Rabbit Farming: మేతలో గుర్తుంచుకోవలసిన విషయాలు: కుందేళ్ళ పళ్ళు నిరంతరంగా పెరుగుతూ ఉంటాయి. అందుచే చిక్కని ఆహారంతో మాత్రమే కుందేళ్ళ పెంపకం అసాధ్యం.
-
Rabbit Farming
- కుందేళ్ళకు మేత ఖచ్చితంగా సమయం ప్రకారం పెట్టాలి. కుందేళ్ళకు ఆహారం ఇవ్వడం ఆలస్యమైతే అవి బెంబేలుపడి, నీరసించి బరువు తగ్గిపోతాయి.
- ఎక్కువ ఉష్ణోగ్రత వలన కుందేళ్ళు పగటిపూట ఆహారం తీసుకోవు. కాని అవి రాత్రిపూట చురుకుగా ఉంటాయి. అందుచే రాత్రి పూట కుందేళ్ళకు పచ్చిరొట్ట ఆహారంగా పెడితే వ్యర్ధం చేయకుండా తింటాయి. అందువలన ఉదయం పూట చిక్కని ఆహారం ఇవ్వాలి.
Also Read: Rabbit Farming: కుందేళ్ళ పెంపకంతో ప్రతి నెల రూ 80 వేల సంపాదన.!
- పౌష్టికాహారాన్ని చిన్న గుళికల రూపంలో ఇవ్వాలి. ఇలా చిన్న గుళికల రూపంలో ఇవ్వడం వీలుకాక పోయినట్లయితే పౌష్టికాహారానికి నీటిని కలిపి చిన్న ఉండల రూపంలో కుందేళ్ళకు ఇవ్వాలి.
- ఒక కిలో బరువున్న కుందేలుకుః రోజుకు 40 గ్రాముల పౌష్టికాహారం మరియు 40 గ్రాముల పచ్చిరొట్ట ఇవ్వాలి.
- కుందేళ్ళకు ఎల్లప్పుడూ తాజాగా ఉండే పచ్చిరొట్టను మేతగా ఇవ్వాలి. పచ్చిరొట్టను బోనులో నేల మీద వేయకూడదు కాని వాటిని బోనులో ప్రక్క భాగాలలోపలకు ఉంచవచ్చు.
- కుందేళ్ళకు రోజంతాపం శుభ్రమైన, నీటిని ఇవ్వాలి.
పౌష్టకాహారం మిశ్రమము యొక్క పాళ్ళు :
చేర్చబడిన పదార్థములు మొత్తం
మొక్కజొన్న రవ్వ (నూక) 30 భాగాలు
సజ్జల రవ్వ 30 భాగాలు
వేరుశనగ చెక్కపిండి 13 భాగాలు
గోధుమ పొట్టు 25 భాగాలు
ఖనిజ మిశ్రమం (లవణమిశ్రమం ) 1.5 భాగాలు
ఉప్పు 0.5 భాగం
Also Read: పశువుల దాణాలో పామ్ కెర్నల్ కేక్ వాడకం ఎంతో లాభదాయకం
Leave Your Comments