మన వ్యవసాయం

మిరపలో తామర పురుగులకు నివారణ చర్యలు…

0
Prevention of Tamara Purugu in Chilli Crop
Prevention of Tamara Purugu in Chilli Crop

Chilli Crop : మిరప తోటల్లో సకాలంలో తెగుళ్ల సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. మిరపలో ప్రస్తుతం కొమ్మ ఎండు తెగులు, పూత పురుగు, తెల్లనల్లి, తెల్లదోమ, తామర పురుగు, జెమిని వైరస్‌, కాయతోలుచు పురుగులు ఆశిస్తున్నాయి. ఇందులో తామర పురుగు ఉదృతి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే సకాలంలో గుర్తించి పలు జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి మీ సొంతం అవుతుంది. ( Prevention of Tamara Purugu in Chilli Crop )

Prevention of Tamara Purugu in Chilli Crop

Chilli Crop

పచ్చిమిర్చి తోటలకు తామర పురుగుల బెడద మొదలైంది అంటే పంటను తీవ్రంగా నష్టపరుస్తుంది. ఈ తరహా పురుగులు చెట్టు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి, కాయలను గీరుస్తాయి. దీనివల్ల ఆకులు ముడుకునిపోవడమే కాకుండా కాయల మీద చారలుగా మారుతుంది. ఇక ఆకుల రంగు మారిపోవడం గమనిస్తాము. రాగి రంగులోకి మారడంతో పిందె రాలిపోతుంది. ఇక తామర పురుగుల ఉదృతి మరింతగా పెరిగితే మొక్కలు గిడసబారుతాయి.

Prevention of Tamara Purugu in Chilli Crop

dieases of michi crop

( Prevention of Tamara Purugu in Chilli Crop )తామర పురుగుల నుంచి బయటపడాలంటే ఈ జాగ్రతలు తప్పనిసరి. నూనె పూసిన ఎరలు వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. మరికొందరు రైతులు తమర పురుగులను నశింపజేసేందుకు ఎక్కువ మోతాదులో మందులు కొట్టడం జరుగుతుంది. దీని వలన ఈ తామర పురుగులో గుడ్లుపెట్టే సామర్థ్యం ఎక్కువ అవుతుంది. దీని వల్ల తమర జాతి ఇంకా పెరగడం వల్ల పంటకు మరింత నష్టం వాటిల్లుతుంది. . కాబట్టి, సింథటిక్‌ పైరిత్రాయిడ్‌ మందులను, స్పైనోసాడ్, ప్రొఫెనోఫాస్, ఇమిడాక్లోప్రిడ్‌ లాంటి మందులు ఎక్కువ సార్లు పిచికారీ చేయకుండా వుండాలి.

 

Prevention of Tamara Purugu in Chilli Crop

chilli crop on Worms

ప్రస్తుతం మనకు అందుబాటులో వున్న పురుగు మందుల ద్వారా పిల్ల పురుగులను సులువుగా నివారించవచ్చు. కానీ, తల్లి పురుగులను నివారించడం చాలా కష్టం.తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించడం కోసం వేప సంబంధిత పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. దీనికి గాను వేప నూనె 10,000 పి.పి.యం సేకరించాలి. లీటరు నీటికి 3 మి.లీ. మరియు 0.5 గ్రా. సర్ఫ్‌ గాని ట్రైటాన్‌ – 100 గాని కలిపి పిచికారీ చేసుకోవాలి. బవేరియా బస్సియానా, లికానిసిలియం లికాని అనే జీవ శీలింద్ర నాశినిలను వాడుకోవచ్చు (5 గ్రా./ లీటరు నీటికి కలిపి దీనితో పాటు ట్రైటాన్‌ 100 0.5 గ్రా.ను కూడా కలపాలి). అందుబాటులో వున్న పురుగు మందులు: ఎసిటామిప్రిడ్‌ (ప్రైడ్‌) 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా సైయాంట్రనిలిప్రోల్‌ (బెనీవియా) 240 మి.లి./ఎకరానికి లేదా ఫిప్రోనిల్‌ 80 ఔ+40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి లేదా పోలిస్‌ (40% ఇమిడాక్లోప్రిడ్‌ + ఫిప్రోనిల్‌ 40% ఔ+ 40 గ్రా. నుండి 50 గ్రా./ఎకరానికి) మార్చి మార్చి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. మిరప రైతులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి అవసరం మేరకే వాడుకోవలసిన అవసరం చాలా వుంది. లేదంటే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహం లేదు. పొలంలో అక్కడక్కడా ప్రొద్దుతిరుగుడు మొక్కలను అకర్షక పంటగా వేసుకోవాలి. విత్తనం, మొక్కలను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు జాగ్రత్త వహించవలసిన అవసరం ఎంతైనా వుంది. ( Prevention of Tamara Purugu in Chilli Crop )

రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్‌హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.

Also Read : కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

Leave Your Comments

పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు పొందడం ఎలా..?

Previous article

కొనుగోళ్లపై కేంద్రం పునఃసమీక్షించుకోవాలి…!

Next article

You may also like