పశుపోషణమన వ్యవసాయం

Salmonellosis Disease in Cattle: పశువులలో సాల్మోనెల్లోసిస్ వ్యాధి నివారణ.!

0
Salmonellosis Disease
Salmonellosis Disease

Salmonellosis Disease in Cattle: సాల్మోనెల్లా జాతికి చెందిన దాదాపు 1000 రకాల కర్ర ఆకారపు దూమ్ర వర్ణపు సూక్ష్మజీవి సంపర్కం వలన ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పక్షులు మరియు మనుషులలో ఆకస్మికంగా లేదా దీర్ఘకాలంగా కలిగే ప్రాణాంతకమైన ఒక జునోటిక్ వ్యాధి. ప్రపంచంలోని అన్ని ఉష్ణ మండలాలతో సహ మన దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించినారు. ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్నప్పుడు ఆకస్మికంగా వాంతులు, విరోచనాలు వంటి ముఖ్య లక్షణాలుండి పశువులు మరణిస్తూంటాయి.

Salmonellosis Disease in Cattle

Salmonellosis Disease in Cattle

Also Read: Livestock Transport: పాడి పశువులను రవాణా చేయు పద్ధతులు.!

ఇది ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా, కర్ర ఆకారంలో ఉండి, చలనం కలిగి యుంటాయి. ప్యాకల్టెటివ్ ఎనరోబిక్ గుణం కూడా వీటికి కలదు. ఈ బ్యాక్టీరియాలు సాధారణంగా ప్రేగులలో జీవిస్తూ, అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యాధిని కలుగజేస్తుంటాయి. ఈ బ్యాక్టీరియాలు ప్రాణాంతకమైన ఎండోటాక్సిన్లను విడుదల చేస్తాయి.

వ్యాధి వచ్చు మార్గం:- బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఆరోగ్యంగా ఉన్న పశువులకు వ్యాపిస్తుంటుంది. అన్ని కాలాలలో ఈ వ్యాధి ప్రబలినప్పటికి, వర్షాకాలంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

వ్యాధి వ్యాప్తి చెందు విధానం:- బ్యాక్టీరియాలతో కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా ఈ క్రిములు పొట్టలోనికి చేరి, అక్కడ నుండి ప్రేగులలోకి, తద్వారా రక్తంలోకి చేరి, సెప్టిసీమియాగా మారి, కాలేయం, ఉపిరితిత్తులు, ప్లీహం, మెనింజస్, పెరిటోనియం మరియు మూత్ర పిండాలలోకి చేరతాయి.

లక్షణాలు:
తీవ్ర రూపంలో ఉన్న వ్యాధి లక్షణాలు:-

(1) విరోచనాలు అధికంగా కలుగుట వలన పశువులు నీరసంగా, కళ్ళు లోపలికి గుంతలు పడి, చర్మం ముడతలు పడి, మొద్దు బారి యుండును.
(2) శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి.
(3) నాడీ మరియు గుండె వేగం పెరిగి యుండును.
(4) జ్వరం తీవ్రత ఎక్కువగా వుండును.
(5) రూమినల్ మోటిలిటి అధికంగా వుండును.
(6) కడుపు నొప్పితో కూడిన విరోచనాలు ఈ వ్యాధి ప్రత్యేకత.
(7) ఈ వ్యాధి బారిన పడిన పశువులు నీరసంగా ఉండి సరిగ్గా నడవలేవు. ఆహారం కూడా సరిగ్గా తీసుకోవు.
(8) గొర్రెలు మరియు మేకలు ఈసుకుపోవును.

వ్యాధి కారక చిహ్నములు :-
(1) అన్ని అవయవాలలో రక్తస్రావముతో కూడిన చారలు చూడవచ్చు.
(2) ప్రేగులలో రక్తపు చారలు వుండును.
(3) కాలేయ కణాలు విచ్చిన్నం అయ్యి సాల్మోనెల్లోసిస్ నాడ్యుల్సును కలిగి యుండుటను గమనించవచ్చును.

వ్యాధి నిర్ధారణ:-
వ్యాధి చరిత్ర, వ్యాధి లక్షణాలు, వ్యాధి కారక చిహ్నముల ఆధారంగా మరియు ప్రయోగశాల పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును. ప్లేట్ ఆగ్లూటినేషన్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని సులభంగా నిర్ధారించవచ్చు..

వ్యాధి లక్షణములు చేయు చికిత్స:- జ్వరం తగ్గడానికి ఆంటి పైరెటిక్ ఔషధములను, డయేరియా తగ్గడానికి ఆస్ట్రింజెంట్స్ను, ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఆంటి ఇన్ఫ్లమేటరి ఔషదములను ఇవ్వాలి.

ఆధారం కల్పించు చికిత్స:- పశువులు నోటి ద్వారా ఆహారం తీసుకోలేవు కావున వాటికి సెలైన్ ద్రావణాలు, విటమిన్స్ మరియు మినరల్స్ ఇంజక్షన్లు ఇవ్వవలెను. సులభంగా జీర్ణం అయ్యే ఆహారంను ఇవ్వాలి. తగినంత విశ్రాంతి చాలా అవసరం.

నివారణ:-
(1) ఈ వ్యాధికి టీకా లేదు.
(2) వ్యాధి సోకిన వాటిని మంద నుండి వేరుచేయాలి.
(3) కలుషితం అయిన ఆహారం మరియు నీరు అందించరాదు.
(4) మంచి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి.

Also Read: Foot Rot Disease in Cattle: పశువులలో బురద పుండ్లు వ్యాధికి చికిత్స.!

Leave Your Comments

Foot Rot Disease in Cattle: పశువులలో బురద పుండ్లు వ్యాధికి చికిత్స.!

Previous article

Grape Cultivation: ద్రాక్ష సాగులో మెళుకువలు.!

Next article

You may also like