి .ఏ. పి మరియు 14 కిలోల పొటాషియం వాడాలి. 8 నుండి 12 కిలోల నీటిలో కరిగే భాస్వరాన్ని విత్తుకునేప్పుడు వేసుకోవాలి.
సూక్ష్మ పోషక లోపాలు – యాజమాన్యం :
జింక్ వారి తర్వాత శనగ సాగు చేస్తే ఉదజని సూచిక తక్కువగా ఉన్న నేలలో ఈ దాత లోపం కనిపిస్తాయి. దీని వలన ఎదుగుదల లోపించడం, కణుపుల మధ్య దూరం తగ్గి, కాలిపోయిన మచ్చలు ఏర్పడతాయి. సవరణ ఎకరాకు 20 కిలో జింక్ సల్ఫేట్ ఆఖరి దుక్కిలో వేయాలి. పైరులో లోప లక్షణాలు కనపడితే 2 గ్రా . జింక్ సల్ఫేట్ ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
ఇనుము
ఇనుము : – సున్నపు నిల్వలు వుండి, ఉదజని సూచిక ఎక్కువగా ఉన్నచో లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి పోయి రాలిపోతాయి.
సమగ్ర కలుపు యాజమాన్యం : విత్తిన 30 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.
విత్తే ముందు : ప్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుంచి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారి చేయాలి.
Also Read : కాలీఫ్లవర్ సాగులో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
అంతరకృషి : 30 నుంచి 35 రోజులు దశలో గొర్రుతో అంతర కృషి చేసి కలుపును తొలగించుకోవాలి.
నీటి యాజమాన్యం : ఈ పంటకు సుమారు 350 మీ .మీ నీరు అవసరం ఉంటుంది. నల్ల రేగడి నేలల్లో లేదా మిగులు తేమ ఎక్కువగా ఉపయోగించుకొని శీతాకాలంలో మంచులో మొక్కలు పెరుగుతాయి. నేలలో తేమను బట్టి ఒకటి లేదా రెండుసార్లు తేలికపాటి తడులు ఇవ్వాలి. పూత దశకు ముందు (విత్తిన 30 – 35 రోజులకు ఒకసారి మరియు గింజకట్టే దశలో ( విత్తిన 55 – 65 రోజులకు) ఒకసారి తడులు ఇస్తే మంచి దిగుబడులు వస్తాయి. నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తపడవలెను.
పంట కోత మరియు అనంతర చర్యలు : పంట పరిపక్వతకు చేరినప్పుడు ఆకులు మరియు కాయలు పసుపు రంగు నుంచి ఎండు గడ్డి రంగుకి మారతాయి. ఆకులు పూర్తిగా రాలిపోతాయి. ఈ దశలో పంటకోత చేసుకోవచ్చు. కంబైన్డ్ హర్వేస్టర్ సహాయంతో కూడా కోసుకోవచ్చు. కోత అనంతరం గింజలను నూర్పిడి చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. విత్తనాలను 9 % శాతం తేమ ఉండేతవరకు ఆరబెట్టి తదుపరి నిల్వ చేసుకోవడం మంచిది. ఈ విధంగా నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు.
వ్యవసాయ కళాశాల, అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
Also Read : 1.20 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం – తెలంగాణ ప్రభుత్వం