Quail Rearing: క్వయిల్ గ్రుడ్లను పొదుగు విధానం:
క్వయిల్ గ్రుడ్లను 18 రోజులు పొదిగించి పిల్లలను చేయించవచ్చు. కోడి గ్రుడ్లను పొదిగించడానికి ఉపయోగించే పొదుగు యంత్రాలనే వాటికి కూడా ఉపయోగించవచ్చు.
గుడ్లను అమర్చటం:
కోడి గ్రుడ్లను ఉపయోగించే సెట్టింగ్ ట్రేలు పెద్దవిగా వుండటం వలన ఆ ట్రేలుకు బదులు క్వయిల్ గ్రుడ్లను అమర్చేందుకు వీలైన ట్రేలు తయారు చేయించుకోవాలి.
గ్రుడ్లను త్రిప్పటం:
సమాన కాల పరిమితుల్లో గ్రుడ్లను 4 నుండి 8 సార్లు 15 రోజుల వరకు అనగా గ్రుడ్లను హ్యాచరీలో మార్చే వరకు త్రిప్పాలి.
క్వయిల్ పిల్లల పెంపకం:
గ్రుడ్ల నుంచి పొదగబడిన క్వయిల్ పిల్లలను 2 3 వారాల వయస్సు వరకు సాధారణ వాతావరణ పరిస్థితుల్లో పెంచడానికి వీలు కాదు. కనుక సరైన శీతోష్ణస్థితిని ఏర్పాటు చేసి వుండాలి.
పెరిగే క్వయిల్ పిల్లల పెంపకం (36 వారాల వరకు):
ఈ సమయంలో వీటికి వేడిని అందించవలసిన అవసరం లేదు. ఒక చదరపు అడుడు స్థలం 5 నుండి 6 పిల్లలకు కేటాయించాలి.
గ్రుడ్లు పెట్టే క్వయిల్లల పెంపకం:
వీటి నివాసానికి కోళ్ళ కొరకు ఉపయోగించే గృహాలు మాదిరి గృహాలనే ఉపయోగిస్తారు. వాటి వయస్సు మరియు పరిమాణాన్ని ఒట్టి 150 నుండి 180 చ. సెం.ల నేల కేటాయించాలి. దాణా స్థలం 2.5-3 సెం.మీ నీటి తొట్టి స్థలం 1.5 నుంచి 2.0 సెం.మీ వరకు ఏర్పాటు చేయాలి. సాధారణంగా కోడి 75 శాతం గ్రుడ్లు ఉదయం పూట పెడుతుంది. కాని క్వయిల్స్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల సమయంలో 75 శాతం పెడతాయి. అంతేకాక 20 శాతం గ్రుడ్లు వెలుతురు లేనిచోట పెడతాయి. క్వయిల్లు మొదటి సంవత్సరంలో పెట్టిన గ్రుడ్లులో 48 శాతం మాత్రమే రెండవ సంవత్సరంలో పెడతాయి.
మాంసం కొరకు క్వయిల్ పక్షులు పెంపకం:
క్వయిల్ పక్షుల పెంపక యాజమాన్న పద్ధతులు మాంసపు రకానికి గానీ, గ్రుడ్ల రకానికి గానీ తేడా లేదు. కాని ప్రత్యేకించి అభివృద్ధి పరచిన క్వయిల్ రకాలను మాంసం కొరకు వాడటం మంచిది మాంసానికి పెంచే క్వయిల్ను 5 వారాల వయస్సులోనే మారేట్టు చేయుట మంచిది. ఎండుకనగా అప్పటికే అవి సుమారు 150 గ్రాములు బరువు వస్తాయి. అప్పుడే డ్రస్సు చేసి తినగలిగిన క్వయిల్ బరువు 70 శాతం ఉంటుంది.
Also Read: Turkey Bird Farming: టర్కీ కోళ్ళ పెంపకంలో మెళుకువలు.!
క్వయిల్ల పోషణ:
క్వయిల్ పోషణకయ్యే ఖర్చు మొత్తం క్యయిల్లల పెంపకానికయే ఖర్చులో సూమారు 70 శాతం వరకు ఉంటుంది. అంతేకాక సరైన పెరుగుదలకు మరియు ఉత్పత్తికి అనగా గ్రుడ్ల మరియు మాంసం ఉత్పత్తికై శాస్త్రీయ పద్ధతిలో పోషకాహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. పోషకాహారం యొక్క అవసరం వాటి వయస్సు మరియు ఉత్పత్తి స్థాయిని అనుసరించి మారుతూ ఉంటుంది. 3-4 వారాల క్వయిల్స్కు వాటి ఆహారంలో 27 శాతం ప్రోటీన్స్ మరియు ఒక క్వయిల్ 2750 కిలో క్యాలరీస్ ఒక కేబీ శరీర బరువుకు అందేలా చూడాలి.
వ్యాధులు:
· వ్యాధులు పెద్దగా సొకవు
· టీకాలు, నట్టల నివారణ చర్యలు అవసరం లేదు.
· అంటిబయోటిక్స్ అవసరం ఉన్నచో దాణా యందు లేదా నీటి యందు ఇవ్వవచ్చు.
· సాధారణంగా నీటికి బ్రూడర్ నియోనియా (అస్పరిబిల్లని) వలన కలుగును. అల్సరేటివ్ డెర్మటైటిస్ వ్యాధులు కలుగుతుంది.
Also Read: Turkey Poultry Farming: లాభ సాటిగా టర్కీ కోళ్ళ పెంపకం.!