మన వ్యవసాయం

Principles of Raising forest Nursery: అటవీ మొక్కల నారుమళ్ళ పెంపకంలో సూత్రాలు

0

Forest ప్రపంచ దేశాలు అడవిని తల్లిగా భావిస్తారు. అడవి భద్రంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం అవుతుంది. అడవి లేనిదే వర్షపాతం లేదు. వర్షపాతం లేనిదే మానవ మనుగడ లేదు. నిజానికి మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మనిషి పుట్టుక మరియు మరణం వరకు అనుక్షణం సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే.మానవాళి మనుగడకు అడవి చాలా ముఖ్యమైనది. నేటికీ అనేక మంది అడవులలో జీవనోపాధి కోసం జీవిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు మహారాష్ట్ర ఉన్నాయి. మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణంలో మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం (84.53%), అరుణాచల్ ప్రదేశ్ (79.33%), మేఘాలయ (76.00%), మణిపూర్ (74.34%) మరియు నాగాలాండ్ (73.90%). ఉన్నాయి. మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, గోవా, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ, అస్సాం, ఒడిశా వంటి పన్నెండు రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 33% నుండి 75% వరకు అటవీ విస్తీర్ణం ఉంది.

సూత్రాలు:

  • ఆరోగ్యవంతమైన మరియు విగరస్ మొక్కలు ఇచ్చే విత్తనాలను తీసుకోవాలి.
  • పొడవైన మరియు Sturdy సీడింగ్స్ని పెంచుట వలన
  1. కలుపు తీవ్రతను తట్టుకొనును
  2. రహదారి ప్రాంతాలలో కూడ మంచిగా పెరుగును.
  • ఎక్సోటిక్ వృక్ష జాతులను మన దేశ వాతావరణ పరిస్థితులో పెంచుటకు తగిన జాగ్రత్తలు మొక్క యొక్క ఆరంబదశలలో నర్సరీలలో తీసుకోవాలి.
  • కొన్ని రకాలైన వృక్షాలు విత్తనాల నుండి పునరుత్పత్తి చేయబడవు. అట్టి వాటిని నర్సరీలలో పెంచుట వలన మంచి ఫలితాలను సాధించవచ్చు.
  • బలహీనమైన, నిస్సారవంతమైన నేలల్లో పెంచే మొక్కలను, కృత్రిమ పద్ధతుల్లో నర్సరీలలో పెంచుతారు.
  • కొన్ని వృక్షజాతి మొక్కలు ప్రతి సంవత్సరము విత్తనాలను ఉత్పత్తి చేయవు, మరికొన్ని చెట్ల విత్తనాలు నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఇటువంటి మొక్కలను తిరిగి నర్సరీ ద్వారానే ఉత్పత్తి చేయగలము.
Leave Your Comments

Nutrient Management in Mango: మామిడి పంట లో ఎరువుల యాజమాన్యం.!

Previous article

Alkali soils management: నల్ల చౌడు నేలల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు

Next article

You may also like